newssting
BITING NEWS :
* ఇండియాలో కరోనా కేసులు 1,38,845, మరణాలు 4021 .. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 1854, మరణాలు 53, ఏపీలో కరోనా కేసులు 2627, మరణాలు 55* శంషాబాద్ విమానాశ్రయంలో ప్రారంభమైన విమాన సర్వీసులు..హైదరాబాద్ నుంచి మొదటి ప్లేన్ బయలుదేరింది..బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన మొదటి విమానం *మరోమారు వివాదంలో చిక్కుకున్న కూనరవి..పొందూరు తహశీల్దార్ ను దుర్భాషలాడిన కూన రవి..కూనరవి మీద పొందూరు పీఎస్ లో ఫిర్యాదు చేసిన తహశీల్దార్...కూన రవి అరెస్ట్ కి రంగం సిద్దం*టీటీడీకీ షాక్‌ ఇచ్చిన క్రైం పోలీసులు..దొంగలను పట్టుకోవాలంటే ఫోర్ వీలర్ కావాలని కండీషన్.. మంచి ఫోర్ వీలర్ కావాలని కోరుతూ టీటీడీ ఉన్నతాధికారులకు లేఖ..లేఖ చూసి షాక్‌తిన్న అధికారులు..నిన్న జేఈవో ఇంట్లో భారీ దొంగతనం..6లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు మాయం *కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్డు..3లక్షలు దాటిన ఏపీలో కరోనా పరీక్షల సంఖ్య..ఇప్పటివరకు 3,40,326 కరోనా టెస్టులు..10 లక్షల జనాభాకు 5,699 పరీక్షలతో దేశంలోనే నెంబర్‌వన్*తెలంగాణలో ఈరోజు కొత్తగా 41 కరోనా కేసులు. తెలంగాణలో మొత్తం 1854కి చేరిన కరోనా కేసులు. తెలంగాణలో ఈరోజు 24 మంది డిశ్చార్జ్. మొత్తం 1092 మంది ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 709 యాక్టివ్ కేసులు*వరంగల్ జిల్లా 9 హత్యల కేసులో వీడిన మిస్టరీ. పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన నిందితుడు. స్నేహితులతో కలిసి హత్యలకు పాల్పడ్డ నిందితుడు. నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక హత్యలు* ఏపీలో తిరుమల లడ్డూ విక్రయాలు. 13 జిల్లా కేంద్రాల్లో టీటీడీ కల్యాణ మండపాల్లో లడ్డూ విక్రయాలు. లడ్డూ ప్రసాద సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు. 1800 425 4141, 1800 425 333 333 నెంబర్లు ఏర్పాటు

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు

26-03-202026-03-2020 11:22:39 IST
Updated On 26-03-2020 11:32:17 ISTUpdated On 26-03-20202020-03-26T05:52:39.100Z26-03-2020 2020-03-26T05:52:11.566Z - 2020-03-26T06:02:17.998Z - 26-03-2020

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా పంజా విసురుతూనే వుంది. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకూ తెలంగాణలో 41, ఏపీలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువ మంది విదేశాల నుంచి వచ్చిన వారే వున్నారని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో కరోనా వైరస్‌ రెండో దశ వ్యాప్తి చెందుతోంది. రోజుకు నాలుగైదు చొప్పున పాజిటివ్ కేసులు తేలుతున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వైరస్ నియంత్రణకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది.

గుంటూరు జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ చేశారు అధికారులు. దీంతో అప్రమత్తమైన జిల్లా ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. మంగళదాస్ నగర్ లో ఇంటింటి సర్వే చేపట్టారు అధికారులు. ఇవాళ, మంగళ దాస్ నగర్ లో పారిశుద్ధ్య పనులను విస్తృతం చేశారు అధికారులు. అనుమానితుల వివరాలు అందచేయాలని అధికారులు స్థానికులను కోరారు. 

కాగా.. దేశాన్ని కమ్మేసిన కరోనా వైరస్‌ను అరికట్టేందుకు 21 రోజుల లాక్‌ డౌన్‌ సరిపోదని.. ఏప్రిల్‌ 15 తర్వాత మరిన్ని రోజులు లాక్‌డౌన్‌‌ను పొడిగించే అవకాశాలు లేకపోలేదని డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ కార్యాలయ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కేంద్రం ఆదేశాలతో కొన్ని చర్యలు చేపట్టాయి ప్రభుత్వాలు. ఏపీలో ఇప్పటికే లేబొరేటరీలను విస్తరిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ.. ఇప్పుడు ప్రత్యేక కరోనా ఆస్పత్రుల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. కరోనా అనుమానితులను గానీ, పాజిటివ్‌ వచ్చినవారిని గానీ సాధారణ ఆస్పత్రుల్లో ఉంచి చికిత్స చేయరాదని కేంద్రం ఆదేశించిన దరిమిలా.. ప్రత్యేకంగా ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 

13 జిల్లాలకు అనుకూలంగా ఉండే బోధనాస్పత్రులను గుర్తించింది. విశాఖపట్నంలోని విమ్స్‌, తిరుపతి రుయా, విజయవాడ, నెల్లూరు ప్రభుత్వాస్పత్రులను కరోనాసెంటర్లుగా మార్చారు.ఇటు లాక్ డౌన్ లో వున్న ప్రజలు సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం సూచిస్తోంది.

కరోనా వైరస్ మహమ్మారి దరి చేరకుండా ఉండాలంటే ....సామాజిక దూరం,స్వీయనియంత్రణ ప్రజలందరూ కూడా కచ్చితంగా పాటించినట్లయితే కరోనా వైరస్ ను అడ్డుకోవచ్చని పలు అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలకు తెలియజేసేందు అధికార యంత్రాగం చర్యలు చేపడుతోంది. విజయనగరం జిల్లాలో లాక్ డౌన్ ఉన్న నేపధ్యంలో పట్టణంలో నిత్యావసర వస్తువులు కొనేందుకు కొంతమంది వినియోగదారులు మార్కెట్లకు తరలివస్తున్నారు. రైతుబజార్ల దగ్గర కాస్త దూరంలో లైన్లు గీసి అందులో ఒక్కొక్కరూ ఉండేలా చూస్తున్నారు.

ఇటు ఆంధ్ర తెలంగాణ బోర్డర్ జీలుగుమిల్లి నెరుసుగూడెం సరిహద్దు వద్ద వందలాది మంది ఆంధ్ర విద్యార్ధులు పడిగాపులు పడుతున్నారు. హైదరాబాద్ నుండి వెళ్లేందుకు తరలి వచ్చిన విద్యార్థులు..చెక్ పోస్ట్ వద్ద విద్యార్థులను ఆంధ్రాలోకి అనుమతించడం లేదు పోలీసులు. తెలంగాణ నుండి సొంత గ్రామాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ ఆంధ్రా అధికారులు అనుమతించకపోవడంతో ఎటూ పాలుపోక దిక్కుతోచని స్థితిలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 

సమ్మర్ ఎఫెక్ట్ .. శ్రీశైలంలో  కుడిగట్టు జలవిద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

సమ్మర్ ఎఫెక్ట్ .. శ్రీశైలంలో కుడిగట్టు జలవిద్యుత్ ఉత్పత్తి నిలిపివేత

   16 hours ago


ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి కరోనా కలకలం

ఆసిఫాబాద్ జిల్లాలో మరోసారి కరోనా కలకలం

   20 hours ago


60 రోజుల తర్వాత విమానాలు. శంషాబాద్‌లో ప్రయాణికుల పడిగాపులు

60 రోజుల తర్వాత విమానాలు. శంషాబాద్‌లో ప్రయాణికుల పడిగాపులు

   20 hours ago


ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

   a day ago


విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

   a day ago


ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

   a day ago


మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

   a day ago


గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

   25-05-2020


భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

   25-05-2020


ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

   25-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle