newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

తెలుగు తమ్ముళ్ల దింపుడుకళ్ళెం ఆశ

23-03-201923-03-2019 07:54:49 IST
2019-03-23T02:24:49.163Z23-03-2019 2019-03-23T02:24:42.923Z - - 21-08-2019

తెలుగు తమ్ముళ్ల  దింపుడుకళ్ళెం ఆశ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీడీపీ కార్యకర్తలు తెగ టెన్షన్ పడుతున్నారట. ఏం చేయాలో వారికి పాలు పోవడం లేదట. సాధారణంగా ఎన్నికల సమయంలో చివరి నిమిషంలో ఏదో ఒక జిమ్మిక్కుతో తమ అధినేత చంద్రబాబు విజయం సాధిస్తారనేది తెలుగు తమ్ముళ్ల నమ్మకం. కొత్త నినాదంతో జనంలోకి వెళ్లడమో, కొత్త వ్యక్తిని తెచ్చి పొలిటికల్ సీన్ మార్చి జనాన్ని తమవైపు తిప్పుకుంటారని చంద్రబాబు మీద టీడీపీ కార్యకర్తలకు బోలెడు నమ్మకం ఉంది. ఇక టీడీపీకి లైఫ్ అండ్ డెత్ అన్న చందంగా మారిన ఈ ఎన్నికల్లో చంద్రబాబు ఏం చేస్తారన్న దానిపై ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు ఎదురు చూస్తున్నారట.

మొన్నటి దాకా ఏపీ అభివృద్ధి, రాజధాని నిర్మాణం, గత ఎన్నికల్లో ప్రకటించిన పథకాల అమలు, ఇలా అన్నింటి మీద ఆశ పెట్టుకున్న టీడీపీ శ్రేణులకు అవి ఇప్పుడు అక్కరకు రావని అర్థం అయిపోయినట్లు తెలుస్తోంది. ఇక చంద్రబాబు కూడా వైసీపీ మీద చేస్తున్నఆరోపణలు కూడా టీడీపీకి ప్లస్ పాయింట్ అవ్వడం లేదన్నది ఆ పార్టీ కార్యకర్తల అభిప్రాయంగా కొందరు చెబుతున్నారు. 

జగన్ అధికారంలోకి వస్తే అరాచక పాలన సాగుతుందన్నచంద్రబాబు ఆరోపణలకు జనం నుంచి ఊహించినంత సానుకూలత రావడం లేదనేది ఇప్పుడు టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారట. అంతేకాదు చంద్రబాబు వల్లిస్తున్న పంచ సూత్రాలు ఏ మేరకు ఫలితాలు ఇస్తాయో అనేది వారి అనుమానం. ఎందుకంటే ప్రధానంగా అమరావతి నిర్మాణం అద్భుతంగా జరుగుతోందని చంద్రబాబు చెబుతున్నారు. కానీ వాస్తవం చూస్తే, నాలుగేళ్ల పాటు డిజైన్లకే సమయం కేటాయించారు చంద్రబాబు. 

ఇప్పటి దాకా ఒక్కటి కూడా శాశ్వత కట్టడం నిర్మాణం కాలేదు. కానీ ఎన్నికల సమయంలో ప్రారంభోత్సవాలతో హడావుడి చేస్తున్నారు చంద్రబాబు అండ్ ఏపీ మంత్రులు. ఇదంతా పైకి చెప్పక పోయినా టీడీపీ నేతలకు జనం నుంచి ఎదురవుతున్న ప్రశ్నలు ఇవేనట.

అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కూడా చంద్రబాబు జనం నుంచి నిరసన ఎదుర్కొంటున్నారని టీడీపీ నేతలే అంచనా వేస్తున్నారు. కేంద్రం పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును తాము చేస్తామని తీసుకుని, ఇప్పుడు అభాసు పాలయ్యామన్న అభిప్రాయం టీడీపీ కార్యకర్తల్లో నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రాజెక్టు నిధుల లెక్కల వివరాలు అడిగిన కేంద్ర ప్రభుత్వానికి సమాధానం ఇవ్వలేక పోవడం కూడా తమను ఇబ్బంది పెడుతోందని టీడీపీ కేడర్ వాపోతోంది.

ఇక అనంతపురం జిల్లాలో ఏర్పాటు అవుతున్న కియో మోటార్స్ కంపెనీ కోసం భూములు ఇచ్చిన వారికి పరిహారం ఇవ్వడంలో కూడా అపవాదు ఎదుర్కొన్నామని కూడా టీడీపీ నేతలు చెబుతున్న మాట. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే డ్వాక్రా మహిళల రుణమాఫీ, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య పింఛన్ల పెంపు మీద టీడీపీ ఆశలు పెట్టుకుందట. అయితే ఎన్నికల చివరి నిమిషంలో పసుపుకుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలకు చెక్కులు ఇవ్వడం, వ్రుద్ధాప్య పింఛన్ 2 వేల రూపాయలకు పెంచడం వల్ల లాభం కంటే నష్టం వచ్చిందన్న ఫీలింగులో కార్యకర్తలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఎందుకంటే జగన్ తన నవరత్నాల్లో చెప్పిన తర్వాతే పింఛన్ పెంచారు చంద్రబాబు. ఈ కీలక అంశాలన్ని తమకు అనుకూలం అవుతాయని భావించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు... జగన్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు సరైన జవాబు చెప్పలేని పరిస్తితిలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పోలింగ్ సమయం దగ్గర పడుతున్నకొద్దీ దింపుడు కళ్లెం ఆశతో చంద్రబాబు వంక చూస్తున్నారు. చివరి నిమిషంలో ఏదో ఒకటి చేసి పార్టీని గెలిపిస్తారన్న ఫీలింగ్ వారిని ముందుకు నడిపిస్తోందట.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle