newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

తెలుగు తమ్ముళ్ళ పోరాట బాట

25-07-201925-07-2019 14:28:26 IST
Updated On 25-07-2019 14:42:27 ISTUpdated On 25-07-20192019-07-25T08:58:26.311Z25-07-2019 2019-07-25T08:58:21.782Z - 2019-07-25T09:12:27.133Z - 25-07-2019

తెలుగు తమ్ముళ్ళ పోరాట బాట
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ అసెంబ్లీలో అధికార పార్టీ తీరుపై విపక్ష తెలుగుదేశం సభ్యులు తమ నిరసన గళం వినిపిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గురువారం ఉదయం అసెంబ్లీ గేటు ఎదుట ఆందోళన చేపట్టారు. తమ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.

సభను నడిపించేది స్పీకరా?లేదా ముఖ్యమంత్రా? అంటూ ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. ‘స్పీకర్ ఏకపక్ష వైఖరి వీడాలి’ అంటూ నినాదాలు చేశారు. తెదేపా శ్రేణులపై దాడులు అరికట్టాలని ఆందోళన చేపట్టారు. అసెంబ్లీ ఆవరణ నుంచి శాసనసభ వరకు ప్లకార్డులతో ర్యాలీ చేపట్టారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాలినడకన శాసనసభకు బయలుదేరి వెళ్లారు.  రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలపై ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు. పోరాటాలు ఇంకా ముమ్మరం చేస్తామని, ఇది ఆరంభం మాత్రమేనని చంద్రబాబు వెల్లడించారు. తమ సస్పెన్షన్ రాజ్యాంగ విరుద్ధమని, తాము వాకౌట్ చేస్తామంటే సీఎం ఆదేశాల ప్రకారం సస్పెండ్ చేశారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకుడికి మైక్ ఇవ్వని సభను ఇంత వరకు చూడలేదని వారు మండిపడ్డారు.

శాసనసభలో మాట్లాడే అవకాశం కల్పించనందుకు నిరసనగా టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. సభ నుంచి బయటకు వచ్చేశారు చంద్రబాబు సహా ఇతర ఎమ్మెల్యేలు. ఈసందర్భంగా సీఎం జగన్ తీరుపై మండిపడ్డారు.

Image

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన నోట్లకు హైదరాబాద్ లో ఏపీ భవనాలు ఇచ్చేసారని.. సభలో ప్రశ్న లేవనెత్తారు రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పై మాట్లాడే అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఉన్న ఏపీ ఆస్తులు వేలకోట్లు విలువ చేస్తాయని, వాటిని జగన్ ఎలా ఇచ్చేస్తారంటూ నిలదీశారు టీడీపీ సభ్యులు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle