newssting
BITING NEWS :
*అరుదైన రికార్డు నెలకొల్పిన విరాట్ కోహ్లీ*చేతులెత్తేసిన సౌతాఫ్రికా... సిరీస్‌ కైవసం చేసుకున్న టీమిండియా*తెలంగాణలో పదో రోజుకు చేరిన ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నేడు ఇందిరాపార్క్ దగ్గర ట్రేడ్ యూనియన్ల బహిరంగసభ*ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో భేటీ కానున్న నటుడు చిరంజీవి*ఢిల్లీ: నేటి నుంచి అయోధ్యపై సుప్రీంకోర్టులో తుదిదశ వాదనలు.. ఈ నెల 17లోపు వాదనలు పూర్తిచేయాలని సుప్రీం నిర్ణయం*నేడు, రేపు నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. జిల్లా నేతలదో సమీక్షలు*సీపీఐ రాష్ట్రకమిటీ అత్యవసర భేటీ.. ఆర్టీసీ సమ్మె, హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతుపై చర్చ*మా తండ్రి తో ఎలాంటి గొడవలు లేవు...కోడెల మృతికి ఒత్తిడే కారణం: కొడుకు శివరాం, భార్య వాంగ్మూలం *తెలంగాణ ఆర్టీసీలో నియామకాలకు నోటిఫికేషన్...తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్, ఎలక్ట్రీషియన్‌ పోస్టులకూ దరఖాస్తుల ఆహ్వానం*నిండుకుండలా సోమశిల జలాశయం..ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 78 టీఎంసీలు...ప్రస్తుత నీటిమట్టం 75 టీఎంసీలు*ఇవాళ గోదావరిలో మునిగిపోయిన బోటు వెలికితీత పనులు మళ్ళీ ప్రారంభం

తిరుమలలో గోల్ మాల్: మొన్న టికెట్ల గొడవ.. నేడు ఆభరణాల మాయం

28-08-201928-08-2019 15:14:40 IST
2019-08-28T09:44:40.302Z28-08-2019 2019-08-28T09:44:31.120Z - - 14-10-2019

తిరుమలలో గోల్ మాల్: మొన్న టికెట్ల గొడవ.. నేడు ఆభరణాల మాయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తిరుమల ఏడుకొండల స్వామి సన్నిధి తిరుమల ఎప్పుడూ ఏదో విధంగా వార్లల్లోకి వస్తూ వుంటుంది. ఆర్టీసీ టికెట్లలో అన్యమత ప్రచారం గొడవ సద్దుమణగక ముందే.. మరో వివాదం తెరమీదకు వచ్చింది. స్వామివారికి చెందిన ఆభరణాలు మాయం అయ్యాయన్న వార్త భక్తులను కలవరపెడుతోంది, టీటీడీ ట్రెజరీలో ఉండాల్సిన శ్రీవారి నగలు అదృశ్యమవడం వివాదంగా మారుతోంది.

దేవదేవుడి నగలు మాయమవడం.. గుట్టుచప్పుడు కాకుండా అధికారులు సొమ్ము రికవరీ చేయడంపై భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో గత రెండుమూడునెలలుగా ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు.

స్వామివారి 5 కిలోల వెండి కిరీటం, రెండు ఉంగరాలు, ఒక బంగారు చైన్ మాయం అయ్యాయి. ఈ ఘటనపై విచారణ జరిపించిన టీటీడీ అధికారులు ఏఈవో శ్రీనివాసులును బాధ్యుడిగా గుర్తించి అతని జీతం నుంచి సొమ్మును రికవరీ చేస్తున్నట్లు ప్రకటించింది.

అసలు నగలు మాయం కావడం ఏంటి? వాటిని రికవరీ చేయడం ఏంటి. బాధ్యులపై చర్యలు తీసుకుంటూ పోతే.. రేపు ఖరీదైన బంగారు ఆభరణాలు కూడా మాయం అయితే ఇలాగే చేస్తారా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరినో కాపాడుతున్నట్టు అనిపిస్తోందని భక్తులు అంటున్నారు.

ఏఈవో ఒక్కడినే బాధ్యుడిని చేయడంపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇదిలా ఉంటే టిటిడి పాలకమండలి ఏర్పాటులో జాప్యం ఎందుకని భక్తులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సీఎం జగన్ తో భేటీ అయ్యారు. 25 మంది సభ్యులతో టిటిడి పాలక మండలి ఏర్పాటుకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెబుతున్నారు. 

వెండికిరీటం, ఉంగరాలు మాయం కావడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని బీజేపీ నేత లంకా దినకర్ ‘న్యూస్ స్టింగ్’ తో అన్నారు. పోయిన వస్తువుల్ని రికవరీ చేయడం మాని, ఉద్యోగిని బాధ్యుడిగా చేసి అతని నెల జీతంలో రూ 30వేలు కోత విధిస్తామనే రూల్ టీటీడీ నియమనిబంధనల్లో ఉందా అని దినకర్ ప్రశ్నించారు. కోట్లాదిమంది హిందువుల మనోభావాలు ప్రభుత్వ వైఖరితో దెబ్బతింటున్నాయని, వివాదాల విషయంలో దాటవేసే ధోరణి మంచిది కాదన్నారు దినకర్.

హిందూ సనాతన ఆచారాల ప్రకారం నడవాలన్నారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరగడం ఆవేదన కలిగిస్తోందన్నారు.. దేవాలయంలో అన్యమత ఉద్యోగుల ప్రవర్తన హేయంగా ఉందని, ఉద్యోగుల నియామకాలు విషయంలో నిర్లక్ష్యం వల్లే ఇలా జరుగుతోందన్నారు, ఈ విషయంలో సీఎస్ వైఖరిని బీజేపీ తీవ్రంగా విమర్శిస్తోందన్నారు. అన్యమతస్తులు ఉంటే తమంతట తామే వెళ్లిపోవాలని అనడం విచిత్రంగా ఉందన్నారు. ఏది ఏమైనా తిరుమల పరిణామాలు భక్తులకు ఆవేదన కలిగిస్తోంది. 

కేంద్రంఫై ఎదురుదాడికి దిగుతున్న ఏపీ సర్కార్..!

కేంద్రంఫై ఎదురుదాడికి దిగుతున్న ఏపీ సర్కార్..!

   3 minutes ago


రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

రైతు భరోసాకు సర్వం సిద్ధం.. బ్యాంకులకు జగన్ మార్గనిర్దేశం

   an hour ago


తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఆంధ్ర ఆర్టీసీ బాసట

   an hour ago


పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

పదోరోజుకి సమ్మె,. ఆర్టీసీ జేఏసీ వర్సెస్ ఉద్యోగ జేఏసీ

   2 hours ago


సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

సమ్మెపై సర్కార్ సమ్మెట- ప్రజాస్వామ్య హక్కుల సమాధి!

   2 hours ago


ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

ఉసురు తీస్తున్న సమ్మె.. కేసీఆర్ కు కార్మికుల శాపనార్థాలు

   19 hours ago


కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

కావాల్సినంత ఇసుక.. రోజుకి లక్షటన్నులు

   19 hours ago


ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

ఏపీ ఆర్ధిక పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే అవకాశమేలేదా?

   20 hours ago


ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

ఉధృతంగా ఆర్టీసీ సమ్మె-కార్మికుల వంటావార్పు

   21 hours ago


ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

ఆర్టీసీ సిబ్బంది ప్రాణాల పట్ల తెలంగాణ సమాజానికి బాధ్యత లేదా

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle