newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

తూ.చ త‌ప్ప‌క జ‌గ‌న్ ని ఫాలో అవుతున్న యోగి ఆదిత్య‌నాధ్..!

08-10-201908-10-2019 10:45:41 IST
2019-10-08T05:15:41.015Z08-10-2019 2019-10-08T05:15:24.103Z - - 15-12-2019

తూ.చ త‌ప్ప‌క జ‌గ‌న్ ని ఫాలో అవుతున్న యోగి ఆదిత్య‌నాధ్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అవును, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ తూచా త‌ప్ప‌క ఫాలో అవుతున్నారు. ఇంత‌కీ ఏ విష‌యంలో..? అన్న ప్ర‌శ్న‌కు సంబంధించి ఈ క‌థ‌నాన్ని పూర్తిగా చ‌ద‌వాల్సిందే మ‌రీ..!

కాగా, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల‌ను స‌మీక్షిస్తాము అని సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించ‌గానే చాలా శ‌క్తులు ఆయ‌న్ను చుట్టుముట్టాయి. తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు కూడా వ‌చ్చాయి. ఇంకా వ‌స్తున్నాయి కూడా. టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు సీఎంగా ఉన్న స‌మ‌యంలో త‌న‌కు అనుకూలంగా ఉన్న కంపెనీల నుంచి అధిక ధ‌ర‌కు సాంప్ర‌దాయేత‌ర విద్యుత్‌ను కొనుగోలు చేసేలా ఒప్పందాలు చేసుకున్నారన్న ఆరోప‌ణ ఇటీవ‌ల వ్చిన సంగ‌తి తెలిసిందే.

నాడు చంద్ర‌బాబు చేసుకున్న ఒప్పందాల కార‌ణంగా ప్ర‌భుత్వ‌రంగ విద్యుత్ సంస్థ‌ల‌పై ప్ర‌తి ఏటా రూ.5వేల కోట్ల రూపాయ‌ల భారం ప‌డుతుంద‌ని జ‌గ‌న్ స‌ర్కార్ స్ప‌ష్టం చేసింది. అధిక ధ‌ర‌కు ప్ర‌యివేటు కంపెనీల నుంచి ఏకంగా 25 ఏళ్ల‌పాటు విద్యుత్‌ను కొనుగోలు చేసుకునేలా ఒప్పందాలు చేసుకోవ‌డ‌మ‌న్న‌ది సరైన చ‌ర్య కాద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తూనే ప్ర‌జా ధ‌నాన్ని ఆదా చేసేందుకే త‌మ ప్ర‌భుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందాల‌ను స‌మీక్షించ‌బోతున్నామ‌ని సీఎం జ‌గ‌న్ తేల్చి చెప్పారు.

జ‌గ‌న్ చెప్పిన మాదిరిగానే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై స‌మీక్ష‌ల‌ను మొద‌లు పెట్టారు. దీంతో వివిధ రాజ‌కీయ వ‌ర్గాల నుంచి తీవ్ర‌స్థాయిలో ప్ర‌భుత్వంపై ఒత్తిళ్లు మొద‌ల‌య్యాయి. చంద్ర‌బాబు నాయుడు, ప‌లు ప్ర‌ముఖ మీడియా చానెళ్లు సైతం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా ప్ర‌చారం మొద‌లు పెట్టాయి.

ప్ర‌జా ధ‌నాన్ని ఆదా చేసేందుకే తాము విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల‌పై పూర్తిస్థాయిలో స‌మీక్షించ‌నున్నామ‌ని జ‌గ‌న్ స‌ర్కార్ చెబుతున్న‌ప్ప‌టికీ, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల‌ను స‌మీక్షిస్తే పారిశ్రామిక‌వేత్త‌లు భ‌య‌ప‌డిపోతారుని, రాష్ట్రానికి పెట్టుబ‌డులు రావు అంటూ టీడీపీ, ప‌లు మీడియా సంస్థ‌లు ప్ర‌చారం చేస్తూ వచ్చాయి.

అలాగే చంద్ర‌బాబు త‌న‌కున్న ప‌రిచయాల ఆధారంగా కేంద్రంలోని కొన్ని శక్తుల నుంచి ఏపీ ప్ర‌భుత్వంపై ఒత్తిళ్లు తెచ్చేందుకు తీవ్ర స్థాయిలో ప్ర‌య‌త్నించారంటూ వైసీపీ విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే.  

మ‌రోప‌క్క‌, కేంద్ర ఇంధ‌న‌శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ ప‌దే ప‌దే ఏపీ ప్ర‌భుత్వానికి లేఖ‌లు రాస్తూ వ‌చ్చారు.  పీపీఏల జోలికి వెళ్లొద్దు.. వాటిని స‌మీక్షించొద్దు అంటూ కేంద్ర మంత్రి రాసిన లేఖ‌ల్లో పేర్కొన్నారు. ఇలా ఆర్‌కే సింగ్ కూడా జ‌గ‌న్‌ ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్ర‌య‌త్నించార‌న్న‌ది వైసీపీ ప్ర‌ధాన ఆరోప‌ణ‌.

అయితే, ఆ ఒత్తిళ్ల‌ను సీఎం జ‌గ‌న్ ఏ మాత్రం ప‌ట్టించుకోకుండా ముందుకు వెళ్లార‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని ప‌దే ప‌దే త‌ప్పుబ‌డుతూ వ‌స్తున్న కేంద్ర‌మంత్రి ఆర్‌కే సింగ్‌కు, చంద్ర‌బాబు, ప‌లు మీడియా ఛానెళ్ల‌కు ఉత్త‌ర ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ పెద్దషాకే ఇచ్చారు.

వైసీపీ స‌ర్కార్ త‌ర‌హాలోనే యోగి ఆదిత్య‌నాథ్ కూడా ముందుకు వెళుతున్నారు. 2017లో 650 మెగావాట్ల సాంప్ర‌దాయేత‌ర విద్యుత్ కొనుగోలు కోసం ఉత్త‌రప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే ప్ర‌స్తుతం మార్కెట్‌లో త‌క్కువ ధ‌ర‌కే విద్యుత్ ల‌భిస్తుండ‌టంతో 2017లో తాము చేసుకున్న ఒప్పందాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు ఉత్త‌రప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

ఇక్క‌డ మ‌రో విష‌య‌మేమిటంటే..? ఇలా విద్యుత్ ఒప్పందాల‌ను ర‌ద్దుచేస్తున్న‌ట్టు క‌నీస ముంద‌స్తు స‌మాచారం కింద కంపెనీల‌కుగాని, కేంద్ర ప్ర‌భుత్వానికికానీ తెలీయ‌కుండా యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌భుత్వం ఏక‌ప‌క్షంగా ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల‌ను ర‌ద్దు చేసేసింది.

2017లో సాంప్ర‌దాయేత‌ర విద్యుత్‌ను యూనిట్‌కు 3 రూపాయ‌ల 40 పైస‌ల‌కు కొనుగోలు చేసేలా అప్ప‌ట్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇప్పందాలు చేసుకుంది. ప్ర‌స్తుతం కేవ‌లం 3 రూపాయ‌ల 02 పైస‌ల‌కే తాము సాంప్ర‌దాయేత‌ర విద్యుత్‌ను యూనిట్‌కు అంద‌జేస్తామ‌ని ఒక సంస్థ ముందుకు రావ‌డంతో 2017లో చేసుకున్న ఒప్పందాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు యోగి ఆదిత్య‌నాథ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

అయితే, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం పీపీఏల‌ను ర‌ద్దు చేస్తామని ప్ర‌క‌టించ‌గానే ప‌దే.. ప‌దే లేఖ‌లురాసిన కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్ తాజాగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంపై బెల్లంకొట్టిన రాయిలా మౌనంగా  ఉండ‌ట‌మేంటంటూ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో విస్తృత‌స్థాయి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle