newssting
BITING NEWS :
* శంషాబాద్ విమానాశ్రయంలో ప్రారంభమైన విమాన సర్వీసులు..హైదరాబాద్ నుంచి మొదటి ప్లేన్ బయలుదేరింది..బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వచ్చిన మొదటి విమానం *మరోమారు వివాదంలో చిక్కుకున్న కూనరవి..పొందూరు తహశీల్దార్ ను దుర్భాషలాడిన కూన రవి..కూనరవి మీద పొందూరు పీఎస్ లో ఫిర్యాదు చేసిన తహశీల్దార్...కూన రవి అరెస్ట్ కి రంగం సిద్దం*టీటీడీకీ షాక్‌ ఇచ్చిన క్రైం పోలీసులు..దొంగలను పట్టుకోవాలంటే ఫోర్ వీలర్ కావాలని కండీషన్.. మంచి ఫోర్ వీలర్ కావాలని కోరుతూ టీటీడీ ఉన్నతాధికారులకు లేఖ..లేఖ చూసి షాక్‌తిన్న అధికారులు..నిన్న జేఈవో ఇంట్లో భారీ దొంగతనం..6లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు మాయం *కరోనా వైద్య పరీక్షల్లో ఏపీ మరో రికార్డు..3లక్షలు దాటిన ఏపీలో కరోనా పరీక్షల సంఖ్య..ఇప్పటివరకు 3,40,326 కరోనా టెస్టులు..10 లక్షల జనాభాకు 5,699 పరీక్షలతో దేశంలోనే నెంబర్‌వన్*తెలంగాణలో ఈరోజు కొత్తగా 41 కరోనా కేసులు. తెలంగాణలో మొత్తం 1854కి చేరిన కరోనా కేసులు. తెలంగాణలో ఈరోజు 24 మంది డిశ్చార్జ్. మొత్తం 1092 మంది ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 709 యాక్టివ్ కేసులు*వరంగల్ జిల్లా 9 హత్యల కేసులో వీడిన మిస్టరీ. పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన నిందితుడు. స్నేహితులతో కలిసి హత్యలకు పాల్పడ్డ నిందితుడు. నిద్రమాత్రలు ఇచ్చి స్పృహ కోల్పోయాక హత్యలు* ఏపీలో తిరుమల లడ్డూ విక్రయాలు. 13 జిల్లా కేంద్రాల్లో టీటీడీ కల్యాణ మండపాల్లో లడ్డూ విక్రయాలు. లడ్డూ ప్రసాద సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు. 1800 425 4141, 1800 425 333 333 నెంబర్లు ఏర్పాటు

తెలుగు గడ్డపై జాతీయ పార్టీలు జీరొనేనా..?

09-05-201909-05-2019 08:26:49 IST
Updated On 01-07-2019 11:55:47 ISTUpdated On 01-07-20192019-05-09T02:56:49.387Z09-05-2019 2019-05-09T02:54:52.225Z - 2019-07-01T06:25:47.530Z - 01-07-2019

తెలుగు గడ్డపై జాతీయ పార్టీలు జీరొనేనా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్  రాజకీయాలో జాతీయ పార్టీలు నామ‌మాత్రం అయిపోయాయి. ప్రాంతీయ పార్టీల ప్ర‌భ వెలిగిపోతుండ‌టంతో జాతీయ పార్టీలు ఢీలా ప‌డ్డాయి. రెండు పార్టీలూ చేజేతులా చేసిన త‌ప్పుల‌తో రాష్ట్రంలో ఆ పార్టీల ప్రాబల్యం వేగంగా ప‌డిపోతోంది. క‌నీసం ఈసారి కాంగ్రెస్‌, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులుగా ఉన్న ర‌ఘువీరారెడ్డి, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ అయినా గెలుస్తారు అని ధీమాగా చెప్ప‌లేని ప‌రిస్థితి.

ఒక‌ప్పుడు రాష్ట్రంలో బ‌లంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పూర్తిగా నామ‌మాత్ర‌మైంది. వైసీపీ ఆవిర్భావం, రాష్ట్ర విభ‌జ‌న చేసిన నేప‌థ్యంలో ఆ పార్టీ రాష్ట్రంలో క‌నుమ‌రుగ‌య్యే దిశ‌లో ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో చాలామంది ముఖ్య‌నేత‌లు పోటీ చేసినా ఒక్క సీటును గెలుచుకోలేక‌పోయిన ఆ పార్టీ ఈసారి ఒక్క స్థాన‌మైనా గెలుస్తామ‌ని ధీమాగా ఉంది.

అనంత‌పురం జిల్లా క‌ళ్యాణదుర్గం నుంచి పోటీ చేసిన పీసీసీ చీఫ్ ర‌ఘువీరారెడ్డి విజ‌యం సాధిస్తార‌ని ఆ పార్టీ నేత‌లు న‌మ్మ‌కంగా ఉన్నారు. ఇక్క‌డ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేను కాద‌ని కొత్త అభ్య‌ర్థికి టిక్కెట్ ఇచ్చింది. టీడీపీ క్యాడ‌ర్ అంత‌ర్గ‌తంగా కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ఇచ్చింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో ఇక్క‌డ ర‌ఘువీరారెడ్డి, వైసీపీ అభ్య‌ర్థి ఉష‌శ్రీ చ‌ర‌ణ్ మ‌ధ్య  ప్ర‌ధాన పోటీ జ‌రిగింది. ఇక్క‌డ ర‌ఘువీరారెడ్డి భారీగా ఓట్లు సాధించినా గెలుస్తార‌ని క‌చ్చితంగా చెప్ప‌లేని ప‌రిస్థితి ఉంది.

ఇక‌, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు క‌న్నా ల‌‌క్ష్మీనారాయ‌ణ నర‌స‌రావుపేట పార్ల‌మెంటు స్థానం నుంచి పోటీ చేశారు. ఇక్క‌డ తాను గెలిచి, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌స్తే ఆయ‌న కేంద్ర మంత్రి అవుతార‌న్న ప్ర‌చారం కూడా జ‌రిగింది. అయితే, న‌ర‌స‌రావుపేట‌లో క‌న్నా గెలుపు మాత్రం అంత సులువుగా క‌నిపించ‌డం లేదు.

న‌ర‌స‌రావుపేట‌లో సిట్టింగ్ ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు మ‌రోసారి పోటీ చేశారు. టీడీపీ ఈ నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లంగా ఉంది. ఇక‌, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లు అనే యువ‌నేత బ‌రిలో నిలిచారు. ఆయ‌న కూడా త‌క్కువ స‌మ‌యంలోనే నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు సాధించారు. ఆయ‌న ప‌ట్ల కూడా ప్ర‌జ‌ల్లో ఆధ‌ర‌ణ కనిపించింది. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్యే ప్ర‌ధాన పోటీ జ‌రిగింది. ఫ‌లితంగా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ కూడా భారీగానే ఓట్లు సాధించినా విజ‌యావ‌కాశాలు మాత్రం క‌నిపించ‌డం లేదు.

మొత్తంగా ర‌ఘువీరారెడ్డి, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ గెల‌వ‌క‌పోతే ఈసారి జాతీయ పార్టీలు రెండూ ఆంధ్ర‌ప్రదేశ్‌లో పూర్తిగా క‌నుమ‌రుగు అయ్యే అవ‌కాశం ఉంది. మ‌రి, ఏం జ‌రుగుతుందో ఈ నెల 23న చూడాలి.

ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

ఎల్జీ పాలిమర్స్‌పై ఏపీ హైకోర్టు కొరడా.. కంపెనీ సీజ్.. డైరెక్టర్లకు నో పర్మిషన్

   an hour ago


విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

విమాన ప్రయాణాలకు మార్గదర్శకాలు... ఏం చేయాలి? ఏం చేయకూడదు?

   3 hours ago


ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

ఆ తొమ్మిది మృతదేహాల మిస్టరీ వీడినట్టేనా?

   3 hours ago


మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

మారిన చంద్రబాబు పర్యటన. భగ్గుమంటున్న టీడీపీ శ్రేణులు

   3 hours ago


గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

గ్యాస్ లీక్ ఘటనలో సాక్ష్యాలేవి... హైకోర్టు సూటిప్రశ్న

   4 hours ago


భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

భాగ్యనగరంలో కళలేని రంజాన్.. 112 ఏళ్ల నాడు ఇదే పరిస్థితి!

   4 hours ago


ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

ఇలాగే చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దా..?

   4 hours ago


భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

భీమవరం ఆక్వాపరిశ్రమలలో వలస కార్మికుల అష్టకష్టాలు

   a day ago


రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

రియల్ మహర్షి... పొలంలో నాట్లు, కాడెద్దులతో దుక్కిదున్నిన ఎస్పీ

   24-05-2020


కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

కెమికల్స్ ఫ్యాక్టరీలో లీకేజీ ... పదిమంది కంటి చూపునకు ప్రమాదం

   24-05-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle