newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

తడిసిముద్దవుతున్న రాయలసీమ... మహానందీశ్వరుడికి వర్షాభిషేకం

17-09-201917-09-2019 12:24:40 IST
2019-09-17T06:54:40.714Z17-09-2019 2019-09-17T06:54:39.166Z - - 19-02-2020

తడిసిముద్దవుతున్న రాయలసీమ... మహానందీశ్వరుడికి వర్షాభిషేకం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం మహానంది ఆలయం జల దిగ్బంధంలో ఉంది. ఆలయంలో మొదటి, రెండో ప్రాకారంలోకి వరద నీరు ప్రవేశించింది. పంచలింగాల మంటపం వర్షపునీటిలో మునిగిపోయింది.

కోనేరు వరదలతో మహానంది ఆలయ అధికారులు దర్శనాలు రద్దు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి చేరుకుంది. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు కోస్తా, రాయలసీమ జిల్లాలలో భారీవర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. 

17 ,18, 19  తేదీల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని ఆర్టీజీఎస్ తెలిపింది. కృష్ణా,  గుంటూరు, పశ్చిమ గోదావరి,  నెల్లూరు,  ప్రకాశం చిత్తూరు కడప కర్నూలు అనంతపురం జిలాల్లో ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఈ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ వాతావరణ నిపుణులు సూచించారు. కడప జిల్లాలకు భారీ వర్షాలకు కుందూనది ఉధృతంగా ప్రవహిస్తోంది. పెద్దముడియం, రాజుపాలెం, దువ్వూరు మండలాల పరిధిలోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

ప్రొద్దుటూరు మండలం రాధానగర్‌ వద్ద.. కుందూనదిపై రోడ్డు దాటుతూ ఆటో వరదలో కొట్టుకుపోయింది. ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. అటు ఉధృ‌తంగా ప్రవహిస్తున్నాయి కుందూ, పెన్నా నదులు. దీంతో పెద్దముడియం గరిశలూరు, నెమల్ల దిన్నె గ్రామాల్లో వరద నీరు ప్రవహిస్తోంది. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

పెద్దముడియం పోలీస్ స్టేషన్ లోకి వరద నీరు చేరడంతో పోలీసులే ఆ నీటిని బయటకు తోడుతున్నారు. నెమళ్ళ దిన్నె బ్రిడ్జిపై నాలుగు అడుగుల మేర కుందూ నది నీరు ప్రవహిస్తోంది. పెద్దముడియం జంగాలపల్లె కొట్టాలపల్లి, ఉప్పలూరు, గూడూరు, చిన్నముడియం, నెమల్ల దిన్నె, ఏలూరు గ్రామాల వాసులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle