newssting
BITING NEWS :
*తెలంగాణ: నేడు సిరిసిల్ల, వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్*అమరావతి: 32వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు*20న కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్నమార్చిన ఏపీ సర్కార్ *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం *అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు* హైదరాబాద్‌: నేడు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి... ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్* టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. భారత్ ఘన విజయం

తారక్ ముందుండి నడిపిస్తే..2024లో టీడీపీ ప్రభంజనమేనా?

18-11-201918-11-2019 17:38:50 IST
Updated On 18-11-2019 17:42:38 ISTUpdated On 18-11-20192019-11-18T12:08:50.346Z18-11-2019 2019-11-18T12:08:46.685Z - 2019-11-18T12:12:38.161Z - 18-11-2019

తారక్ ముందుండి నడిపిస్తే..2024లో టీడీపీ ప్రభంజనమేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ రాజ‌కీయాల్లో ఇప్పుడు తార‌క మంత్రం జోరుగా సాగుతోంది. మ‌రీ ముఖ్యంగా బెజ‌వాడ రాజ‌కీయాల్లో జూ.ఎన్టీఆర్ పేరు ఓ రేంజ్‌లో మారుమోగుతోంది. టాలీవుడ్ న‌ట రుద్రుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరును ప‌దే ప‌దే జ‌పిస్తున్నారు.

అయితే, గ‌డిచిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోర ఓట‌మిని చ‌విచూసిన సంగ‌తి తెలిసిందే. దాంతో నాటి నుంచి తెలుగు త‌మ్ముళ్ల‌లో పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయ‌క‌త్వంపై న‌మ్మ‌కం స‌న్న‌గిల్లింద‌ని రాజ‌కీయ వర్గాల్లోనూ చ‌ర్చ కొన‌సాగుతోంది.

ఈ నేప‌థ్యంలో మ‌రి తాత నంద‌మూరి తార‌క రామారావు చ‌రీష్మా పుణికి పుచ్చుకున్న జూ.ఎన్టీఆర్ పార్టీకి ట్రబుల్ షూట‌ర్‌గా మారుతాడా...? జూ.ఎన్టీఆర్ మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి రాబోతున్నారా..? అన్న ప్ర‌శ్న రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉత్ప‌న్న‌వ‌మ‌వుతోంది.

ఏపీ రాజ‌కీయాల్లో ఎక్క‌డ చూసినా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఒక‌ప‌క్క అధికార పార్టీ మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ నంద‌మూరి హ‌రికృష్ణ తన‌యుడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు మాత్ర‌మే టీడీపీని న‌డిపే స‌త్తా ఉంద‌ని కామెంట్ చేస్తుంటే.. మ‌రోప‌క్క వ‌ల్ల‌భ‌నేని వంశీ కూడా దాదాపుగా ఈర‌క‌మైన కామెంట్సే చేస్తున్నారు.

అంతేకాక వ‌ల్ల‌భ‌నేని ఇంకాస్త లోతుగా టీడీపీపై విమ‌ర్శ‌లు చేసే క్ర‌మంలో 2009లో చంద్ర‌బాబు ఎన్టీఆర్‌ను వాడుకుని వ‌దిలేశారంటూ కాస్త ఘాటుగానే చెప్పారు. చంద్ర‌బాబు త‌రువాత ఎన్టీఆరే పార్టీని న‌డిపేందుకు స‌మ‌ర్ధ‌వంతుడ‌ని డైరెక్టుగానే చెప్పారు వ‌ల్ల‌భ‌నేని వంశీ.

దీంతో, తాత విశ్వ విఖ్యాత న‌ట సార్వ‌భౌముడిలాగే మంచి చ‌రీష్మా, వాక్ ప‌ఠిమ ఉన్న జూనియ‌ర్ ఎన్టీఆర్ రాజ‌కీయాల్లో ప్ర‌వేశించే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్న వాద‌న జోరుగా వినిపిస్తోంది. పార్టీ గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా కేవ‌లం 23 ఎమ్మెల్యేలకే ప‌రిమితం కావ‌డం, వారిలో ఎవ‌రు పార్టీలో ఉంటారో? ఎవ‌రు బ‌య‌ట‌కు వెళ్లిపోతారో? తెలియ‌ని అయోమయ స్థితి నెల‌కొని ఉంది.

దీంతో పార్టీకి జ‌రుగుతున్న డ్యామేజీని చంద్ర‌బాబు ఏ మాత్రం కంట్రోల్ చేయ‌లేక‌పోతున్నారు. ఈ ప‌రిస్థితిలో జూనియ‌ర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగ‌క త‌ప్ప‌క ప‌రిస్థితి స్పష్టంగా క‌న‌ప‌డుతుంద‌ని టీడీపీ నేత‌లే చెవులు కొరుక్కుంటున్నారు. ప్ర‌స్తుతం టీడీపీలో కీల‌క నేత‌లుగా ఉన్న వారంతా ఇత‌ర పార్టీల్లోకి వ‌ల‌స‌బాట‌ప‌డుతున్నారు.

ఇప్ప‌టికే ఆ పార్టీకి కంచుకోట‌గా ఉన్న ప్రాంతాల్లోని నేత‌లు ఒక్కొక్క‌రుగా ఒక‌రి వెంట మ‌రొక‌రు రాజీనామా చేస్తూ బ‌య‌ట‌కు వెళ్లిపోతున్నారు. దీంతో పార్టీలో ఒక‌ర‌క‌మైన స్త‌బ్ద‌త నెల‌కొని ఉంది. ఇలాంటి స‌మ‌యంలో పార్టీకి పున‌ర్వైభ‌వం రావాలంటే ఓ చ‌రీష్మా ఉన్న నేత కావాల్సిందేన‌ని పార్టీ నేత‌లంతా భావిస్తున్నారు.

అటు లోకేష్ నాయ‌క‌త్వంపై సీనియ‌ర్లు కూడా సుముఖంగా లేక‌పోవ‌డంతో ఎన్టీఆర్ రావాల‌న్న చ‌ర్చ ప్రారంభ‌మైంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అయితేనే పార్టీని స‌మ‌ర్ధ‌వంతంగా న‌డిపిస్తాడ‌ని నేత‌లు విశ్వ‌సిస్తున్నారు. వాస్త‌వానికి 2009 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆక‌ట్టుకునే వాక్చాతుర్యంతో చేసిన ప్ర‌చారం అప్ప‌ట్లో టీడీపీకి బాగా క‌లిసొచ్చింది.

ఆ త‌రువాత ప‌దేళ్ల నుంచి అస‌లు రాజ‌కీయాల‌వైపు జూనియ‌ర్ క‌న్నెత్తి కూడా చూడ‌లేదు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో జూనియ‌ర్ ఎన్టీఆర్‌ను రంగంలోకి దింపితేనే పార్టీ మ‌ళ్లీ పూర్వ స్థితికి వ‌స్తుంద‌ని టీడీపీకి చెందిన కొంత మంది నేత‌లు కూడా ఆలోచ‌న చేస్తున్న‌ట్టు స‌మాచారం.

ఇదే స‌మ‌యంలో కొంత కాలంగా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్న ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు ఇదే క‌రెక్ట్ టైమ్ అని భావిస్తున్న‌ట్టు అత‌ని స‌న్నిహితులు అంటున్నారు. ఇదే జ‌రిగి పార్టీ ప‌గ్గాలు చేప‌డితే 2024 ఎన్నిక‌ల్లో టీడీపీని ఎన్టీఆరే ముందుండి నడిపిస్తార‌ని పార్టీ నేత‌లు కూడా భావిస్తున్నారు. మ‌రి జూనియ‌ర్ మ‌న‌సులో ఏముంది..?  సీనియ‌ర్‌లాగే పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టి తాత‌లాగే ప్ర‌భంజనం సృష్టిస్తారా..?  లేదా..? అన్న‌ది కొన్నాళ్లు ఆగితేగానీ.. క్లారిటీ రాదు.

 

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

కారుకి జూపల్లి టెన్షన్.. రంగంలోకి ట్రబుల్ షూటర్!

   15 hours ago


రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

రాజధాని గ్రామాల్లో పోలీసుల ఆంక్షలు

   15 hours ago


‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

‘‘కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుంది’’

   17 hours ago


ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

ట్వీట్ల యుద్ధం.. చదువుకున్న సన్నాసులంటూ నాగబాబు ఫైర్

   17 hours ago


సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

సాయిబాబా జ‌న్మ‌భూమిపై వివాదం..! అస‌లేం జ‌రుగుతోంది..?

   17 hours ago


ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

ఎన్టీయార్‌కి ఘన నివాళి .. ఘాట్‌కి తరలివచ్చిన కుటుంబీకులు

   18 hours ago


ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

   18 hours ago


తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఫిక్స్...?

   19 hours ago


వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

వైసీపీ చెబుతోన్న 'ఈ బిర్రు ప్ర‌తాప్‌రెడ్డి ఎవ‌రు'..?

   19 hours ago


విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

విశాఖలో రియల్ బూమ్... ఎగ్జిక్యూటివ్ క్యాపిటలే కారణమా?

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle