newssting
BITING NEWS :
*దిశ చట్టం తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రత్యుష తల్లి సరోజినిదేవి *ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక *ఎన్‌కౌంటర్‌లో మరణించిన నలుగురు దిశ నిందితుల మృతదేహాల్ని భద్ర పర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం * కాంగ్రెస్‌ ‘భారత్‌ బచావో’ ర్యాలీ* ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా విడుదల....ఫోర్బ్స్‌ జాబితాలో నిర్మలాసీతారామన్‌*బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ ఘన విజయం*భారత పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు గాయం. వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డే సిరీస్‌లకు దూరం * టి20 క్రికెట్‌లోకి వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవో

తలచినదే జరిగినదా.. పోలవరానికి మరోసారి బ్రేక్!

09-11-201909-11-2019 11:34:48 IST
2019-11-09T06:04:48.047Z09-11-2019 2019-11-09T05:54:34.892Z - - 15-12-2019

తలచినదే జరిగినదా.. పోలవరానికి మరోసారి బ్రేక్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ఎన్ని జిమ్మిక్కులు చేసినా మేధావులు, విశ్లేషకులు, ప్రాజెక్ట్ అధారిటీ చెప్పినట్లుగా పనులలో జాప్యం కొనసాగుతూనే ఉంది. పోలవరం ప్రాజెక్ట్ వ్యవహారంలో టెండర్ల రద్దు, రీ-టెండరింగ్ అన్నది సమంజసం కాదని దీనివలన ప్రాజెక్ట్ కాస్ట్ పెరగడంతో పాటు జాప్యం జరుగుతుందని ప్రాజెక్ట్ అధారిటీ నెత్తీనోరూ బాదుకుని చెప్పింది. కేంద్రం నుండి రాష్ట్రం వరకు ఎందరో పెద్దలు ప్రభుత్వం విధానం వలన నష్టాలే తప్ప లాభం ఉండదని, ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కు తగ్గితేనే మంచిదని తెగసి చెప్పారు.

ఏ మాత్రం తిరిగి వెనక్కు ఆలోచించని ప్రభుత్వం గత ప్రభుత్వంలో పోలవరం ప్రధాన ప్రాజెక్ట్ పనులు, హైడల్ విద్యుత్ ప్రాజెక్ట్ పనులను చేపట్టిన నవయుగను తప్పించి రీ-టెండరింగ్ విధానంలో మేఘా ఇంజనీరింగ్ సంస్థకు కట్టబెట్టింది. దీనిపై నవయుగ సంస్థ హైకోర్టుకి వెళ్లగా కోర్టు స్టే ఇచ్చింది. అలా నెలలు గొడవగా రాష్ట్ర ప్రభుత్వం ఆ స్టేను ఎత్తేయాలని హైకోర్టును ఆశ్రయించగా కోర్టు స్టేను ఎత్తేయడంతో హడావుడిగా అప్పటికప్పుడు నిర్మాణానికి మరోసారి కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు.

పనులు ఇంకా నిర్మాణం మళ్ళీ మొదలుకానేలేదు.. కొబ్బరి కాయ కొట్టి వారం గడవక ముందే మరోసారి బ్రేక్ పడింది. ముందుగా హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే ఇచ్చి ఎత్తేస్తే నవయుగ సంస్థ విస్తృత ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేసింది. నవయుగ పిటిషన్ ను విచారణకు తీసుకున్న విస్తృత ధర్మాసనం హైడల్ ప్రాజెక్ట్ పనులను నిలిపివేయాలని ఆదేశిస్తూ ప్రతివాదులకు నోటీసులు అందించింది. అనంతరం నాలుగు వారాలు విచారణను వాయిదావేసింది. ఆలస్యం అవుతుందన్న ప్రభుత్వ అప్పీల్ తో వచ్చే వారమే విచారణ చేస్తామని ప్రకటించింది.

కాగా వచ్చే వారం వాయిదాలో హైకోర్టు ప్రతివాదుల అభిప్రాయాలతో పాటు పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ అభిప్రాయాన్ని కూడా తీసుకోనుంది. అయితే అథారిటీ ఇప్పటికే ప్రభుత్వం విధానాల వలన నష్టాలేనని కుండబద్దలు కొట్టినట్లు చెప్పగా కోర్టులో ఎలాంటి సమాధానం ఇవ్వనుందో ఊహించవచ్చు. పైగా కొత్త సంస్థతో నిర్వహణలోనే కాకుండా ప్రాజెక్ట్ భద్రత మీద కూడా అనుమానాలు వ్యక్తం చేసిన అథారిటీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కోర్టులో అభిప్రాయాలు చెప్పనుందని ఊహిస్తున్నారు.

వచ్చే వారం విచారణలో అథారిటీ అభిప్రాయమే కీలకం కానుండగా ప్రభుత్వానికి, కొత్త నిర్మాణ సంస్థకు అనుకూలంగా కలిసొచ్చే అంశాలే లేవు. ఈక్రమంలో కోర్టు అభిప్రాయమే ప్రాజెక్టులో కీలకం కానుంది. కాగా ఇప్పటికే ఆరు నెలలుగా ప్రాజెక్టు నిర్మాణంలో అడుగు ముందుకుపడలేదు. ఇప్పుడు మళ్ళీ కోర్టు వ్యవహారాలు అడ్డంకిగా మారాయి. హైడల్ ప్రాజెక్టు కాకపోతే ప్రధాన ప్రాజెక్టు విషయంలో అయినా నవయుగ సంస్థ మళ్ళీ కోర్టుకెక్కడం ఖాయంగా కనిపిస్తుంది.

ఈక్రమంలో ప్రాజెక్ట్ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందని రాష్ట్ర ప్రజలలో ఆందోళన నెలకొంది. రీ-టెండరింగ్ విధానం వలన ఆదా చేశామని చెప్పుకుంటున్న జగన్ సర్కార్ ఆలస్యం కారణంగా ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యమవడంతో వచ్చే నష్టాలను లెక్కలోకి తీసుకోవడం లేదని విమర్శలు వినిపిస్తుండగా పోలవరాన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రజా ప్రాజెక్టుగా ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటేనే పూర్తి చేయగలదని మేధావులు అభిప్రాయపడుతున్నారు. మరి ప్రభుత్వం మరోసారి ఆలోచిస్తోందా? నెవర్ అని తెలిసిందే కదా!

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle