newssting
BITING NEWS :
*కర్ణాటక: ఉప ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. 12 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యం*షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్*పోలీసులకు సవాల్ గా మారిన తల్లికూతుళ్ళ హత్యకేసు... హత్య జరిగి ఐదురోజులైనా ఇంకా వీడని మిస్టరీ*దిశ కేసులో తల్లిదండ్రులను విచారించిన జాతీయ మానవహక్కుల సంఘం బృందం*ఇవాళ పార్లమెంటు ముందుకు జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు *మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో దిశ నిందితుల మృతదేహాలు... నిందితుల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను రికార్ట్ చేసిన ఎన్.హెచ్.ఆర్. సి*తిరుపతిలో రికార్డు స్థాయిలో ఉల్లి అమ్మకాలు.. 4 గంటల్లో 5 టన్నుల ఉల్లి అమ్మకం*జనసేన కార్యకర్తలపై పవన్ అసహనం.. మీ క్రమశిక్షణా లోపం వల్లే పార్టీ ఓడిపోయిందన్న పవన్ *తిరుపతిలో రెచ్చిపోయిన కామాంధులు.. ముళ్ళపూడిలో బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం *తిరుమల: బూందిపోటులో అగ్నిప్రమాదం.. ఆవిరిగా మారిన నెయ్యి వల్లే ప్రమాదం జరిగిందంటున్న పోటు కార్మికులు *ఇవాళ్టి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు *తూ.గో: వెలగతోడులో వరి రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్*చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై పోలీసుల విచారణ ప్రారంభం.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణాధికారిగా రాచకొండ ఎస్వోటీ సురేందర్‌రెడ్డి నియామకం

తూచ్ నేనెప్పుడన్నాను.. బొత్స యూటర్న్!

28-10-201928-10-2019 10:10:49 IST
2019-10-28T04:40:49.710Z28-10-2019 2019-10-28T04:40:44.100Z - - 09-12-2019

తూచ్ నేనెప్పుడన్నాను..  బొత్స యూటర్న్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం పాలనలోనే కాదు.. చేసే ఆరోపణలలో కూడా తడబడుతుందా? అంటే ఔనన్నట్లే కనిపిస్తుంది. పలు అంశాలలో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మేధావుల మాటలను సైతం లెక్కచేయకుండా ముందుకెళ్లి తీసుకున్న నిర్ణయాలకు పర్యవసానాలు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం మీద ఆరోపణలను చేస్తున్న ఈ ప్రభుత్వం ఆ ఆరోపణలు నిజం చేసే క్రమంలోనే డిఫెన్స్ లో పడిపోతున్నట్లుగా కనిపిస్తుంది.

ఉదాహరణకు పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్స్(పీపీఏ) విషయంలో ఆరోపణలు చేసిన ప్రభుత్వం అవినీతిని బయటపెట్టాలని ఆరాటపడి సమీక్షలకు దిగితే కేంద్రం నుండి వ్యతిరేకతతో పాటు రాష్ట్రంలో చీకట్లు కమ్ముకున్నాయి. ఇక నూతన విధానం ఏమిటన్నది ఆలోచించకుండా ముందు వెనుకా చూడకుండా గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుకవిధానాన్ని రద్దు చేస్తే దాని పర్యవసానం చివరికి కార్మికుల ఆత్మహత్యల వరకు వెళ్ళింది. దీనికి అంతం ఎక్కడన్నది కూడా అంతుచిక్కడం లేదు.

ఇక అమరావతి విషయానికి వస్తే రాజధాని చుట్టూ వందల కోట్ల లావాదేవీలు జరిగాయని అందులో అప్పటి ప్రభుత్వం ఇన్సైడ్ ట్రేడింగ్ జరిపిందని వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఏకంగా అప్పటి సీఎం చంద్రబాబు తన వియ్యంకుడు బాలకృష్ణకు, అయన చిన్నల్లుడు గీతమ్స్ భరత్ కు కూడా రాజధానిలో భూములను అప్పనంగా ఇచ్చేశారని ఆరోపణలకు దిగారు. బీజేపీ ఎంపీ సుజనాచౌదరి రాజధాని చుట్టుపక్కన వందల ఎకరాలను కొనేసుకున్నారని కూడా ప్రభుత్వంలోని పెద్దలే ఆరోపించారు.

మొత్తం రాజధానిలో వేలకోట్ల అవినీతి జరిగిందని.. తప్పదు సమీక్షలకు వెళ్లాల్సిందేనని తేల్చిచెప్పారు. ఇక మంత్రి బొత్స సత్యనారాయణ అయితే మరో అడుగు ముందుకేసి ఏకంగా రాజధానిలో ముప్పై వేల కోట్ల అవినీతి జరిగిందని, ఇష్టారీతిన ప్రజల ధనాన్ని ఖర్చుపెట్టేశారని తాజాగా ఆరోపణలు చేశారు. రాజధానిపై ప్రభుత్వం వేసిన పీటర్ కమిటీ లెక్కలు తేల్చి, ఎక్కడ రాజధాని అంటే అక్కడే.. అదే రాజధాని అవుతుందని కూడా ప్రకటించేశారు.

బొత్స ప్రకటనలు చేసిన గంటల వ్యవధిలోనే ఆయనపై తీవ్ర విమర్శలొచ్చాయి. అసలు రాజధాని అమరావతిలో జరిగిందే తొమ్మిదివేల కోట్ల పనులైతే ముప్పై వేలకోట్ల అవినీతి ఎలా సాధ్యమంటూ టీడీపీ నేతలతో పాటు బీజేపీ ఎంపీ సుజనా లాంటి వాళ్ళు కూడా మండిపడ్డారు. పసలేని, సత్యానికి ఆమడదూరమైన ఆరోపణలతో విమర్శల పాలవడం ఎనుకనుకున్నారో ఏమో కానీ బొత్స ఇప్పుడు తన వ్యాఖ్యలపై యూటర్న్ తీసుకున్నారు.

తాజాగా రాజధాని వ్యవహారంపై మీడియా ముందుకొచ్చిన బొత్స ముప్పై వేలకోట్ల అవినీతి జరిగిందని తానెప్పుడూ అనలేదన్నారు. మరి నిన్న చేసిన ముప్పై వేలకోట్ల మాట మీరు అననేలేదా అంటే అన్నాం కానీ అంత మొత్తం అవినీతి చేశారని తాను అనలేదని.. కేవలం అంత మొత్తం అవినీతికి తలుపులు తెరిచారని తాను చెప్పానన్నారు. అయన చెప్పిన దానికి అర్ధం ఏమిటో అక్కడ ఉన్న మేధావులకి సైతం అర్ధంకాకపోయినా మళ్ళీ అడిగితే ఇంకేం చెప్తారోనని కిక్కురుమనకుండా ఉండిపోయారు.

వైసీపీ అధికారంలోకొచ్చిన తరవాత రాజధాని మీద చేసిన అవినీతి ఆరోపణలు లక్షల కోట్లు దాటి వెళ్లిపోగా ఎక్కడా ఒక్క రూపాయి అవినీతిని బయటపెట్టిన దాఖలాలు లేవు. ఈమధ్యనే రాజధాని మీద నియమించిన పీటర్ కమిటీ కూడా దుబారా ఖర్చంటూ ఓ మొత్తాన్ని చెప్పిందే కానీ అవినీతి అన్న పదం వాడలేదు. మరి ప్రభుత్వ పెద్దలు మాత్రం రాజధాని గురించి ప్రస్తావన తెచ్చిన ప్రతిసారి కోట్లలో అవినీతి రాగం తీయడం మాత్రం మళ్ళీ అమరావతి మాట ఎత్తకుండా ఉంటారనేమో బహుశా!

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle