newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

తుళ్ళూరులో రైతుల మహా పాదయాత్ర

06-01-202006-01-2020 12:35:56 IST
Updated On 06-01-2020 12:41:06 ISTUpdated On 06-01-20202020-01-06T07:05:56.176Z06-01-2020 2020-01-06T07:05:54.587Z - 2020-01-06T07:11:06.089Z - 06-01-2020

తుళ్ళూరులో రైతుల మహా పాదయాత్ర
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మూడు రాజధానుల ప్రకటనకు నిరసనగా అమరావతి గ్రామాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇవాళ తుళ్ళూరులో పదివేలమంది రైతులు మహాపాదయాత్ర చేస్తున్నారు. జాతీయ జెండాను చేతబూని వేలాదిమంది రైతులు రోడ్డుమీదకు వచ్చారు. ఉదయం 10.30 గంటల నుంచి తుళ్లూరు నుంచి రైతులు, మహిళలు ర్యాలీ నిర్వహిస్తున్నారు. మందడం వరకు ఈ ర్యాలీ కొనసాగనుంది. 

తుళ్లూరు, రాయపూడి, వెలగపూడి, మల్కాపురం, మందడం గ్రామస్థులు ర్యాలీలో పాల్గొంటున్నారు. ర్యాలీ కోసం తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి నుంచి రైతులు, కూలీలు వేలాదిగా తరలివచ్చారు. రైతుల ర్యాలీకి తోడు యువకులు బైక్‌లపై ర్యాలీ నిర్వహిస్తున్నారు. మహిళలు తమకు మూడు రాజధానులు వద్దు-ఒక రాజధానే ముద్దు అని స్పష్టంచేశారు. తమ పాదయాత్రను ఎవరూ అడ్డుకోలేరన్నారు రైతులు.

అమరావతి రాజధాని ప్రాంతంలో జై అమరావతి నినాదాలు మిన్నంటాయి. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్, జీఎన్ రావు నివేదికలు ప్రభుత్వ జిరాక్స్ కాపీలు అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైపవర్ కమిటీ నివేదిక కూడా కలర్ జిరాక్స్ తప్ప ఇంకోటి కాదంటున్నారు. రైతులు తమ విలువైన భూములను అమరావతి రాజధాని కోసం ఇస్తే అవహేళన సాగిస్తున్నారన్నారు. తమ ఎమ్మెల్యే ఆర్కె ఏమయ్యారని మహిళలు ప్రశ్నించారు. 

రాజధానిలో రైతుల పాదయాత్రకు అనుమతి లేదని, నిరసనలు తెలిపే హక్కు అందరికీ వున్నా ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని పోలీసులు అంటున్నారు. రాజధాని రైతులు రోడ్డుమీదకు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. 

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   3 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   5 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   5 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   7 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   9 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   9 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   9 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   9 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   10 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   11 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle