newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

తెర‌పైకి వైసీపీ ఇమేజ్.. డ్యామేజ్ ఇష్యూ..!

24-11-201924-11-2019 16:31:40 IST
2019-11-24T11:01:40.929Z24-11-2019 2019-11-24T11:01:29.082Z - - 31-05-2020

తెర‌పైకి వైసీపీ ఇమేజ్.. డ్యామేజ్ ఇష్యూ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పొలిటిక‌ల్ ఆప‌రేష‌న్స్ ఎక్కువ శాతం ద‌క్షిణ భార‌త దేశంలోనే కొన‌సాగనున్నాయా..? అన్న ప్ర‌శ్న‌కు రాజ‌కీయ విశ్లేష‌కుల నుంచి అవున‌న్న స‌మాధానం వినిపిస్తోంది. బీజేపీ అధిష్టానం సైతం కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత నుంచి త‌మ దృష్టినంతా ద‌క్షిణాదిపైనే కేంద్రీక‌రించిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

అయితే, తెలుగు రాష్ట్రాల‌పై బీజేపీ దృష్టి మ‌రింత ఎక్కువ‌గానే ఉంద‌ని, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల అనంత‌రం జ‌రిగిన కీల‌క ప‌రిణామాలే అందుకు నిద‌ర్శ‌నంగా పొలిటిక‌ల్ ఎన‌లిస్టులు చెబుతున్నారు. మ‌రోపు టీడీపీ నుంచి బ‌ల‌మైన ప్ర‌భావం చూప‌గ‌ల నేత‌ల‌ను త‌మ‌వైపు వ‌చ్చేలా చేసుకోవ‌డంలో బీజేపీ విజ‌య‌వంత‌మైన సంగ‌తి తెలిసిందే.  

ఇప్పుడు బీజేపీ త‌న ఫోక‌స్‌ను వైసీపీ మీద కూడా పెట్టింది. ఆ క్ర‌మంలోనే ఏపీ బీజేపీ నేత‌లు అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మ‌రోవైపు ఏపీ బీజేపీతో సంబంధం లేకుండానే ఢిల్లీలో త‌మ వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌బెట్టుకోవాల‌ని భావిస్తోంది వైసీపీ. బ‌ల‌వంతంగానైనా యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఇటు మ‌త‌ప‌ర‌మైన వ్య‌వ‌హారాల్లో వైసీపీని టార్గెట్ చేసుకునే విష‌యంలో బీజేపీ మిగిలిన వారికంటే ముందుంది. కొడాలి నాని ఎపిసోడ్‌లో ఏకంగా కేసులు పెట్టే వర‌కు వెళ్లింది. దీంతో వైసీపీ కూడా క‌మ‌ల‌నాధుల‌కు గ‌ట్టిగా కౌంట‌ర్ ఇస్తూ వ‌స్తోంది.

ఇక తాము బీజేపీకి భ‌య‌ప‌డ‌టం లేద‌నే సంకేతాల‌ను ప్ర‌జల్లోకి బ‌లంగా పంపించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వైసీపీలో చ‌ర్చ మొద‌లైంది. అప్ప‌ట్లో సోనియాను, ఆ త‌రువాత బీజేపీని ఎదిరించి రాజ‌కీయం చేయ‌డం వ‌ల్లే జ‌నంలో జ‌గ‌న్‌కు హీరోవర్షిప్ వ‌చ్చింద‌ని వైసీపీ నేత‌ల అభిప్రాయం.

ఇప్పుడు బీజేపీ విష‌యంలో సాఫ్ట్‌గా ఉన్నామ‌న్న సంకేతాలు ప్ర‌జ‌ల్లోకి వెళితే ఇమేజ్ డ్యామేజ్ అవుతుంద‌న్న ఆందోళ‌న వైసీపీ నేత‌ల్లో క‌నిపిస్తోంది. అయితే, పెండింగ్ ప్రాజెక్ట్‌ల క్లియ‌రెన్స్‌, పోల‌వ‌రం వంటి కీల‌క ప్రాజెక్ట్‌ల విష‌యంలో పేచీలు లేకుండా చేసుకోవాల‌ని కొంత మంది వైసీపీ నేత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అందుకే కేంద్రంతో స‌ఖ్య‌త‌తో ఉండాల్సిన అవ‌సరం ఉంద‌ని గుర్తు చేస్తున్నారు. ఇక మ‌హారాష్ట్ర‌లో బీజేపీ రాజ‌కీయం చూశాక ఆ పార్టీని టార్గెట్ చేసుకునే విష‌యంలో వైసీపీ ఏ విధంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న‌ది ఇప్పుడు అంద‌రిలోనూ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ys jagan, ap politics, politics latest news

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle