newssting
BITING NEWS :
*కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష *విజయవాడ రానున్న ఏపీ కొత్త గవర్నర్ బి.బి హరిచందన్ *బీజేపీ పార్లమెంటరీ సమావేశం*బీజేపీలో చేరనున్న మాజీ ఎంపీ వివేక్* ఎర్రమంజిల్ భవనం కూల్చివేతే కేసుపై హైకోర్టులో విచారణ *ప్రారంభం కానున్న జపాన్ ఓపెన్ బ్యాట్మింటన్ టోర్నీ

తెలుగు తమ్ముళ్ళ కొత్త టెన్షన్

31-05-201931-05-2019 12:09:40 IST
Updated On 25-06-2019 13:43:07 ISTUpdated On 25-06-20192019-05-31T06:39:40.673Z31-05-2019 2019-05-31T06:39:38.922Z - 2019-06-25T08:13:07.848Z - 25-06-2019

తెలుగు తమ్ముళ్ళ కొత్త టెన్షన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో తెలుగు త‌మ్ముళ్లకు ఇప్పుడో భ‌యం ప‌ట్టుకుంద‌ట‌. ఈ ఐదేళ్ల పాటు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు స‌మ‌ర్థవంతంగా నెట్టుకు రాగ‌ల‌రా అన్నదే వారి అనుమానం, ఆందోళ‌న‌గా తెలుస్తోంది. ఎందుకంటే గ‌తంలో ఉన్నంత ఉత్సాహం, వ‌య‌సు రీత్యా చంద్రబాబులో త‌గ్గింద‌నీ, ఆరోగ్య స‌మ‌స్యలు కూడా ఆయ‌న్ని ఇబ్బంది పెడుతున్నట్లు కొంద‌రు తెలుగు త‌మ్ముళ్లు చెబుతున్న మాట‌. 

పార్టీ ప‌రంగా గ్రామ స్థాయి నుంచీ బ‌లంగా ఉన్నా, ముందు ముందు రోజుల్లో జ‌గ‌న్ దూకుడు ముందు కేడ‌ర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అన్న భ‌యం వారిలో క‌నిపిస్తోంద‌ట‌. గ్రామ‌స్థాయి నుంచీ పార్టీ నేత‌ల‌కు జ‌గ‌న్ పార్టీ వ‌ల వేస్తే, త‌మ‌కు ఇబ్బందులు త‌ప్పవ‌నీ, ఇక కేసులు, ఆరోప‌ణ‌ల‌తో కొంత‌మంది నేత‌లు పార్టీ మారే ప‌రిస్థితుల‌ను కూడా ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌నీ చెబుతున్నారు. ఈ ప‌రిణామాల‌ను చంద్రబాబు ఎలా ఎదుర్కొంటార‌న్నదే ప్రధాన స‌మ‌స్యగా భావిస్తున్నారు. చంద్రబాబు త‌ర్వాత ఆయ‌న కుమారుడు లోకేష్ నాయ‌క‌త్వంలో పార్టీ ఏ మేర‌కు నిల‌బ‌డుతుంది అన్నది కూడా వారి భ‌యాన్ని రెట్టింపు చేస్తోంద‌ట‌. 

ఒక‌వేళ జ‌గ‌న్ టీడీపీ నేత‌ల‌ను త‌మ పార్టీలోకి చేర్చుకోక‌పోయినా, ఏపీ మీద క‌న్నేసిన బీజేపీ మాత్రం క‌చ్చితంగా న‌యానో, భయానో టీడీపీ నేత‌ల‌ను లాగేయ‌డం ఖాయ‌మ‌ని ఊహిస్తున్నారు. ఇన్ని ప‌రిణామాల మ‌ధ్య 2024లో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు మ‌రోసారి అధికారంలోకి తేవ‌డం కుదిరే ప‌నేనా అనేది కొంద‌రు తెలుగు త‌మ్ముళ్ల అనుమానం. మ‌రో విష‌యం ఏంటంటే, జ‌గ‌న్ పార్టీకి స‌రైన పోటీ తామేనంటూ ఈ మ‌ధ్యనే బీజేపీ నేత, రాజ్యసభ ఎంపీ జీవీఎల్ న‌రసింహారావు ప్రక‌టించారు. 

ఇద్దరు మాజీ మంత్రులు, కొంద‌రు ఎంఎల్ఏలు త‌మ‌తో ట‌చ్ లో ఉన్నార‌ని జీవీఎల్ బ‌హిరంగ ప్రక‌ట‌న చేశారు. ఆయ‌న ప్రక‌ట‌న వెనుక చాలా అర్థాలు ఉన్నాయ‌ని టీడీపీ నేత‌లు భావిస్తున్నారు. ఎందుకంటే, వైసీపీ టార్గెట్ చేసిన తెలుగుదేశం నేత‌ల‌కు బీజేపీ మిన‌హా మ‌రో మార్గం లేదు. వైసీపీలో చేర‌లేక‌, టీడీపీలో ఉండ‌లేక స‌త‌మ‌తం అయ్యేవారు క‌చ్చితంగా బీజేపీలోకే వెళ్తారు. ఏపీలో ఎటూ కాంగ్రెస్, జ‌న‌సేన‌ పార్టీలు గ‌ల్లంతు అయ్యాయి. 

బీజేపీ ప‌రిస్థితి కూడా ఇలాగే ఉన్నా, కేంద్రంలో అధికారంలో ఉండ‌టమే వారికి అవ‌కాశం. అందుకే చాలా మంది బీజేపీలోకి క్యూ క‌ట్టే అవ‌కాశం ఉంది. అప్పుడు టీడీపీ బ‌ల‌హీన‌ప‌డి, బీజేపీ బ‌ల‌ప‌డుతుంది. త‌ర్వాత రాజ‌కీయం ఎలా ఉంటుంది అన్న సంగ‌తి ప‌క్కన పెడితే, త‌మ పార్టీ చిన్నాభిన్నం అవ్వడం ఖాయ‌మ‌నేది వారి భ‌యానికి ప్ర‌ధాన కార‌ణం. అందుకే చంద్రబాబు పార్టీని ఎలా ముందుకు న‌డిపిస్తార‌న్నదే తెలుగు త‌మ్ముళ్లను వెంటాడుతున్న స‌మ‌స్యగా చాలా మంది చెబుతున్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle