newssting
BITING NEWS :
*శబరిమల వివాదంపై సుప్రీం తీర్పు.శబరిమల వివాదం విస్తృత ధర్మాసనానికి బదిలీ *రాఫెల్‌ డీల్‌ : కేంద్రానికి క్లీన్‌చిట్‌ .. రివ్యూ పిటిషన్లు కొట్టివేత *రాహుల్ గాంధీకి రిలీఫ్.. పరువునష్టం కేసుపై సుప్రీం తీర్పు *వైసీపీలో చేరనున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్*ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*ఏపీ కొత్త సీఎస్‌గా నీలం సహాని...నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్....ఇవాళ బాధ్యతలు స్వీకరించిన నీలం సహాని *ఇసుక కొరతపై చంద్రబాబు దీక్ష...12 గంటల పాటు దీక్షలో కూర్చున్న బాబు* ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన...మనబడి నాడు - నేడు కార్యక్రమానికి శ్రీకారం*విశాఖ: బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థలో సీఐడీ సోదాలు.. మన శాండ్ ఆన్‌లైన్ ఇసుక సరఫరా వెబ్‌సైట్ హ్యాక్ చేసినట్టు అనుమానం*ఢిల్లీ: అయోధ్య ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు.. పార్లమెంట్‌లో అయోధ్య ట్రస్ట్ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం*ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈనెల 18కి వాయిదా వేసిన హైకోర్ట్*అమరావతి: పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయనడం కరెక్ట్ కాదు.. చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి బొత్స

తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్‌..?

08-11-201908-11-2019 12:59:25 IST
2019-11-08T07:29:25.051Z08-11-2019 2019-11-08T07:07:23.505Z - - 14-11-2019

తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్‌..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ త‌గిలే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఆ పార్టీకి ఉత్త‌రాంధ్ర‌లో బ‌ల‌మైన నేత‌గా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధ‌మైంది.

ఈ మేర‌కు గ‌త రెండు రోజులుగా ఢిల్లీలో తిష్ఠ‌వేసిన గంటా బీజేపీ పెద్ద‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఆయ‌న బీజేపీలో చేరే నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

ఇప్ప‌టికే బీజేపీ కీల‌క నేత రాంమాధ‌వ్‌ను క‌లిసి గంటా శ్రీనివాస‌రావు చ‌ర్చ‌లు జ‌రిపారు. తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేష్‌తోనూ ఆయ‌న సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. ఆయ‌న‌కు అనుకూలంగా ఉండే మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌తో పాటు గంటా కాషాయ కండువా క‌ప్పుకుంటార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

టీడీపీ హ‌యాంలో మంత్రిగా విశాఖ‌ప‌ట్నం జిల్లాలో చ‌క్రం తిప్పిన గంటా ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత సైలెంట్ అయ్యారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినా పార్టీ అధికారం కోల్పోవ‌డంతో గంటా యాక్టివ్ గా లేరు.

గెలిచిన నాటి నుంచే ఆయ‌న టీడీపీని వీడ‌తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. మొద‌ట ఆయ‌న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సంప్ర‌దింపులు జ‌రిపార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

కానీ, వైసీపీలో చేరాలంటే ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి రావాల్సిందేన‌ని జ‌గ‌న్ క‌చ్చిత‌మైన నిబంధ‌న పెట్ట‌డంతో గంటా వైసీపీలో చేరిక ఆగిపోయింది. దీంతో ఆయ‌న బీజేపీతో సంప్ర‌దింపులు ప్రారంభించిన‌ట్లు తెలుస్తోంది. అయితే, బీజేపీలో చేరితే ఎమ్మెల్యే ప‌ద‌వికి అన‌ర్హ‌త వేటు ప‌డే అవ‌కాశాల‌పై చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం.

ప్ర‌స్తుతం అసెంబ్లీలో బీజేపీకి ప్రాతినిథ్యం లేదు. గంటాతో పాటు ఆయ‌న వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ మారితే బీజేపీ అసెంబ్లీలో క‌నిపించ‌నుంది. కానీ, ఫిరాయించిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టీడీపీ ఫిర్యాదు చేస్తే వెంట‌నే స్పీక‌ర్ అన‌ర్హ‌త వేటు వేసే అవ‌కాశం ఉంది.

అయితే, బీజేపీతో స‌ఖ్య‌త కోసం ప్ర‌య‌త్నిస్తున్న టీడీపీ పార్టీ మారిన ఎమ్మెల్యేల‌పై ఫిర్యాదు చేస్తుందా అనేది ఒక ప్ర‌శ్న‌. ఇక‌, బీజేపీలో చేరిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేస్తే బీజేపీతో జ‌గ‌న్‌కు కూడా దూరం మ‌రింత పెరుగుతుంది.

ఉత్త‌ర భార‌తీయులు ఎక్కువ‌గా నివ‌సించే విశాఖ‌ప‌ట్నంలో భార‌తీయ జ‌న‌తా పార్టీకి కొంత ప‌ట్టుంది. గంటా లాంటి బ‌ల‌మైన నేత‌లు ఆ పార్టీలో చేరితే బీజేపీ క‌చ్చితంగా బ‌లం పుంజుకునే అవ‌కాశం ఉంది. మ‌రో రెండు రోజుల్లో గంటా పార్టీ మార్పుపై ఒక క్లారిటీ ఇస్తార‌ని తెలుస్తోంది. ఆయ‌న వెంట ఎవ‌రెవ‌రు వెళ్తార‌నేది వేచి చూడాలి.

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle