newssting
BITING NEWS :
*జపాన్ టీంని ఓడించిన ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం *ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం... దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం లేదన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్*బీహార్ లో మెదడువాపు వ్యాధికి బలమయిన 152 మంది చిన్నారులు *ప్రజావేదికను కూల్చేయండి.. సీఎం జగన్ ఆదేశం*కొనసాగుతున్న ఏపీలో కలెక్టర్ల కాన్ఫరెన్స్*అఫ్గాన్‌పై బంగ్లా ఘనవిజయం

తిరుపతి వేదికగా విజయ శంఖారావం

17-03-201917-03-2019 08:40:07 IST
2019-03-17T03:10:07.306Z17-03-2019 2019-03-17T03:09:47.351Z - - 26-06-2019

తిరుపతి వేదికగా విజయ శంఖారావం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తన స్వంత జిల్లా చిత్తూరు నుంచి చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి శంఖం పూరించారు. ఏడుకొండలస్వామి సాక్షిగా విజయ శంఖారావసభ నిర్వహించారు చంద్రబాబు.  తిరుపతిలోని తారకరామ మైదానంలో నిర్వహించిన సభలో మోడీ, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి తీరుపై మండిపడ్డారు. ‘‘అవినీతిలో పట్టుబడ్డ వ్యక్తి జగన్‌ను ఎల్లప్పుడూ కాపాడేది చౌకీదార్‌ ప్రధాని నరేంద్రమోదీ. ఆంధ్రలో ఫ్యాన్‌..  హైదరాబాద్‌లో స్విచ్.. దిల్లీలో కరెంటు ఉటుంది. దిల్లీ నుంచి కరెంటు వస్తే హైదరాబాద్‌లో స్విచ్‌ వేస్తే ఇక్కడ ఫ్యాన్‌ తిరుగుతుంది. ఇలాంటి ఫ్యాన్‌ను ఇక్కడ తిరగనిస్తారా తమ్ముళ్లూ?’’ అని ప్రశ్నించారు. 

తన చిన్నాన్న వైఎస్‌ వివేకానంద రెడ్డి మృతిని కూడా జగన్ పార్టీ రాజకీయాలకు వాడుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. చిన్నాన్న హత్యకు గురైతే దోషులపై కఠిన చర్యలు తీసుకొనేలా డిమాండ్‌ చేయకుండా జగన్‌ వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో మోదీ ఉన్నారనే జగన్‌ సీబీఐ విచారణ కోరుతున్నారన్నారు.

ఈ హత్య ఎవరు చేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలన్నారు. ఈ కేసులో దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామని స్పష్టంచేశారు.  ఏపీ డేటాను కేసీఆర్ జగన్‌కు ఇచ్చారన్నారు. ఎన్టీఆర్‌ వైద్య సేవ ద్వారా ఏప్రిల్‌ నుంచి రూ.5 లక్షల వైద్య సాయం అందుతుందన్నారు. ఇప్పటివరకూ రెండున్నరలక్షలు మాత్రమే అవకాశం ఉందన్నారు. పేదలకు మెరుగైన, నాణ్యమయిన వైద్యసేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle