newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

తెలుగు రాష్ట్రాల్లో భారీవర్షాలు... వాతావరణశాఖ హెచ్చరిక

07-10-201907-10-2019 10:16:04 IST
Updated On 07-10-2019 12:28:28 ISTUpdated On 07-10-20192019-10-07T04:46:04.416Z07-10-2019 2019-10-07T04:44:39.811Z - 2019-10-07T06:58:28.987Z - 07-10-2019

తెలుగు రాష్ట్రాల్లో భారీవర్షాలు... వాతావరణశాఖ హెచ్చరిక
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వర్షాకాలం పూర్తవుతున్న వేళ భారీవర్షాలు, పిడుగులు జనాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో సోమవారం అక్కడక్కడా భారీ వర్షాలు, పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు, పిడుగులు పడే  అవకాశముందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. 

Image result for heavy rains

దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి కోస్తా కర్ణాటక వరకూ తెలంగాణ, మధ్య కర్ణాటకల మీదుగా 1.5 కి.మీ.ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. మధ్య ఒడిశా ప్రాంతాల్లో 1.5 కి.మీ.ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతున్నట్లు చెప్పారు. వాటి కారణంగా ఏపీ, తెలంగాణ, యానాంలలో వర్షాలు కురవడానికి అవకాశం ఉందని అధికారులు తెలపడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

ఆదివారం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడ్డాయి. పిడుగులు, ఉరుము లతో కూడిన కుండపోత కురవడంతో జనం అవస్థలు పడ్డారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లోను ఎడతెరిపిలేని వాన కురిసింది. పిడుగుపాటుకు వివిధ ప్రాంతాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

పలువురు గాయపడ్డారు. జీహెచ్‌ఎంసీ పరిథిలో ఒక్క గంటలో 7 సెం.మీ వర్షం కురిసింది.  ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం 9 సెం.మీ. వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు.

తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా చింతల్‌ చెరువుకట్టపై పిడుగుపడి ఇద్దరు వ్యక్తులు మరణించారు. తీవ్ర గాయాలపాలైన వ్యక్తిని మెరుగైన వైద్యం కోసం హైదారాబాద్‌ తరలించారు.

అలాగే వికారాబాద్‌ జిల్లా యాలాల మండలం రాస్నం గ్రామంలో పిడుగుపాటుకు ఓ రైతు మృతిచెందగా, మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు దేశవ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాల్లో అతిభారీ వర్షాల తీవ్రత కొనసాగుతోంది.

మహారాష్ట్ర, గోవా, కొంకణ్‌, తూర్పు ఉత్తరప్రదేశ్‌, మరాఠ్వాడ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌, బీహార్‌, అసోం, ఒడిశా, మేఘాలయ, కర్నాటక, కేరళ, పుదుచ్చేరి ప్రాంతాల్లో అతిభారీ వర్షాల తీవ్రత జనజీవన స్రవంతిపై ప్రభావం చూపుతోంది.

లోతట్టు ప్రాంతాలన్నీ ముంపుకు గురవుతుండడంతో కేంద్ర విపత్తు నిర్వహణశాఖ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. కోస్తాతీరప్రాంతాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle