newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

తెలంగాణ రూ.లక్షకోట్లు బాకీ: బాబు

14-03-201914-03-2019 07:21:30 IST
Updated On 14-03-2019 20:00:04 ISTUpdated On 14-03-20192019-03-14T01:51:30.770Z14-03-2019 2019-03-14T01:51:05.429Z - 2019-03-14T14:30:04.353Z - 14-03-2019

తెలంగాణ రూ.లక్షకోట్లు బాకీ: బాబు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నికల వేళ ఏపీ సీఎం చంద్రబాబు కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు. విభజన నేపథ్యంలో తెలంగాణ నుంచి ఏపీకి రూ. లక్ష కోట్లు రావాలని హాట్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశం అయింది. ఆస్తులు, భవంతులు.. ఇలా అన్ని కలిపి మనకు పెద్ద మొత్తంలో తెలంగాణ నుంచి రావాలని చెప్పారు.

ఏపీలో బలహీన  ప్రభుత్వం రావాలని కేసీఆర్ కోరుకుంటున్నారని, వైసీపీ అధినేత జగన్‌ను అడ్డుపెట్టుకొని కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఏపీకి రూ.500 కోట్ల సాయం చేద్దామని కేసీఆర్ భావించారని గతంలో చెప్పారని, ఇప్పుడు జగన్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు రూ.వెయ్యి, రూ.2వేల కోట్లు ఇస్తున్నారని, ఇలా ఇచ్చి ఏపీలో చక్రం తిప్పుదామని కేసీఆర్ భావిస్తున్నారన్నారు. 

తద్వారా మనకు రావాల్సిన లక్ష కోట్లను ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. ఏపీలో టీడీపీ వంటి సరైన ప్రభుత్వం ఉంటే తమకు నష్టమని కేసీఆర్ భావిస్తున్నారని, అందుకే జగన్‌ను గెలిపించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సరైన సమయం లేకుండా తొలివిడత ఎన్నికలు పెట్టడంలో కేసీఆర్, మోడీ, జగన్ హస్తం ఉందన్నారు. జగన్‌ చేసిన వందల ఎకరాల ఆక్రమణలు కేసీఆర్‌కు కనిపించడం లేదా అని చంద్రబాబు మీడియా సమావేశంలో దుయ్యబట్టారు. 

తమ పార్టీ డేటా దొంగిలించి తిరిగి మమ్మల్నే బెదిరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఏపీ రాష్ట్ర ప్రజల ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. మన శ్రమ, త్యాగాలతో తెలంగాణ ధనిక రాష్ట్రం అయిందని చంద్రబాబు అన్నారు. ఏపీ అభివృద్ధి చెందాలని ఉంటే కేసీఆర్.. ప్రత్యేక హోదాపై లేఖ రాయగలరా, పోలవరంపై అభ్యంతరాలు పెట్టడం మానేస్తారా అని ప్రశ్నల వర్షం కురిపించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో రెండుసీట్లకే పరిమితం అయిన టీటీడీపీ లోకసభ ఎన్నికల్లో  పోటీచేసే అంశం త్వరలో నిర్ణయిస్తామన్నారు, తెలుగుదేశం పార్టీ పోటీపై టీటీడీపీ తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. జగన్ అయిదేళ్లయినా ఏపీకి రావడం లేదంటే ఆయనకు ఏపీపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. జగన్‌కు ఓటేస్తే మరణశాసనమే అని... మరో బీహార్ అవుతుందన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle