newssting
BITING NEWS :
* గోదావరిలో పర్యాటక బోటు మునక పలువురు గల్లంతు. *వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకెన్నో ఇబ్బందులు.. ఇక పోరాటమే:పవన్ కళ్యాణ్ *.హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ ...తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు *బద్వేలులో భారీ అగ్నిప్రమాదం *హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ ...కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి *మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు ..కేసీఆర్ పై భట్టి విమర్శలు *నేడు భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20

తాడికొండ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్

03-09-201903-09-2019 17:39:18 IST
2019-09-03T12:09:18.004Z03-09-2019 2019-09-03T11:58:02.810Z - - 15-09-2019

తాడికొండ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని కులం పేరుతో కొంతమంది దూషించారన్న వార్తలతో ఏపీ అట్టుడుకుతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ గుంటూరు రూరల్‌ ఎస్పీని కోరారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఎస్పీతో మాట్లాడారు. మహిళ దళిత ఎమ్మెల్యేకే రక్షణ లేదని.. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆమె ప్రశ్నించారు.

అంటరానితనాన్ని రెచ్చగొట్టే విధంగా టీడీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. దళిత ఎమ్మెల్యే.. దేవుడు దగ్గరకు వెళితే మైల పడతారని, గణేష్ కి పూజచేయకూడదని మాట్లాడటం ప్రజాస్వామ్య,రాజ్యాంగ విరుద్ధమని ఆమెపేర్కొన్నారు. టీడీపీ నేతలు తాము ఇంకా అధికారంలో ఉన్నామని భావిస్తున్నారని, రౌడీల్లా రెచ్చిపోతున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. 

గుంటూరు:దళిత ఎమ్మెల్యే శ్రీదేవిపై టీడీపీ నేతల దౌర్జన్యం దారుణమని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. తనపై కుల వివక్షకు పాల్పడిన వారిని పెంచి పోషించింది చంద్రబాబే అని ఆరోపించారు తాడికొండ ఎమ్మెల్యేల శ్రీదేవి.

తనను కులం పేరుతో తిట్టిన వారినే కాకుండా చంద్రబాబును కూడా అరెస్ట్ చేయాలన్నారు. ఇదిలా ఉంటే తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని దూషించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొమ్మినేని శివయ్య, సాయి, రామకృష్ణ, బుజ్జిలపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, తాము ఎమ్మెల్యేను తాము దూషించలేదని నిందితులు పేర్కొంటున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle