newssting
BITING NEWS :
* తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌..ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు కొనసాగిన పోలింగ్‌ *పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ *ముగిసిన కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం*ఏపీ శాసనమండలిలో టెన్షన్..పోడియం ఎదుట బొత్స, లోకేష్ వాగ్వివాదం..టీడీపీ సభ్యుల మీదకు దూసుకు వెళ్లేందుకు యత్నించిన కొడాలి నాని*ఢిల్లీలో జనసేన అధ్యక్షుడు పవన కల్యాణ్‌.. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తో భేటీ..పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశంపై చర్చ..పవన్‌ వెంట పలువురు బీజేపీ నేతలు..మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబందించినది..ఆ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోలేదు..అమరావతే ఏపీకి శాశ్వత రాజధాని..దానికోసం బలమైన కార్యాచరణ ప్రకటిస్తాం : పవన్ *అమరావతి: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు ఏపీ అసెంబ్లీ తీర్మానం.. సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన హోంమంత్రి సుచరిత *ఏపీ అసెంబ్లీ: సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తనపై ఎథిక్స్ కమిటీకి సిఫార్సు.. సత్వరమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించిన స్పీకర్

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

14-10-201914-10-2019 08:41:23 IST
Updated On 14-10-2019 12:39:57 ISTUpdated On 14-10-20192019-10-14T03:11:23.074Z14-10-2019 2019-10-14T03:10:50.408Z - 2019-10-14T07:09:57.578Z - 14-10-2019

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గత పదిరోజులుగా సమ్మె చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ మద్దతు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఇవాళ 13 జిల్లాల్లో 128 డిపోల దగ్గర ధర్నాలు నిర్వహించామని ఈయూ నేతలు వై.వి.రావు, పలిశెట్టి దామోదరరావు తెలిపారు. 19న ఎర్ర బ్యాడ్జీలతో విధులకు హాజరై టీఎస్‌ కార్మికులకు సంఘీభావం తెలుపుతామని కార్మికులు తెలిపారు. 

త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. టీఎస్‌ ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని… ఆత్మహత్యలకు పాల్పడొద్దని కార్మికులకు సూచించారు. ముఖ్యమంత్రే ఆర్టీసీ కార్మికుల పట్ల కక్ష గట్టినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కార్మికులను రెచ్చగొట్టేలా ప్రకటనలు చేయడం భావ్యం కాదన్నారు. సీఎం కేసీఆర్‌ వెంటనే టీఎస్ ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.

ఇటు తెలంగాణ ఆర్టీసీ బస్సులు తిరగకపోవడంతో ఏపీ ఎస్ ఆర్టీసీ పంట పండింది. దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచడం, అదనపు సర్వీసులు నడపడంతో ఆదాయం భారీగా పెరిగింది.

పండుగ సీజన్‌లో ఆదాయం 229 కోట్ల రూపాయలు అని అధికారులు తెలిపారు. దసరా సందర్భంగా 5,887 ప్రత్యేక సరీ్వసులు నడిపిన ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.  

గతఏడాది దసరా సీజన్‌ కంటే ఈసారి రూ.20 కోట్లు అధికంగా రావడం విశేషం. 2018 దసరా సమయంలో రూ.209 కోట్లు, ఈసారి రూ.229 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ పండక్కి ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులకు భారీగా డిమాండ్‌ ఏర్పడింది. ఆక్యుపెన్సీ రేషియో ఏకంగా 103 శాతంగా నమోదైంది.

మొత్తం పండగ సీజన్‌లో సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 13వ తేదీ వరకు రెగ్యులర్‌ సర్వీసులతో పాటు అదనంగా 5,887 ప్రత్యేక బస్సులను తిప్పిన ఏపీఎస్‌ఆర్టీసీ గణనీయమైన ఆదాయాన్ని రాబట్టింది.

ప్రత్యేక సర్వీసుల్లో 50 శాతం అధిక ఛార్జీలు వసూలు చేసి.. ప్రణాళికాబద్ధంగా సర్వీసులు నడపడంతో మంచి రాబడి వచ్చిందని చెబుతున్నారు. దసరా పండుగలో తెలంగాణ నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు అధికంగా వస్తారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు హైదరాబాద్ నుంచి ప్రత్యేక సర్వీసులు నడిపారు. దీంతో ఆదాయం మరింతగా పెరిగింది. 

నెల్లూరుపై న‌జ‌ర్ పెట్ట‌క‌పోతే అంతేనా..?

నెల్లూరుపై న‌జ‌ర్ పెట్ట‌క‌పోతే అంతేనా..?

   10 hours ago


రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది..మాజీ ఎంపీ జేసీ కామెంట్స్

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది..మాజీ ఎంపీ జేసీ కామెంట్స్

   11 hours ago


తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి.. ఓటేసిన ప్రముఖులు

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి.. ఓటేసిన ప్రముఖులు

   11 hours ago


సెలెక్ట్ కమిటీకి 3 రాజధానుల బిల్లు..?

సెలెక్ట్ కమిటీకి 3 రాజధానుల బిల్లు..?

   12 hours ago


ఆ ఎమ్మెల్సీలకి టీడీపీ షాకిస్తుందా..?

ఆ ఎమ్మెల్సీలకి టీడీపీ షాకిస్తుందా..?

   13 hours ago


రింగ్ దాటితే మార్షల్స్‌ని ఎత్తుకుపొమ్మనండి .. టీడీపీ సభ్యులపై జగన్ ఫైర్

రింగ్ దాటితే మార్షల్స్‌ని ఎత్తుకుపొమ్మనండి .. టీడీపీ సభ్యులపై జగన్ ఫైర్

   14 hours ago


హైదరాబాద్ లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు!

హైదరాబాద్ లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు!

   14 hours ago


సీఆర్డీయే రద్దుపై హైకోర్టులో రెండు వ్యాజ్యాలు.. వైసీపీకి షాక్ !

సీఆర్డీయే రద్దుపై హైకోర్టులో రెండు వ్యాజ్యాలు.. వైసీపీకి షాక్ !

   14 hours ago


ఎన్ఆర్ఐ పాలసీ.. ఎన్నికల వేళ సర్కార్ మరో ఆయుధం?

ఎన్ఆర్ఐ పాలసీ.. ఎన్నికల వేళ సర్కార్ మరో ఆయుధం?

   15 hours ago


రాజధానులపై బీజేపీ వైఖరి ఏంటి? పవన్ ఢిల్లీ టూర్‌పై సస్పెన్స్!

రాజధానులపై బీజేపీ వైఖరి ఏంటి? పవన్ ఢిల్లీ టూర్‌పై సస్పెన్స్!

   18 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle