newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

తెలుగు రాష్ట్రాలకు వరుణ గండం.. 19న మరో అల్పపీడనం

18-08-202018-08-2020 19:19:32 IST
2020-08-18T13:49:32.147Z18-08-2020 2020-08-18T13:49:26.916Z - - 15-05-2021

తెలుగు రాష్ట్రాలకు వరుణ గండం.. 19న మరో అల్పపీడనం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు రాష్ట్రాలను ముంచెత్తుతున్న వర్షాలు మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వరద ప్రాంతాల వాసులు వణికిపోతున్నారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈశాన్య మధ్యప్రదేశ్, ఉత్తర చత్తీస్ గడ్, ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. 

దీనికి అనుబంధంగా 5.8 ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఇది ప్రయాణించి బలహీనపడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో రేపు కూడా వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి.రేపు ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. 

మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో 19న అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి 24 గంటల్లో ఆ అల్పపీడనం బలపడి పశ్చిమ దిశగా పయనించే అవకాశం ఉంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. గోదావరి వరదలకు ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లోని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

గోదావరి మధ్యలో పంటు నిలిచిపోయింది. కోటిపల్లి నుంచి ఆయినవిల్లి మండలంలో ముంపు గ్రామాలను పరిశీలించేందుకు పలువురు వైసీపీ నేతలు, మీడియా ప్రతినిధులు పంటులో బయలుదేరారు. అయితే కపిలేశ్వరపురం మండలం అద్దంకి వారి లంక.వీరవల్లి పాలెం మార్గమధ్యంలో అకస్మాత్తుగా ఇంజిన్‌కు రిపేర్ అవడంతో పంటు నిలిచిపోయింది. బోటు ఎంతకూ స్టార్ట్ కాకపోవడంతో నేతలు బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు. బోటులో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, మరి కొందరు మీడియా ప్రతినిధులు ఉన్నారు.

 

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   2 minutes ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle