newssting
BITING NEWS :
*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1931 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 11 మంది మృతి.. 86,475 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌... ఇప్పటి వరకు 665 మంది మృతి*ఢిల్లీ: ప‌న్నుల సంస్క‌ర‌ణ‌ల‌కు కేంద్రం సిద్ధం... నేడు పార‌ద‌ర్శ‌క ప‌న్నుల వేదిక ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోడీ, ప‌లు అసోసియేష‌న్ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానం*విశాఖ: షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై జిల్లా కలెక్టర్ వినయ్‌ చంద్‌‌కు నివేదిక అ౦దజేసిన విచారణ కమిటీ *ఢిల్లీ: కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ నాయక్ కి కరోనా పాజిటివ్*ఢిల్లీ: కాంగ్రెస్ అధికార ప్రతినిధి రాజీవ్ త్యాగి గుండె పోటు తో మృతి*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 2296 మంది మృతి.. రాష్ట్రంలో 90,425 యాక్టివ్ కేసులు *దేశంలో కరోనా ఉధృతి.. 23లక్షల 95 వేల 471 పాజిటివ్ కేసులు.. మరణాలు 47,138 *మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమం

తారా స్థాయికి తిరుమ‌ల శ్రీ‌వారి నామాల వివాదం..!

14-02-202014-02-2020 09:37:35 IST
2020-02-14T04:07:35.805Z14-02-2020 2020-02-14T04:07:34.076Z - - 14-08-2020

తారా స్థాయికి తిరుమ‌ల శ్రీ‌వారి నామాల వివాదం..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తిరుప‌తి గ‌రుడ వార‌ధిపై శ్రీ‌వారి నామాల వివాదం చుట్టు ముట్టింది. ఫ్లై ఓవ‌ర్ పిల్ల‌ర్స్‌పై ముద్రించిన నామాల ఆకారం కొత్త వివాదానికి తెర తీసింది. కాగా, శ్రీ‌వారి నామం ఎలా ఉండాల‌న్న‌దానిపై ఎప్ప‌టి నుంచో వివాదం న‌డుస్తుంది. వైష్ణ‌వ సాంప్ర‌దాయంలో రెండు వ‌ర్గాలు ఉన్నాయి.

వ‌డ‌గ‌లై సాంప్ర‌దాయ వాదులు శ్రీ‌వారి నామాన్ని యూ ఆకారంలో దిద్దుదారు. తెంగ‌లై సాంప్ర‌దాయ వాదులు శ్రీ వార నామాన్ని వై ఆకారంలో దిద్దుతారు. అయితే అధికారులు మాత్రం వ‌డ‌గ‌లై సాంప్ర‌దాయం ప్ర‌కారం పిల్ల‌ర్స్‌పై శ్రీ‌వారి నామాన్ని ముద్రించారు. ఓ పిల్ల‌ర్‌కు రంగులు కూడా వేశారు. దీనిపై తెంగ‌లై సాంప్ర‌దాయ వాదుల నుండి ప్ర‌తి ఘ‌ట‌న త‌ప్ప‌ద‌ని భావించిన అధికారులు వివాద ర‌హిత‌మైన చ‌తుర‌స్ర ఆకార నామాల ముద్ర‌ను కొత్త‌గా పిల్ల‌ర్స్‌పై వేస్తున్నారు.

సుమారు 684 కోట్ల రూపాయ‌ల‌తో నిర్మిస్తున్న గ‌రుడ వార‌ధిలో టీటీడీ మెజారిటీ వాటాదారుగా ఉంది. ఈ నిర్మాణ ప‌నులు వ‌చ్చే ఏడాది మార్చిక‌ల్లా పూర్తి కావాల్సి ఉంది. ఇప్ప‌టికే పిల్ల‌ర్ల నిర్మాణం పూర్తైంది. అయితే ముంద‌నుకున్న డిజైన్‌లో మార్పులు చేస్తూ పిల్ల‌ర్ల‌పై కొత్త‌గా శ్రీ‌వారి నామాల‌ను ముద్రించాల‌ని టీటీడీ ఉన్న‌తాధికారులు సూచించారు.

దీంతో ఫ్లై ఓవ‌ర్‌లోని 36 పిల్ల‌ర్ల‌పై శ్రీ‌వారి నామాల‌ను అచ్చువేశారు. ఇప్పుడిప్పుడే వాటికి రంగుల‌ను అద్ద‌డం మొద‌లు పెట్టారు. రంగులు వేసిన త‌రువాత చూసిన వారంద‌రూ భ‌ళేగా ఉంద‌నుకున్నారు. కానీ, అక్క‌డే అస‌లు వివాదం మొద‌లైంది. యూ ఆకార‌పు నామాన్ని ఫ్లై ఓవ‌ర్స్ పిల్ల‌ర్ల‌పై అచ్చు వేయ‌డం కొత్త వివాదానికి దారి తీసింది.

నిజానికి తిరుమ‌ల కొండ‌పై జీయ‌ర్ల‌కు, అర్చ‌కుల‌కు మ‌ధ్య చాలా ఏళ్లుగా నామాల వివాదం కొన‌సాగుతోంది. వైష్ణములో ద‌క్షిణాది వారిని తెంగ‌లై అని, ఉత్త‌రాధి వారిని వ‌డ‌గ‌లై వారుగా వ్య‌వ‌హ‌రిస్తారు. వైష్ణ‌వాన్ని వ్యాప్తి చేసిన రామానుజ‌చార్యుల ప‌రంప‌ర‌గా వ‌స్తున్న జీయ‌ర్లు వై ఆకారంలో శ్రీ‌వారి నామాన్ని ధ‌రిస్తారు.

ఇక వ‌డ‌గ‌లై తెగ‌కు చెందిన అర్చ‌క వైష్ణ‌వులు యూ ఆకార‌పు నామాన్ని ధ‌రిస్తారు. ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్య అనేక అంశాల్లో వివాదాలు న‌డుస్తూనే ఉన్నాయి. బ్రిటీష‌ర్ల కాలంలో ఈ వివాదం ర‌చ్చ‌కెక్కింది. తిరుమ‌ల‌లో కొలువై ఉన్న ఆ శ్రీ‌నివాసుడికి ఏ త‌ర‌హా నామం ధ‌రించాల‌న్న విష‌యంలో పెద్ద ర‌గ‌డే జ‌రిగింది. అయితే, బ్రిటీషు హ‌యాంలోనే దీనికి ప‌రిష్కారం క‌నుగొన్నారు.

రెండు వ‌ర్గాల‌కు చెందిన వై, యూ ఆకారాల‌ను క‌లుపుతూ కొత్త‌గా చ‌తుర‌స్రాన్ని పోలి ఉండే ఓ విభిన్న నామాన్ని సృష్టించారు. రెండు వ‌ర్గాల ఆమోదంతో నాటి నుండి సాక్షాత్తు ఆ శ్రీ‌వారి మూట విరాట్టు సైతం ఈ చ‌తుర‌స్రాకార‌పు నామాన్ని ధ‌రిస్తూ వస్తున్నారు. దీనికి మ‌ధ్య‌లో తిల‌కం ఉంటుంది. శ్రీ‌వారి మూల విరాట్టు నామాన్ని మారుస్తున్నారంటూ అప్పుడ‌ప్పుడు ఇటు అర్చ‌కులు, అటు జీయ‌ర్లు ప‌ర‌స్ప‌రం విమ‌ర్శ‌లు చేసుకున్న ఘ‌ట‌న‌లు కూడా ఉన్నాయి. 

వీళ్ళు మనుషులేనా? రాత్రంతా వానలోనే కరోనా మృతదేహాలు

వీళ్ళు మనుషులేనా? రాత్రంతా వానలోనే కరోనా మృతదేహాలు

   7 hours ago


ఒకవైపు కరోనా ఉధృతి.. జెఎన్టీయూ కీలక నిర్ణయం

ఒకవైపు కరోనా ఉధృతి.. జెఎన్టీయూ కీలక నిర్ణయం

   8 hours ago


టీడీపీనేత అచ్చెన్నకు కరోనా పాజిటివ్

టీడీపీనేత అచ్చెన్నకు కరోనా పాజిటివ్

   9 hours ago


మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం

   13 hours ago


హర్షకుమార్ వెనుక చంద్రబాబే.. . మంత్రి విశ్వరూప్ ఫైర్

హర్షకుమార్ వెనుక చంద్రబాబే.. . మంత్రి విశ్వరూప్ ఫైర్

   15 hours ago


ఈసారి గోల్కొండ కాదు.. ప్రగతి భవన్‌లో పంద్రాగస్తు వేడుకలు

ఈసారి గోల్కొండ కాదు.. ప్రగతి భవన్‌లో పంద్రాగస్తు వేడుకలు

   15 hours ago


ముగిసిన మాజీమంత్రి ఖలీల్ బాషా అంత్యక్రియలు

ముగిసిన మాజీమంత్రి ఖలీల్ బాషా అంత్యక్రియలు

   16 hours ago


ఏపీలో 26 లక్షలు దాటిన టెస్టులు..  ప్రతి జిల్లాలో వైరస్ విజృంభణ

ఏపీలో 26 లక్షలు దాటిన టెస్టులు.. ప్రతి జిల్లాలో వైరస్ విజృంభణ

   16 hours ago


ఏజెన్సీని కమ్మేసిన మేఘాలు.. భారీవర్షాలు

ఏజెన్సీని కమ్మేసిన మేఘాలు.. భారీవర్షాలు

   16 hours ago


జూనియర్ డాక్టర్లకు జగన్ గుడ్ న్యూస్ ...స్టైఫండ్ పెంపు

జూనియర్ డాక్టర్లకు జగన్ గుడ్ న్యూస్ ...స్టైఫండ్ పెంపు

   17 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle