newssting
BITING NEWS :
*టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేడు విజయనగరం జిల్లాలో పర్యటన* క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో సినీ నిర్మాతల భేటి...హాజ‌రైన దగ్గుపాటి సురేష్, శ్యాంప్రసాద్ రెడ్డి, నల్లమలుపు బుజ్జి *నేడు 72వ రోజు రాజధాని ప్రాంత రైతుల ఆందోళన *వాళ కర్నూలులో సీఎం జగన్ పర్యటన...ఎమ్మెల్మే శ్రీదేవి కుమారుడి విహహానికి హాజరు కానున్న జగన్*నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలవనున్న కాంగ్రెస్ నేతలు..ఢిల్లీలో అల్లర్లపై రాష్ట్రపతికి ఫిర్యాదు *నేడు రాజధానికి సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ..హైకోర్టులో వాదనలను వినిపించనున్న ప్రభుత్వ తరపు న్యాయవాది *ఇవాళ గుంటూరు జైలు నుంచి రాజధాని రైతుల విడుదల *రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి *మహిళల టీ-20 ప్రపంచకప్...నేడు భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్

తెలుగు మీడియం రద్దు.. జగన్ మరో ఏకపక్ష నిర్ణయమేనా?

08-11-201908-11-2019 07:49:52 IST
2019-11-08T02:19:52.131Z08-11-2019 2019-11-08T02:19:46.824Z - - 27-02-2020

తెలుగు మీడియం రద్దు.. జగన్ మరో ఏకపక్ష నిర్ణయమేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో వచ్చే ఏడాది నుండి తెలుగు మీడియా కనిపించదు. ఇప్పటికే మారు మూల పల్లెలలో కూడా ప్రైవేట్ పాఠశాలలు అన్నీ ఇంగ్లీష్ మీడియం మీదనే బతుకుతుండగా వచ్చే ఏడాది విద్యాసంవత్సరం నుండి ఎనిమిదో తరగతి వరకు ఆ తర్వాత మరో దఫాలో పడవ తరగతి వరకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో కేవలం ఇంగ్లీష్ మీడియాలో మాత్రమే బోధించేవిధంగా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.

ఇప్పటి వరకు ఇంగ్లీష్-తెలుగు రెండు మాధ్యమాలలో అప్షన్ ఎంచుకొనే అవకాశం ఉండగా ఇకపై ఆ అవకాశం లేదు. రాష్ట్రంలోని ప్రతి పిల్లవాడు తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియాలోనే చదువుకోవాలి. అయితే తెలుగు లేదా ఉర్దూ ఓ సబ్జెక్టు మాత్రం ప్రతి తరగతిలో ఉంటుంది. కానీ ఒక్క సబ్జెక్టుతో వచ్చేంత సులభమైన బాష కాదు తెలుగు. ఉదాహరణకు ఇప్పటి వరకు తెలుగు మీడియంలో హిందీ ఓ సబ్జెక్టుగా ఉండగా హిందీ చదవడం.. రాయడం పూర్తిగా ఎంతమందికి వస్తుంది? అని ప్రశ్నిస్తే అందరూ తెల్లమొహమే వేస్తారు. ఇకపై ఏపీలో విద్యార్థుల తెలుగు భాష పరిస్థితి కూడా అంతే.

రాష్ట్రంలోని విద్యార్థులు ఇంగ్లీష్ భాషలో వెనకబడుతున్నారని ప్రభుత్వ పాఠశాలలో కేవలం ఆంగ్లభాష మాధ్యమం గత ప్రభుత్వంలో చంద్రబాబు అర్బన్ ప్రాంతాలలో మాత్రమే తీసుకొచ్చారు. ఆ సమయంలో రాష్ట్రంలోని తెలుగు భాషా పండితులంతా చంద్రబాబు మీద విరుచుకుపడ్డారు. మేధావులు, తెలుగు భాషను ఉద్దరించేవారిగా చెప్పుకొనే వారంతా తలొక రాయి వేసి బాబు ఎంతసేపు హైటెక్ పోకడలకు పోతారంటూ భాషా వ్యతిరేకి ముద్ర వేశారు.

అప్పుడు వ్యతిరేకించిన ఆ మేధావి వర్గంలో కొందరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నా నోరు మెదపడంలేదు. బాషా పండితులు కూడా కిక్కురుమనడం లేదు. మేధావి వర్గాన్ని కాసేపు పక్కనపెడితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది కానీ పూర్తిస్థాయిలో ఇంగ్లీష్ మీడియం బోధించేది ఎవరు? అన్నది అర్ధం కాని ప్రశ్నగా మారింది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులలో తొంబై శాతం మంది తెలుగు మీడియంలో చదువుకోగా దాదాపు అరవై శాతం మంది తెలుగు మాధ్యమంలోనే పోటీ పరీక్షలు రాసి ఉద్యోగాలకు వచ్చినవారే.

ఇంగ్లీష్ మీడియంలో చదువుకోని ఆ భాష మీద పట్టున్న ఉపాధ్యాయులు కూడా తెలుగు మీడియం పాఠశాలలో బోధిస్తూ తెలిసిన ఆ విద్యను కూడా మరుగున పెట్టేశారు. ఆంగ్లంలో బోధించడం అంటే రాష్ట్రంలో మాధ్యమాన్ని, పాఠశాలను ఇంగ్లీష్ మీడియంకు మార్చినంత సులభం కాదు. దీనికంటూ ముందస్తుగా ప్రొఫెషనల్స్ ను నియమించి ఉపాధ్యాయులకు శిక్షనిచ్చి.. మరికొంత మందిని పట్టున్న వారిని ఉపాధ్యాయులుగా నియమించి విధానాన్ని అమలు చేస్తేనే ఫలితాలుంటాయి.

ముందుగా ఎలాంటి ప్రణాళికలు లేకుండా ఒక్క సంతకం.. ఒక్క జీవో పద్ధతిలోనే విద్యావిధానాన్ని కూడా ఈ ప్రభుత్వం మార్చాలనుకుంటే దాని ఫలితాలు విద్యార్థుల భవిష్యత్తుకు శాపంగా మారుతుంది. ఏ మాధ్యమంలో బోధించాలో తెలియక ఉపాధ్యాయులు.. ఏదీ అర్ధంకాక విద్యార్థులు గందరగోళంలో పడితే మొదటికే మోసం అవుతుంది. ఇప్పటికే ఈ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు లేకుండా తీసుకున్న నిర్ణయాలు.. జారీ చేసిన జీవోల ఫలితంగా ప్రజలు కొందరు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.

ముందుగా ఈ ఏడాది చివరి నుండి తెలుగు మీడియా టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నామని ప్రభుత్వం పొడిమాటలు చెప్తున్నా ఈ ఏడాది చివరికి ఇప్పుడున్న విద్యార్థులకు కీలకమైన పరీక్షల సమయం వస్తుంది. మరి ఉపాధ్యాయులు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారు? అన్నది కూడా ఆలోచించుకోవాలి. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొనే ముందు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నది అన్నదాని మీదనే ఈ విధానం అమలు ఫలితాలు ఆధారపడనున్నాయి. మరి అసలు ప్రణాళికలు ఉండే తెలుగును రద్దు చేశారా? లేక ఇది కూడా ఏకపక్ష నిర్ణయమేనా?!


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle