newssting
BITING NEWS :
*భారత్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన.. భారీ భద్రతా ఏర్పాట్లు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన... హైకోర్టు ఆదేశాలతో తుళ్లూరులో ఎంక్వైరీ చేపట్టిన పోలీసులు* ఢిల్లీలోని జఫ్రాబాద్ మెట్రో స్టేషన్‌లో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు..భారీగా తరలివచ్చిన మహిళలు*తిరుమలలో మరోసారి ప్రత్యక్షమైన బంగారు బల్లి.. చూసేందుకు బారులు తీరిన భక్తులు....శిలాతోరణం చక్రతీర్థంలో బంగారు బల్లి ప్రత్యక్షం

తిరుమలలో ఆర్టీసీ యాడ్స్ వివాదం... హిందూ సంఘాల ఆగ్రహం

23-08-201923-08-2019 16:37:07 IST
Updated On 24-08-2019 17:03:01 ISTUpdated On 24-08-20192019-08-23T11:07:07.395Z23-08-2019 2019-08-23T11:02:12.678Z - 2019-08-24T11:33:01.962Z - 24-08-2019

తిరుమలలో ఆర్టీసీ యాడ్స్ వివాదం... హిందూ సంఘాల ఆగ్రహం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అసలు తిరుమలలో ఏం జరుగుతోంది? 

టీటీడీ బోర్డు ఏర్పాటులో ఎందుకింత జాప్యం?

అన్యమత ప్రచారం మళ్ళీ తెరమీదకు వస్తోందా?

ఆర్టీసీ టికెట్ల వెనుక ఏ మత ప్రచారమైనా చేసుకోవచ్చా? 

జగన్ ప్రభుత్వం వచ్చాక ఇలాంటివి ఎక్కువ అయ్యాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. తిరుపతికి వెళ్లే ఆర్టీసీ బస్సుల్లో ఇచ్చే టికెట్లపై ఒక యాడ్ తీవ్రవివాదం రేపుతోంది. ఈ టికెట్ల వెనుక భాగంలో ఉన్న అన్యమతానికి చెందిన యాడ్ రచ్చకు కారణమయింది. 

తిరుమలలో హజ్, జెరూసలేం యాత్రా ప్రకటనలు దర్శనమివ్వడంతో బీజేపీ, హిందూ సంఘాలు మరోసారి జగన్ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. పాలకులు హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ మండిపడుతున్నారు. తిరుమల కొండపైకి వెళ్ళే ఆర్టీసీ బస్సు టికెట్ల వెనక భాగంలో ముస్లింల పవిత్ర హజ్ యాత్ర, క్రిస్టియన్ల పవిత్ర జెరూసలేం యాత్రకు సంబంధించిన యాడ్స్ కనిపించాయి. ఆ ఫొటోలను కొందరు భక్తులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వివాదానికి మరింత ఆజ్యం పోసినట్టయింది. 

తిరుమలలో అన్యమతాల ప్రచారంపై నిషేధం ఉన్నా...హజ్, జరూసలేం యాత్రలకు సంబంధించిన యాడ్స్ ఎలా వేస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్ సంస్థల మాట అటుంచి ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీ అధికారులు ఇలాంటి ప్రచారానికి ఎలా అనుమతి ఇస్తారని మండిపడుతున్నారు. అన్యమత మార్పిడిలు పెద్ద ఏత్తున జరుగుతున్న, విజయవాడ లో దాదాపు 100 గోవులు అనుమానస్పద మృత్యువాత పడ్డా వాస్తవాలు వెలుగులోకి తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని మండిపడ్డారు  బీజేపీ నేత లంకా దినకర్. రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని కొంతమంది వ్యక్తిగత ఎజండాను అమలు పరుస్తోందన్నారు.

ఇంతకాలం అయినా తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తి స్థాయి బోర్డు వేయకుండాచైర్మన్ తో నడపడం లో ఔచిత్యం ఏమిటి? టిటిడిబోర్డు లేకుండా ఏకపక్ష నిర్ణయాలు హిందూ ధార్మికతకు ముప్పు తెచ్చే ప్రమాదం పొంచి ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం లో అన్యమతస్తులను విధి నిర్వహణలో వాడుతున్నందున, శ్రీశైలం లో జరిగిన అనర్థం కొనసాగే ప్రమాదాన్ని ఎందుకు పసిగట్టడం లేదన్నారు లంకా దినకర్

తిరుమల బస్సు టికెట్‌ అన్యమత ప్రచారంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఇలాంటి వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి వాటిని ఎవరు చేస్తున్నారు తెలుసుకోవాలని డిమాండ్ చేశారు.

హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువ అవుతున్నాయి. శ్రీశైలంలో షాపుల వేలం వ్యవహారం దుకాణాలను ముస్లింలకు కేటాయించారని హిందూ సంఘాలు మండిపడ్డాయి. ఛలో శ్రీశైలం ఆందోళనకు పిలుపునివ్వడంతో ఏపీ ప్రభుత్వం స్పందించి..ఆలయ ఈవోని సాగనంపింది. అంతేకాదు షాపుల వేలాన్ని కూడా రద్దు చేసింది. తాజాగా తిరుమలలో హజ్, జెరూసలేం యాత్రా ప్రకటనలు దర్శనమివ్వడంతో బీజేపీ, హిందూ సంఘాలు మరోసారి జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ మండిపడుతున్నారు.

ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించింది. తిరుమలలో బస్‌ టిక్కెట్ల వ్యవహారంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. టిమ్ రోల్స్ సరఫరా చేసిన కాంట్రాక్టరను గుర్తించామని, అవి టీడీపీ హయాంలోనే ముద్రించారని అధికారులు చెబుతున్నారు.

టిమ్ పేపర్లపై చంద్రబాబు పేరుతో పథకాల ప్రచారం ఉందంటున్నారు. తిరుపతి డిపోకి వీటిని సరఫరా చేశారని చెబుతున్నారు. కొన్ని టీవీ ఛానెళ్లు కూడా తిరుమల బస్సు టిక్కెట్ల వ్యవహారాన్ని పెద్దది చేసేందుకు ప్రయత్నిస్తూ.. శ్రీవారి భక్తుల మనోభావాలు గాయపరిచి.. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని కుట్ర పన్నుతున్నాయి. సదరు వ్యక్తులు, మీడియా సంస్థలపై తగిన చర్యలు తీసుకుంటాం అన్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle