newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

తెలుగు‌‌దేశానికి 'ఆగస్ట్' సంక్షోభం జూన్‌లోనే వచ్చిందా?

20-06-201920-06-2019 13:31:21 IST
Updated On 20-06-2019 17:42:48 ISTUpdated On 20-06-20192019-06-20T08:01:21.844Z20-06-2019 2019-06-20T07:54:51.386Z - 2019-06-20T12:12:48.647Z - 20-06-2019

తెలుగు‌‌దేశానికి 'ఆగస్ట్' సంక్షోభం జూన్‌లోనే వచ్చిందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆగస్టు సంక్షోభం పేరెత్తితే.. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఉలిక్కిపడతారు. ఎన్టీఆర్ ని గద్దెదించిన నాదెండ్ల భాస్కరరావు, ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు చంద్రబాబుతో దోస్తీ చేసింది కూడా ఆగస్టు నెలలోనే. ఆగస్టు సంఘటన తర్వాతే చంద్రబాబు ఎన్టీఆర్ నుంచి పార్టీ, ప్రభుత్వ పగ్గాలు చేజిక్కుంచుకున్నారు. అంతకుముందు 1984లో ఆగస్టు 16 నుండి సెప్టెంబరు 16 వ తేది వరకు ఒక నెలపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొనసాగారు నాదెండ్ల భాస్కరరావు. 1995లో ఆగస్టు సంక్షోభం ఏర్పడడం, ఎన్టీఆర్ తీవ్ర మానసిక క్షోభకు గురికావడం సంభవించింది. తాజాగా మళ్ళీ ఆగస్ట్ సంక్షోభం ఛాయలు తెలుగుదేశం పార్టీలో కనిపిస్తున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటే ఆగస్టు సంక్షోభం జూన్ నెలలో టీడీపీ తీరాన్ని తాకే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న రాజకీయ మంత్రాంగాలు టీడీపీ నేతల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తున్నాయనే చెప్పాలి. 

టీడీపీ ఎంపీలు తమ రాజకీయ భవిష్యత్తు వెతుక్కుంటున్నారు. ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్న నేతలు... పక్క చూపులు చూస్తున్నారు .విజయవాడ ఎంపీ కేసినేని నాని ఎప్పుడో అసమ్మతి కుంపటి రాజేశారు. అది చినికి చినికి గాలివానలా మారింది. నానితో పాటు ఐదుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు కూడా టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారని తెలిసింది. అది ఎప్పుడో కాదు కొద్ది గంటల్లోనే జరగబోతోంది. ఎలాగూ ఐదేళ్లపాటూ టీడీపీ అధికారంలోకి రాదని భావిస్తున్న ఎంపీలు... అప్పటివరకూ ప్రతిపక్షంలో ఉండే కంటే... బీజేపీలోకి వెళ్లిపోవడం బెటరని లెక్కలేసుకుంటున్నారు. 

టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి మూడురోజుల క్రితమే బాంబు పేల్చారు. టీడీపీలో ‘ఉన్నంతకాలం’అంటూ ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో నొక్కివొక్కాణించిన సంగతి తెలిసిందే. అలాగే రాజ్యసభ ఎంపీలు సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు, తోట సీతారామలక్ష్మి టీడీపీని వదిలి వెళ్లిపోతారని తెలుస్తోంది. 

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి వాళ్లతో చర్చిస్తున్నారు. ఈ ఐదుగురూ వెళ్లిపోతే, ఇక టీడీపీకి రాజ్యసభలో మిగిలేది కనకమేడల రవీంద్రకుమార్‌ మాత్రమే.

ఆయన మాత్రం చంద్రబాబుకి నమ్మిన బంటు అనే పేరుంది. అడ్వకేట్ స్థాయి నుంచి ఆయన రాజ్యసభ మెట్లెక్కారు. ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబే. దానికి కూడా కారణాలు అనేకం అని అందరికీ తెలుసు. బాబుని ‘స్టే’ల బాబుగా మార్చింది ఆయనే అంటారు. బాబుపై ఉన్న అనేక కేసుల్ని వాదించింది కూడా ఆయనే. మరి ఈ సంక్షోభం వేళ కనకమేడల వారు ఏంచేస్తారో చూడాలి. 

రాజ్యసభలో బీజేపీ బలం తక్కువగా ఉంది. చంద్రబాబు ఏజ్ బార్ అవ్వడం, లోకేష్ అసమర్థుడు కావడం, వైసీపీ బలంగా ఉండటం వల్ల ఇక టీడీపీ ఇప్పట్లో కోలుకోలేదనే ఆలోచనలో ఉంటున్నారు.

అదే సమయంలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కి తెరతీయడం కలిసొచ్చే అంశం అంటున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు యూరోప్ టూర్ కోసం గురువారం ఉదయం బయల్దేరి వెళ్లారు. చంద్రబాబునాయుడుతో పాటు భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాంశ్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లారు. ఈనెల 24న చంద్రబాబు ఫ్యామిలీ టూర్ ముగియనుంది. ఆయన టూర్లో ఉండగానే ఈ సంక్షోభం రావడం చర్చనీయాంశంగా మారింది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle