newssting
BITING NEWS :
*శాసన మండలిలో మళ్ళీ గందరగోళం...కొనసాగుతోన్న మూడు రాజధానుల రగడ..రూల్‌ 71పై చర్చకు అనుమతించిన మండలి ఛైర్మన్‌..అభ్యంతరం వ్యక్తం చేసి నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులు *మండలి ఛైర్మన్ ఛైర్ వద్దకు వెళ్లిన పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీలు..వాయిదా పడ్డాక మండలి ఛైర్మనుతో మంత్రుల భేటీ*ఐదోసారి శాసన మండలి వాయిదా..మండలి వద్ద భారీగా మార్షల్స్ మొహరింపు..మండలి ఛైర్మన్ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడిన బుద్దా వెంకన్న*ఎంపీ గల్లా జయదేవ్ కి బెయిల్ మంజూరు..బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి సెషన్స్ కోర్టు..గుంటూరు సబ్ జైలు నుండి విడుదలైన ఎంపీ, పోలీసుల తీరు సరిగా లేదన్న గల్లా *ఫ్యాక్షన్ తరహా పాలన చేయాలని వైసీపీ చూస్తోంది.. వైసీపీ నిర్ణయాలు వాళ్ల వినాశనం కోసమే.. ఇకపై ఏపీలో వైసీపీకి అధికారం అనేదే ఉండదు..వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోను-పవన్ కల్యాణ్‌*నాకు రాజకీయాలను ఆపాదించవద్దు... నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను-మండలి ఛైర్మన్ షరీఫ్*నిర్ణయాన్ని మార్చుకున్న వైసీపీ సర్కార్... విజయవాడలోనే రిపబ్లిక్ డే*అమరావతి: ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చలో గందరగోళం.. చర్చకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు... జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు.. టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం.. సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ *వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం

తిరుమల వివాదాలను రాజకీయాల మాటున దాచేయద్దు..!

12-08-201912-08-2019 15:21:14 IST
Updated On 12-08-2019 15:25:59 ISTUpdated On 12-08-20192019-08-12T09:51:14.841Z12-08-2019 2019-08-12T09:48:37.134Z - 2019-08-12T09:55:59.166Z - 12-08-2019

తిరుమల వివాదాలను రాజకీయాల మాటున దాచేయద్దు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాలన్నీ గత చాలా కాలంగా వివాదాలకు నెలవులుగా మారాయి. గత చంద్రబాబు హయాంలో తిరుమలకు సంబంధించిన ప్రతి విమర్శనూ, వివాదాన్ని ఆయన రాజకీయం అంటూ కొట్టి పారేసి నాన్ సీరియస్ గా వ్యవహరించారు. తిరుమల మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు వ్యవహారం తొలి నుంచీ వివాదాస్పదంగానే ఉన్నప్పటికీ...ఆయన లేవనెత్తిన అంశాలను విస్మరించి మాజీ సీఎం చంద్రబాబు టిటిడీ వ్యవహారాలంటే అవి టీడీపీకి సంబంధించినవేనన్న అభిప్రాయం కలిగేలా వ్యవహరించారు. 

తిరుమల వంటి పవిత్ర క్షేత్రం వివాదాలకు నిలయంగా మారుతున్నా పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. అయితే ఏదైనా వివాదం, సమస్య ముందుకు వచ్చినప్పుడు అది కూడా తిరుమల వంటి పవిత్రక్షేత్రానికి సంబంధించినదైనప్పుడు భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆ వివాదంపై, ఆ సమస్యపై స్పందించి చర్చించి నిగ్గు తేల్చాల్సిన బాధ్యతను గత ప్రభుత్వం విస్మరించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వ తీరు కూడా గత ప్రభుత్వం ఔనన్నది కాదని తీరాలన్నట్లుగానే సాగుతుంది. అయితే వ్యవహారాలను రాజకీయ కోణంలో కాకుండా తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడం, భక్తుల సొమ్ము పరాన్నభుక్తుల పాలు కాకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

గత ప్రభుత్వ తప్పిదాలను విమర్శించడం, విచారణ జరిపించి నిగ్గు తేలుస్తాననడం సరే...ప్రస్తుతం అక్కడి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవలసి ఉంటుంది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తన దృష్టి యావత్తూ టిటిడీ విషయంలో గత ప్రభుత్వ సంస్కరణలను తిరగదొడటంపైనే కేంద్రీకరించారు. తెలుగుదేశం హయాంలో వివాదాలన్నిటి వెనుకా తనను అప్రదిష్టపాలు చేయాలన్న కుట్రే ఉందంటూ వివాదాలు, ఆరోపణలపై దృష్టి సారించకుండా మిన్నకుంది. ఇప్పుడు ప్రభుత్వం మారిన తరువాత లేని వివాదాలను కూడా తెరపైకి తీసుకువచ్చి...గత ప్రభుత్వ నిర్వాకమంటూ ప్రజలను, భక్తులను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నది. 

ఇరు ప్రభుత్వాలూ కూడా భక్తుల మనోభావాలను పట్టించుకోకుండా టిటిడి వ్యవహారాలతో రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నిస్తున్నాయి. భక్త జనుల సేవ కోసం ఏర్పాటైన తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడు రాజకీయ నేతల సేవలో తరించిపోతున్నదనడంలో సందేహం లేదు. తిరుమలలో అన్యమత ప్రచారంపై వస్తున్న వార్తలు భక్తజనంలో ఆందోళన రేపుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం సరైన దిశలో విచారణ జరిపి నిజానిజాల నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది.

వీఐపీ, బ్రేక్ దర్శనాల విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న టీటీడీ చైర్మన్...స్వామి వారి సేవల టికెట్లు, ఆర్జిత సేవల విషయంలో టీటీడీ సిబ్బంది చేతివాటంపై వస్తున్న ఆరోపణలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అలాగే స్వామి వారి ఆభరణాలు, సొమ్ము, సొత్తుపై గతంలో వచ్చిన ఆరోపణల నిగ్గు తేల్చాల్సిన అవసరం కూడా ఉంది.  కొండపై స్వామి వారి నామస్మరణ విన్నా మరే విషయం ప్రస్తావించడానికి వీలులేని  పరిస్థితి రావాల్సి ఉంది.  కాటేజీల బుకింగ్, సేవా దర్శనాల టికెట్ల విషయంలో దళారుల ప్రమేయం లేకుండా అన్ని చర్యలూ తీసుకోవాలి. కొండ వేదికగా రాజకీయాలకు తావులేని పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle