newssting
BITING NEWS :
*పబ్లిక్‌లో మాస్కులు పెట్టుకోవాలని అమెరికా పౌరులకు ట్రంప్ సూచన.. తాను మాత్రం మాస్క్ ధరించబోనన్న అమెరికా అధ్యక్షుడు*శ్రీలంక కొమరీస్ ప్రాంతం నుంచి రాయలసీమ వరకూ ఉపరితల ద్రోణి.. బెంగాల్‌ నుంచి ఉత్తరాంధ్ర వరకూ ఉపరితల ఆవర్తనం.. తెలంగాణలో ఈరోజు, రేపు చిరుజల్లులు-వాతావరణశాఖ*న్యూయార్క్‌లో ఖననానికి కష్టాలు.. కరోనా మరణాలతో దారుణ పరిస్థితి*లాక్ డౌన్ ను పట్టించుకోని వారిపై హైదరాబాద్ పోలీసులు కేసులు..మార్చ్ 23 నుండి ఏప్రిల్ 3 వరకు రోడ్లపై త్రిబుల్ రైడింగ్ వెళ్లిన వారు 43..డబుల్ రైడింగ్ వెళ్ళినవారు 10176.. వితౌట్ హెల్మెట్ 12724..డాక్యుమెంట్ లేని వెహికల్ 5852..రూల్స్ వయిలేషన్ చేసినవారు 5073 *తెలంగాణలో మరో 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదు..ఇవాళ భారీగా నమోదయిన పాజిటివ్ కేసులు..తెలంగాణ లో ఇప్పటి వరకు229 కరోనా పాజిటివ్ కేసులు *ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఏపీలో కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది..ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యం..లాక్ డౌన్ నిబంధనలను పక్కాగా పాటించాలి.. అత్యవసరమైతేనే బయటకు రావాలి : ఆళ్ల నాని* ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..ఎస్మా పరిధిలోకి ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య సర్వీసులు..6 నెలల పాటు ఎస్మా పరిధిలోకి తెస్తూ జీవో కూడా విడుదల..ఈ చట్టం కింద పనిచేయడానికి నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ జీవో జారీ*బియ్యం తీసుకున్నా, తీసుకోకపోయినా రెండు మూడు రోజుల్లో 87.59 లక్షల కుటుంబాలకు ఆన్ లైన్ ద్వారా రూ. 1500 నగదును వారి ఖాతాల్లో జమ : తెలంగాణ ప్రభుత్వం*కరోనాపై ఏపీ సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష*రేపటి నుంచి తిరుమలలో మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక వసంతోత్సవాలు

తెలుగు వర్శిటీ భూములపై రగడ

24-02-202024-02-2020 13:59:02 IST
Updated On 24-02-2020 17:22:08 ISTUpdated On 24-02-20202020-02-24T08:29:02.652Z24-02-2020 2020-02-24T08:29:00.496Z - 2020-02-24T11:52:08.513Z - 24-02-2020

తెలుగు వర్శిటీ భూములపై రగడ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజమండ్రిలోని తెలుగు యూనివర్శిటీ భూముల రగడ రాజుకుంటోంది. ఇప్పటికే మాజీ ఎంపీ ఉండవల్లి తెలుగు వర్శిటీ భూములను ఇళ్ళ స్థలాల కోసం తీసుకోవద్దని సీఎం జగన్ కు లేఖరాశారు. ఈ వ్యవహారంపై రాజకీయంగా దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ పలు వ్యాఖ్యలు చేశారు. భూములపై నెలకొన్న సందిగ్ధాన్ని తొలగించే పనిచేశారు.

రాజమండ్రి  తెలుగు యూనివర్శిటీ స్థలాన్ని ఇళ్ళ స్థలాలకు తీసుకోవడం లేదని, తెలుగు యూనివర్శిటీ అక్కడే వుంటుందన్నారు. విద్యార్దులు తక్కువగా వున్నందున ఖాళీగా వున్న స్థలాన్ని అధికారులు పరిశీలించారని, అంతకుమించి వేరే ఉద్దేశాలు లేవన్నారు ఎంపీ భరత్ రామ్. విద్యాసంస్థలు, దేవాదాయశాఖ భూములు ఇళ్ళ స్థలాలకు సేకరించవద్దని సిఎం జగన్ ఆదేశించారన్నారు. తెలుగుయూనివర్శిటీకి పూర్వవైభవం తీసుకువస్తామని, త్వరలోనే వర్శిటీకి వీసీని నియమిస్తామని  సిఎం జగన్ చెప్పారు. తెలుగుయూనివర్శిటీలో జ్యోతిష్యం,వాస్తు వంటి విభాగాలు ఏర్పాటు చేస్తామన్నారు. తెలుగుయూనివర్శిటీలో 1.2 ఎకరాలను చంద్రబాబు హయాంలో ప్రైవేటు గ్యాస్ సంస్థకు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు.

ఈ వ్యవహారంపై తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి స్పందించారు. ప్రాచీన తెలుగుకు పూర్వవైభవం తీసుకువస్తామని, తెలుగు సాహిత్య పీఠంగా వున్న తెలుగు యూనివర్శిటీ అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇంగ్లీష్ భాషతో పాటు తెలుగును బోధించాలని ప్రైవేటు విద్యాసంస్థలకు ఆదేశాలిచ్చామన్నారు. తెలుగు అకాడమీ ద్వారా తెలుగు భాషాభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.

విద్యార్ధులను అన్నిరంగాలలో తీర్చిదిద్దడానికే తెలుగుతో తో పాటు ఆంగ్ల భాషకు సిఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఆంగ్లంలో అభ్యాసం కోసమే ప్రభుత్వ సూళ్ళకు మాని ప్రైవేటు విద్యకు విద్యార్దులు వెళ్ళడం వల్ల ఏపీలో వందల స్కూల్స్ మూతపడ్డాయని, ఆ పరిస్థితి మున్ముందు రాదన్నారు. 

మరోవైపు ఇళ్ళ స్థలాల కోసం జగన్  ప్రభుత్వం ఇళ్లు పీకి  పందిరి వేస్తున్నట్లుగా  వ్యవహరిస్తోందని టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. విభజన పూర్తికాని రాజమండ్రి తెలుగు విశ్వవిద్యాలయం భూములు లాక్కోవాలని  చూడటం అనాలోచితం అన్నారు గోరంట్ల.

రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసే దిశగా సాగుతోందని, జగన్ ప్రభుత్వం తొమ్మిది నెలల్లో  52వేల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు. డోన్లో  ఆర్థిక మంత్రి  బుగ్గన  రాజేంద్రనాథ్ రెడ్డి  అక్రమ మైనింగ్ పై  ప్రభుత్వం ఎందుకు పెనాల్టీ  వేయలేదని, వై.సి.పి  నాయకులు  కబ్జా  చేసిన  భూములను ఇళ్ల స్థలాలకు వినియోగించాలని ఆయన డిమాండ్ చేశారు.

కరోనా రోగుల పాలిట జీవనదాయిని పోర్టబుల్‌ వెంటిలేటర్‌

కరోనా రోగుల పాలిట జీవనదాయిని పోర్టబుల్‌ వెంటిలేటర్‌

   14 hours ago


మండువేసవిలోనూ డిమాండ్ లేని విద్యుత్.. లాక్ డౌన్ ఎఫెక్ట్

మండువేసవిలోనూ డిమాండ్ లేని విద్యుత్.. లాక్ డౌన్ ఎఫెక్ట్

   15 hours ago


మోదీ మాటల్లో, చేతల్లో నేనెందుకు తలదూర్చాలి.. మమత ప్రశ్న

మోదీ మాటల్లో, చేతల్లో నేనెందుకు తలదూర్చాలి.. మమత ప్రశ్న

   15 hours ago


నాటి బాబు గ్రాఫిక్స్ కట్టడాలే నేటి క్వారంటైన్ వార్డులు!

నాటి బాబు గ్రాఫిక్స్ కట్టడాలే నేటి క్వారంటైన్ వార్డులు!

   15 hours ago


మమ్మల్ని చంపేస్తారా? ...చీరాల క్వారంటైన్ బాధితుల గోడు

మమ్మల్ని చంపేస్తారా? ...చీరాల క్వారంటైన్ బాధితుల గోడు

   17 hours ago


విజయవాడలో  కరోనా టెన్షన్.. భరోసా నింపుతున్న సీపీ

విజయవాడలో కరోనా టెన్షన్.. భరోసా నింపుతున్న సీపీ

   18 hours ago


క్యూలో జనం ..రేషన్..కరోనా పరేషాన్

క్యూలో జనం ..రేషన్..కరోనా పరేషాన్

   18 hours ago


మోడీపై అసద్ ఫైర్.. దీపాలు కాదు ట్యూబ్ లైట్ ఐడియా

మోడీపై అసద్ ఫైర్.. దీపాలు కాదు ట్యూబ్ లైట్ ఐడియా

   19 hours ago


బాదుతున్నా రోడ్లమీదికి వస్తుంటే ఏంచేయాలి: తలపట్టుకుంటున్న పోలీస్

బాదుతున్నా రోడ్లమీదికి వస్తుంటే ఏంచేయాలి: తలపట్టుకుంటున్న పోలీస్

   21 hours ago


ఏపీలో శరవేగంగా రూ.వెయ్యి పంపిణీ

ఏపీలో శరవేగంగా రూ.వెయ్యి పంపిణీ

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle