newssting
BITING NEWS :
*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

తాజా నివేదిక.. తీవ్ర సంక్షోభానికి చేరువలో ఏపీ సర్కార్

27-11-201927-11-2019 14:36:46 IST
2019-11-27T09:06:46.828Z27-11-2019 2019-11-27T09:06:41.407Z - - 15-12-2019

తాజా నివేదిక.. తీవ్ర సంక్షోభానికి చేరువలో ఏపీ సర్కార్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ ప్రభుత్వం ఇప్పుడు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులలో ఉంది. కొన్ని అనాలోచిత ప్రభుత్వ నిర్ణయాల వలనే రాష్ట్ర ఆదాయానికి భారీగా గండిపడగా ప్రతినెలా జీతభత్యాలకు, సంక్షేమ పథకాల చెల్లింపులకు కూడా తర్జభర్జనలు పడుతున్నారని నిపుణుల అభిప్రాయం. ఇప్పటికే ఈ పరిస్థితులకు అధిగమించేందుకు సర్కార్ ఎక్సైజ్ శాఖ అధీనంలో నడుస్తున్న లిక్కర్ ధరలను భారీగా పెంచేసింది.

ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం భూములను తెగనమ్మేసి అయినా ప్రభుత్వం ఖజానాను పెంచేందుకు ప్రణాళికలు కూడా సిద్ధమవుతున్నాయి. వీటికి తోడు రాష్ట్రానికి ఆదాయం వచ్చే ఏ మార్గాన్ని వదిలిపెట్టవద్దని సీఎం అధికారులను ఆదేశిస్తున్నారు. దీనికంతటికి కారణం ఆర్థికశాఖ అధికారుల హెచ్చరికలు.. ఆర్థికశాఖ తయారుచేసిన తాజా నివేదికే కారణంగా తెలుస్తుంది.

వచ్చే ఏడాది మార్చినెల చివరకు.. అంటే సరిగ్గా నాలుగు నెలలకు ఏపీ ప్రభుత్వం రూ 21,000 కోట్ల మేరకు లోటుతో ఉండవచ్చని ఆర్ధిక శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో వచ్చే పన్నులు, కేంద్రం నుండి వివిధ పథకాల క్రింద రావలసిన నిధులు, ప్రభుత్వం వివిధశాఖల, ఇప్పటికే చెల్లింపులు చేస్తున్న పథకాలను అన్నిటినీ కలిపి రెవెన్యూ అధికారులు ఈ నివేదికను తయారుచేశారట.

ప్రభుత్వం ఏర్పాటైన ఆరునెలలలో ప్రతినెలా రాష్ట్ర ఆదాయం పెద్ద ఎత్తున తగ్గుతూ ఉండడంతో ఈ లోటు బడ్జెట్ కనిపిస్తుందని అధికారులు ప్రభుత్వం ముందు కుండ బద్దలు కొట్టేశారట. ఈ నివేదికలో ముఖ్యంగా అధికారులు వెల్లడించిన వాటిలో.. రాష్ట్ర ఆదాయం రూ.83 వేల కోట్ల వరకు వస్తుందని అంచనా వేసినా రూ.54 వేల కోట్లు మాత్రమే వస్తుందని తేల్చేశారట.

ఇక బడ్జెట్‌లో రూ.1.78 లక్షల కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేసినా కేవలం రూ.1.57 లక్షల కోట్లు మాత్రమే వచ్చే సూచనలే ఉన్నాయని, కేంద్ర సాయం, రాష్ట్ర ఆదాయం కలిపి రూ.96 వేల కోట్ల వరకు వస్తుందని బడ్జెట్‌లో ప్రతిపాదించినా తాజాగా నివేదికలో అది రూ.50 వేల కోట్లు మాత్రమేనని పేర్కొన్నారట.

మొత్తంగా రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయినా కొద్దిమేర అప్పులతో మ్యానేజ్ చేసే వీలు ఉంటుంది కనుక కేవలం ఇరవై నుండి పాతిక వేల కోట్ల మేర మాత్రమే లోటు బడ్జెట్ చెప్తున్నామని లేకపోతే ఇది ముప్పై ఐదు కోట్లకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారట. మరి ప్రభుత్వం ఈ లోటును ఎలా పూడ్చుకుంటుందో.. ప్రతినెలా ముంచుకొచ్చే ఈ ఆర్ధిక తుఫానును ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సిఉంది.

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle