newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

తెలుగుతమ్ముళ్ళలో నిస్తేజం...బాబుచేతిలో అస్త్రాలేంటి?

11-10-201911-10-2019 13:05:36 IST
Updated On 11-10-2019 18:22:16 ISTUpdated On 11-10-20192019-10-11T07:35:36.129Z11-10-2019 2019-10-11T07:35:27.045Z - 2019-10-11T12:52:16.717Z - 11-10-2019

తెలుగుతమ్ముళ్ళలో నిస్తేజం...బాబుచేతిలో అస్త్రాలేంటి?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో జరిగిన మొన్నటి సాధరణ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఎన్నికలకు ముందు సర్వేల ఫలితాలన్నీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరలోనే ఉంటుందని అంచనాలు వేస్తే వైసీపీ మాత్రం ఊహించని విధంగా 151 సీట్లతో అధికారంలో కొచ్చి సంచలనాలను సృష్టించింది.

అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెచ్చిన పసుపు-కుంకుమ, నిరుద్యోగ భృతి, పెన్షన్ల పెంపు లాంటి సంక్షేమ పథకాలు.. అమరావతి, పోలవరం అంటూ చేసిన హంగామా అంతా ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయింది. టీడీపీలో మాజీ మంత్రులు, ఉద్దండులు, మహా మహా యోధులు సైతం అప్పుడు వీచిన వ్యతిరేక పవనాలకు నిలబడలేకపోయారు.

ఆ ఫలితాలు తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ ఇచ్చాయి. నిజానికి తెలుగుదేశం పార్టీకి ఇలాంటి షాకులు.. సంక్షోభాలు కొత్తేమీ కాదు. ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీ ఎన్నికలలో ఘన విజయాలనూ నమోదు చేసింది. ఘోర పరాజయాలనూ ఎదుర్కొంది. ఎన్టీఆర్ హయంలో తొలి ఎన్నికలలోనే ఘన విజయం.. అంతలోనే నాదెళ్ల మనోహర్ ఎపిసోడ్ అన్నీ చరిత్రకు తెలుసు కనుక ఎన్టీఆర్ హయం గురించి పక్కన పెడితే  ఇక ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సంక్షోభం కొత్తేమీ కాదు.

2003లో అలిపిరి ఘటన జరిగిన సమయంలో రాష్ట్రంలో అభివృద్ధి దూసుకుపోతుంది. అలిపిరి సానుభూతి కూడా కలిసి వస్తుందని అదే అవకాశంగా చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. కానీ ఎన్నికలు ఆలస్యమవడం వంటి కారణాలేమైనా ఫలితం మాత్రం ఊహించని విధంగా బెడిసికొట్టింది. ఆ తర్వాత 2009లో కూడా అదే పరిస్థితి.

ఆ తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు.. తెలంగాణ ఉద్యమం ఊపందుకొని పార్టీపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ఆంధ్రా నినాదం ఎత్తుకున్నా టీడీపీ మాత్రం రెండు ప్రాంతాలు రెండు కళ్ళతో సమానమని నినాదంలో ఉండిపోయింది. అప్పుడు ఎంత ఒత్తిళ్లు వచ్చినా చంద్రబాబు తనదైన శైలిలో అన్నిటిని తిప్పికొట్టారు. తర్వాత విభజన జరిగిపోవడంతో తెలంగాణ నాయకులంతా పార్టీలు మార్చేశారు.

ఏపీలో మాత్రం టీడీపీ అధికారంలోకొచ్చి చంద్రబాబు మరోసారి సీఎం అయ్యారు. ఐదేళ్లలో రాజధాని, పోలవరం వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను భుజాన వేసుకొని, చివరి రెండేళ్లలో సంక్షేమం మీద దృష్టి పెట్టారు. ఏమైనా కానీ ఒక్క అవకాశం కానీ.. అవినీతి టీడీపీ అని ప్రచారం కానీ వైసీపీకి గ్రాండ్ విక్టరీకి దక్కింది.

ఇప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ క్యాడర్ లో నిస్తేజం కనిపిస్తుంది. ఫలితాలొచ్చిన తొలి రోజుల్లో తామేం తప్పు చేసామన్న ధోరణిలో ఉండగా ఇప్పుడు తమకు అండగా ఎవరూ కనిపించడం లేదన్న బాధ కార్యకర్తలలో కనిపిస్తుంది. అధినేత చంద్రబాబు పలు వేదికలపై పాలిచ్చే అవును వదులుకొని దున్నపోతుని తెచ్చుకున్నారని ఆవేదన చెందుతున్నారే తప్ప క్యాడర్ లో ఉత్సాహం నింపేందుకు ఎంత వరకు ప్రయత్నిస్తున్నారన్నది ప్రశ్న.

మరోపక్క సీనియర్ నేతలు, పార్టీలో కీలక పదవులను అనుభవించిన నేతలు ఏ అమావాస్యకో ఒక్కసారి మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వం మీద నాలుగు విమర్శలు గుప్పించి వెళ్లిపోతున్నారు. పల్నాడు ఘటనలో పార్టీ అధినేత కల్పించుకొని ముందుకు వచ్చే వరకు అక్కడ కార్యకర్తలు పునరావాసాలలో ఉన్నారంటే నేతలు ఎలాంటి పరిస్థితిలో ఉంటున్నారో అర్ధం చేసుకోవచ్చు.

ఇన్నాళ్లు పార్టీకి ఆర్ధికంగానే కాకుండా పలు సంబంధాలపై చక్రం తిప్పే కొందరు నేతలు కూడా పార్టీని వీడిపోవడం, మాజీ మంత్రులు సైతం ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్లంతా తమ తమ పనులను చూసుకుంటూ, సోషల్ మీడియాలో పోస్టులతో కాలక్షేపం చేసుకుంటున్నారు. ఇక నియోజకవర్గాలకు ఇంచార్జిలుగా ఉన్న నేతలైతే ఎన్నికలలో ఆర్ధికంగా చితికిపోయామని ఇకనైనా తమ వ్యాపారాలపై దృష్టి పెట్టాలని ఫిక్స్ అయిపోయారు.

ఫలితంగా కింది స్థాయి క్యాడర్ మొత్తం నిరుత్సాహంగా ఊగిసలాడుతుంది. సోషల్ మీడియా లాంటి పార్టీ అధినేత దృష్టికి వెళ్లిన కేసులు మాత్రమే వెలుగులోకి వస్తున్నా నియోజకవర్గాలలో కార్యకర్తలపై కేసులు తమను పీడిస్తున్నా తమకు అండగా నిలిచే నాయకులు లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టీడీపీ నుండి ఇప్పటికే వలసలు జోరందుకున్నాయి. రాష్ట్రంలో అధికార టీడీపీ, కేంద్రంలో అధికార బీజేపీ వైపు నేతలు చూస్తుండగా వైసీపీ సామాజికవర్గాలను బేరీజు వేసుకొని పార్టీలను ఆహ్వానిస్తుంటే బీజేపీ రాష్ట్రంలో బలపడేందుకు నేతలను ఆకర్షిస్తుంది. ఫలితంగా అధినాయకత్వం కూడా నేతలకు హుకుం జారీ చేసే పరిస్థితి లేకుండా పోయింది.

ఇదే పరిస్థితి కొనసాగితే త్వరలోనే మరికొందరు బలమైన నేతలు కూడా జంపింగులు చేసి ప్రత్యర్ధులుగా మారే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ పరిస్థితి నుండి టీడీపీని గట్టెక్కించేదెవరు? చంద్రబాబు మరోసారి తన వ్యూహాలకు పదును పెట్టకపోతే క్యాడర్ దారి మార్చే ప్రమాదం పొంచి ఉంది. మరి ఈ వయసులో ఆయన ఉత్సాహం కనబరుస్తారా? లేక టీడీపీని నడిపే ప్రత్యామ్నాయమేంటి? వేచిచూడాల్సి ఉంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle