newssting
BITING NEWS :
*అమరావతి: ముగిసిన బీఏసీ సమావేశం... మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం*రాజధాని ప్రకటనకు ముందు గుట్టుచప్పుడు కాకుండా టీడీపీ నేతలు భూములు కొన్నారు... గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలింది, కంతేరు గ్రామంలో చంద్రబాబు 14.2 ఎకరాలు కొన్నారు-మంత్రి బుగ్గన *అసెంబ్లీ వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి బుగ్గన *మూడురాజధానులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ *అమరావతి, విశాఖలో మంత్రులు అందుబాటులో ఉంటారు.. స్థానిక జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. నాలుగు జిల్లాలకు కలిపి జోనల్ డెవలప్‌మెంట్ బోర్డు, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే బిల్లు ఉద్దేశం-మంత్రి బుగ్గన*సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి బొత్స, మూడు రాజధానుల ప్రతిపాదలను బిల్లులో పేర్కొన్న ప్రభుత్వం*రంగారెడ్డి జిల్లా: షాద్‌నగర్‌లో చిరుత కలకలం.. ఓ ఇంటిపై చిరుత సంచారం, భయాందోళనలో స్థానికులు*ఛలో అసెంబ్లీకి అమరావతి జేఏసీ పిలుపు.. మద్దతు ప్రకటించిన టీడీపీ, సీపీఐ.. టీడీపీ ఎమ్మెల్యేలు*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా

తిరుప‌తిలోనే రాజ‌ధాని..!

04-01-202004-01-2020 10:02:57 IST
Updated On 04-01-2020 12:20:10 ISTUpdated On 04-01-20202020-01-04T04:32:57.729Z04-01-2020 2020-01-04T04:32:53.304Z - 2020-01-04T06:50:10.658Z - 04-01-2020

తిరుప‌తిలోనే రాజ‌ధాని..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పెద్ద‌లు ఏనాడో చెప్పిన ఒక మాట ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో బాగా వినిపిస్తోంది. ఇంత‌కీ, పెద్ద‌లు చెప్పిన ఆ మాట ఏమిట‌య్యా...? అంటే 'చెర‌ప‌కురా.. చెడేవు' రాష్ట్ర విభ‌జ‌ననాటి నుంచి ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల‌ను ఒక్కొక్క‌టిగా ప‌రిష్క‌రించుకుంటూ, రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం సంపూర్ణ‌మ‌వుతున్న వేళ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌ను తెర‌మీద‌కు తీసుకొచ్చారు. నిధుల కొర‌త కార‌ణంగా అమ‌రావ‌తినే అభివృద్ధి చేయ‌లేని వారు విశాఖ‌, క‌ర్నూలును తెర‌మీద‌కు తీసుకు రావ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని, ఇందులో రాజ‌కీయ క‌క్ష సాధింపు చ‌ర్య‌లే త‌ప్ప మ‌రే ఇత‌ర కార‌ణాలు కాన‌రావ‌డం లేదన్న‌ది ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌.

సీఎం జ‌గ‌న్ తీసుకున్న ఈ నిర్ణ‌యంపై కొన్ని జిల్లాల ప్ర‌జ‌లు వ్య‌తిరేక‌త చూపుతున్నారు. వైసీపీ స‌ర్కార్‌పై కారాలు, మిరియాలు నూరుతున్న జిల్లాల్లో చిత్తూరుదే ప్ర‌థమ స్థానం. ఈ జిల్లాకు స‌రిహ‌ద్దులుగా క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ట్రాలు ఉన్న సంగ‌తి తెలిసిందే. తెలుగుతోపాటు ద్ర‌విడ భాష సంస్కృతుల స‌మ్మేళ‌నం ఈ జిల్లా. చారిత్రాత్మాక ఘ‌ట‌న‌ల‌కు, ప్ర‌దేశాల‌కు నెల‌వు ఈ జిల్లా. ఎంద‌రెంద‌రో రాజుల చేత పాలింప‌బ‌డిన ప్రాంతం. ఎన్నో పుణ్యక్షేత్రాల‌కు నెల‌వు. ప్ర‌పంచంలోనే అత్యంత ప్ర‌సిద్ధి చెందిన ఆధ్యాత్మిక స్థ‌లిగా గుర్తింపు పొందింది. ఒక్క మాట‌లో చెప్పాలంటే క‌ళ‌లు, సాహిత్యాలు, రాజ‌కీయ‌, విద్య‌, సామాజిక, సంస్కృతిక ఇలా అన్ని రంగాల్లోనూ ఈ చిత్తూరు జిల్లా ఎంతో ప్ర‌గ‌తిని సాధించింది. 1911లో చిత్తూరు జిల్లా ఏర్పాటు జ‌రిగిన‌ప్పుడు అక్క‌డి జ‌నాభా ప‌ద‌కొండు ల‌క్ష‌లు, ప్ర‌స్తుతం ఆ సంఖ్య 50 ల‌క్ష‌ల‌కు చేరుకుంది.

అంత‌టి ఘ‌న చ‌రిత్ర‌ను క‌లిగిన చిత్తూరు జిల్లాలో సీఎం జ‌గ‌న్ చేసిన మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న ప్ర‌కంప‌న‌లు రేపింది. జ‌గ‌న్ రాజేసిన ఈ సెగ భ‌విష్య‌త్తులో తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కు దారి తీసినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వైసీపీ మిన‌హా అన్ని రాజ‌కీయ పార్టీలు, మేథావులు, సామాజిక‌వేత్త‌లు, ప్ర‌జ‌లు జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల ప్ర‌క‌ట‌న‌పై ఆగ్ర‌హావేశాల‌ను వెల్ల‌గ‌క్కుతున్నారు. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మూడు రాజ‌ధానుల ఏర్పాటు నిర్ణ‌యం తీసుకుని ఉంటే బాగుండేద‌ని, కానీ, పాల‌న పేరుతో రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేయ‌డం ఏంట‌న్న‌ది వారి ప్ర‌శ్న.

నాడు మాజీ సీఎం చంద్ర‌బాబు అన్ని ఆలోచించే అమ‌రావ‌తిని రాజ‌ధానిగా ప్ర‌క‌టించార‌ని, అన్ని ప్రాంతాల‌కు స‌మాన దూరం ఉండ‌బ‌ట్టే ఆ నిర్ణ‌యం తీసుకున్నార‌ని వారు చెబుతున్నారు. అటువంటి సీఎం జ‌గ‌న్ ఈ మూడు రాజ‌ధానుల నిర్ణ‌యం ఎందుకు తీసుకున్నారో ప్ర‌జ‌లెవ్వ‌రికీ అర్ధం కావ‌డం లేదంటున్నారు. విశాఖ‌ను ప‌రిపాల‌న రాజ‌ధానిగా చేస్తే త‌మ‌కు చాలా దూర‌మ‌వుతుంద‌న్న భావ‌న‌ను వారు వ్య‌క్తం చేస్తున్నారు. అలాగే, క‌ర్నూలులో జ్యుడిషియ‌ల్ క్యాపిట‌ల్ ఏర్పాటు నిర్ణ‌యాన్ని కూడా వారు త‌ప్పుబ‌డుతున్నారు. ప్ర‌శాంత వాతావ‌ర‌ణం నెల‌కొని ఉన్న ఏపీలో సీఎం జ‌గ‌న్ ఈ త‌ర‌హా ప్ర‌క‌ట‌న‌లు చేసి ప్ర‌జ‌ల మ‌ధ్య చిచ్చురేప‌డం స‌రికాదంటున్నారు.

ఈ నేప‌థ్యంలో మాజీ మంత్రి అమ‌ర్‌నాథ్‌రెడ్డి స‌రికొత్త ప్ర‌తిపాద‌న‌ను తెర‌పైకి తెచ్చారు. అమ‌రావ‌తినే రాజ‌ధానిగా కొన‌సాగించాల‌ని, అలా కుద‌ర‌ని ప‌క్షంలో శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి స‌న్నిధాన‌మైన తిరుప‌తిలో రాజ‌ధానిని ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. అమ‌ర్‌నాథ్‌రెడ్డి ప్ర‌తిపాద‌న‌కు మేధావులు సైతం వారి స్వ‌రం క‌లిపారు. నిజానికి ఈ డిమాండ్ ఇప్ప‌టిది కాదు, ఎన్నో ఏళ్ల నుంచి వినిపిస్తున్న మాట‌. అటువంటిది రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను దృష్టిలో ఉంచుకుని నాడు చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యంతో తామంతా అమ‌రావ‌తిని ఒప్పుకున్నామ‌ని చెబుతున్నారు. రాజ‌ధాని మార్పు త‌ధ్య‌మ‌ని వైసీపీ స‌ర్కార్ భావిస్తే మాత్రం తిరుప‌తి నుంచి పాల‌న‌ను కొనసాగించాల‌న్న వాద‌నను వినిపిస్తున్నారు.

తిరుప‌తిలో రాజ‌ధాని ఏర్పాటు కుద‌ర‌ని ప‌క్షంలో జిల్లాలోని సగం ప్రాంతాన్ని త‌మిళ‌నాడులోను, మ‌రో స‌గ భాగాన్ని క‌ర్ణాట‌క‌లోనూ విలీనం చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇలా జ‌గ‌న్ స‌ర్కార్ ముందు ప్ర‌తిపాద‌న‌లు ఉంచుతూ కొంత మంది పోరాటాలు చేసేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతుండ‌టం విశేషం. త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క రాజ‌ధానులు చెన్నై, బెంగ‌ళూరుల‌కు వెళ్లాలంటే ఈ జిల్లా నుంచి కేవ‌లం మూడు గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ప‌డుతుంది. ఏదేమైనా త‌మ జిల్లాప‌ట్ల వైసీపీ ప్ర‌భుత్వం త‌మ నిర్ణ‌యాన్ని వీలైనంత త్వ‌ర‌గా ప్ర‌క‌టించాల‌ని, లేకుంటే ఉద్య‌మాలు తీవ్ర‌రూపం దాలుస్తాయంటూ హెచ్చ‌రిస్తున్నారు. మ‌రీ చిత్తూరు జిల్లా వాసుల ప్ర‌తిపాద‌న‌ల‌పై జ‌గ‌న్ స‌ర్కార్ ఏమేర స్పందిస్తుందో వేచి చూడాలి.

 

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

డీఎస్ పశ్చాత్తాపం.. కాంగ్రెస్‌ని వీడి తప్పుచేశా!

   3 hours ago


పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

పనిచేయని పవన్ ఆదేశాలు .. రాపాక రూట్ అటేనా?

   5 hours ago


కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

కామన్ సెన్స్ కి వచ్చిన తిప్పలు.. సెన్సాఫ్ హ్యూమరట!

   5 hours ago


రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

రాజకీయ పార్టీల వికృత క్రీడకు బలైపోయిన ఆంధ్రుడు!

   7 hours ago


స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

స్పీకర్ నామమాత్రమేనా? జగనే సుప్రీం అవుతున్నారా?

   9 hours ago


అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ప్రవేశ పెట్టిన బుగ్గన

   9 hours ago


హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

హైపవర్ కమిటీ నివేదికకి కేబినెట్ ఓకె.. మూడురాజధానులకు సై

   9 hours ago


టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

టీడీపీ హయాంలో అభివృద్ధి... బీజేపీ, కాంగ్రెస్ నేతల పోటీ

   9 hours ago


జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

జేపీ న‌డ్డా.. ఇక బీజేపీ బాస్‌..! ఎవ‌రాయ‌న‌..?

   10 hours ago


'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

'జ‌గ‌న్‌కు మోడీ, అమిత్ షా అండ‌'.. మీకు అర్ధ‌మ‌వుతుందా..?

   11 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle