newssting
BITING NEWS :
*శాసన మండలిలో మళ్ళీ గందరగోళం...కొనసాగుతోన్న మూడు రాజధానుల రగడ..రూల్‌ 71పై చర్చకు అనుమతించిన మండలి ఛైర్మన్‌..అభ్యంతరం వ్యక్తం చేసి నినాదాలు చేస్తున్న వైసీపీ సభ్యులు *మండలి ఛైర్మన్ ఛైర్ వద్దకు వెళ్లిన పీడీఎఫ్, టీడీపీ ఎమ్మెల్సీలు..వాయిదా పడ్డాక మండలి ఛైర్మనుతో మంత్రుల భేటీ*ఐదోసారి శాసన మండలి వాయిదా..మండలి వద్ద భారీగా మార్షల్స్ మొహరింపు..మండలి ఛైర్మన్ వద్దకు వచ్చి ఆయనతో మాట్లాడిన బుద్దా వెంకన్న*ఎంపీ గల్లా జయదేవ్ కి బెయిల్ మంజూరు..బెయిల్ మంజూరు చేసిన మంగళగిరి సెషన్స్ కోర్టు..గుంటూరు సబ్ జైలు నుండి విడుదలైన ఎంపీ, పోలీసుల తీరు సరిగా లేదన్న గల్లా *ఫ్యాక్షన్ తరహా పాలన చేయాలని వైసీపీ చూస్తోంది.. వైసీపీ నిర్ణయాలు వాళ్ల వినాశనం కోసమే.. ఇకపై ఏపీలో వైసీపీకి అధికారం అనేదే ఉండదు..వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోను-పవన్ కల్యాణ్‌*నాకు రాజకీయాలను ఆపాదించవద్దు... నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాను-మండలి ఛైర్మన్ షరీఫ్*నిర్ణయాన్ని మార్చుకున్న వైసీపీ సర్కార్... విజయవాడలోనే రిపబ్లిక్ డే*అమరావతి: ఎస్సీ కమిషన్ బిల్లుపై చర్చలో గందరగోళం.. చర్చకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు... జై అమరావతి అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు.. టీడీపీ సభ్యులపై తీవ్ర ఆగ్రహం.. సభ నుంచి వెళ్లిపోయిన స్పీకర్ *వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం.. ఏపీకి ఇక నుంచి మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతి లేజిస్లేటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ క్యాపిటల్‌కు సభ ఆమోదం

తిరుమలలో ముక్కోటి ఏకాదశి సందడి.. పోటెత్తిన వీఐపీలు

06-01-202006-01-2020 12:14:31 IST
Updated On 06-01-2020 12:14:29 ISTUpdated On 06-01-20202020-01-06T06:44:31.750Z06-01-2020 2020-01-06T06:40:27.805Z - 2020-01-06T06:44:29.515Z - 06-01-2020

తిరుమలలో ముక్కోటి ఏకాదశి సందడి.. పోటెత్తిన వీఐపీలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తిరుమలలో ముక్కోటి ఏకాదశి సందడి నెలకొంది. వీఐపీలు స్వామివారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జితేంద్రకుమార్‌ మహేశ్వరితో పాటు పలువురు రాజకీయ నేతలు, వివిధ రంగాల ప్రముఖులు దర్శించుకున్నారు. రాత్రి రెండు గంటలకు విరామ సమయం దర్శనంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు సినీ ప్రముఖులు శ్రీవారిని దర్శించుకొన్నారు.

Image may contain: 6 people, people smiling, people standing and indoor

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు పుష్పశ్రీవాణి, నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలం సురేష్, అనిల్‌కుమార్‌ యాదవ్‌, బొత్స సత్యనారాయణ, అవంతిశ్రీనివాస్‌, వెల్లంపల్లి శ్రీనివాస్‌, రంగనాథరాజు, బాలినేని శ్రీనివాసరెడ్డితో శ్రీవారిని దర్శించుకొన్నారు.

Image may contain: 6 people, including Seetha Ramaraju

వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, బీజేపీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి రామ్మోహనరావు, టీడీపీ ఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌,  చిన్నరాజప్ప, ఎమ్‌.ఎల్‌.సి. డొక్కామాణిక్యవరప్రసాద్‌, సినీనటులు రాజేంద్రప్రసాద్‌, సుమలత శ్రీవారిని దర్శించుకొన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కల్పించడంతో భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తులతో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. క్యూలైన్లలో సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. 

Image may contain: 7 people, including Rajesh Siddam, outdoor

Image may contain: 6 people, people sitting, wedding, indoor and outdoor


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle