newssting
BITING NEWS :
*శబరిమల వివాదంపై సుప్రీం తీర్పు.శబరిమల వివాదం విస్తృత ధర్మాసనానికి బదిలీ *రాఫెల్‌ డీల్‌ : కేంద్రానికి క్లీన్‌చిట్‌ .. రివ్యూ పిటిషన్లు కొట్టివేత *రాహుల్ గాంధీకి రిలీఫ్.. పరువునష్టం కేసుపై సుప్రీం తీర్పు *వైసీపీలో చేరనున్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్*ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ ఆఫీస్.. సుప్రీం మరో సంచలన తీర్పు*ఏపీ కొత్త సీఎస్‌గా నీలం సహాని...నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్....ఇవాళ బాధ్యతలు స్వీకరించిన నీలం సహాని *ఇసుక కొరతపై చంద్రబాబు దీక్ష...12 గంటల పాటు దీక్షలో కూర్చున్న బాబు* ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన...మనబడి నాడు - నేడు కార్యక్రమానికి శ్రీకారం*విశాఖ: బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీస్ సంస్థలో సీఐడీ సోదాలు.. మన శాండ్ ఆన్‌లైన్ ఇసుక సరఫరా వెబ్‌సైట్ హ్యాక్ చేసినట్టు అనుమానం*ఢిల్లీ: అయోధ్య ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు.. పార్లమెంట్‌లో అయోధ్య ట్రస్ట్ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం*ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈనెల 18కి వాయిదా వేసిన హైకోర్ట్*అమరావతి: పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయనడం కరెక్ట్ కాదు.. చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు: మంత్రి బొత్స

తండ్రి సత్తా తనయుడికి లేదు.. సాదినేని సాకు ఇదే...

10-11-201910-11-2019 11:49:23 IST
Updated On 10-11-2019 13:15:18 ISTUpdated On 10-11-20192019-11-10T06:19:23.002Z10-11-2019 2019-11-10T06:19:12.622Z - 2019-11-10T07:45:18.727Z - 10-11-2019

తండ్రి సత్తా తనయుడికి లేదు.. సాదినేని సాకు ఇదే...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రెండు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని చేసిన ప్రకటన రాజకీయవర్గాల్లో సంచలనం కలిగించింది. ఎందుకంటే ఆమె మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి, ఆయన తనయుడు నారా లోకేష్‌లకు అత్యంత సన్నిహితురాలని అందరూ భావిస్తున్నారు. 

ముఖ్యమంత్రి సొంత సామాజిక వర్గానికి చెందినవారే కాకుండా ఆమె వాక్చాతుర్యం కూడా పార్టీలో అపారమైన ప్రతిష్టను సాదినేనికి కట్టబెట్టింది. టీడీపీ వ్యతిరేక పక్షాన్ని ముఖ్యంగా వైఎస్సార్ సీపీ నేతలను సోషల్ మీడియాలో ఆమె ఎండగట్టే తీరు ఆమెకు పార్టీలో తిరుగులేని గుర్తింపు తీసుకొచ్చింది.

అత్యంత తక్కువకాలంలో ఇంత పేరు సాధించిన యామిని అధికారం కోల్పోయిన ఆరునెలల్లోపే తనకు రాజకీయ బిక్ష పెట్టిన టీడీపీకి గుడ్ బై చెప్పడానికి దారితీసిన బలమైన కారణాలేమై ఉంటాయి? పైకిమాత్రం వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ నారాలోకేష్ కారణంగానే ఆమె అలాంటి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు వారసుడిగా నిత్యం తనను తాను ప్రదర్శించుకుంటూ వచ్చిన నారా లోకేష్ ఏపీ శాసనసభ ఎన్నికల్లో ఓడిపోవడం, ప్రజలు ఆయన్ని తమ నాయకుడిగా ఆమోదించలేకపోతుండటమే యామిని వైదొలగాడనికి కారణమని టీడీపీ వర్గాలే చెబుతుండటం గమనార్హం.

పైగా లోకేష్ పార్టీ పగ్గాలు చేపట్టడానికి సిద్ధపడితే రానున్నరోజుల్లో టీడీపీ కథ ముగిసిపోతుందని యామినిలో భయం పుట్టుకుందని సమాచారం. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన టీడీపీకి లోకేష్ నాయకత్వం ఆ పార్టీ పరిసమాప్తికి దారితీస్తుందన్న కారణంతోటే యామిని టీడీపీని వదిలిపెట్టాలని నిర్ణయించుకుందని సమాచారం.

వాస్తవానికి తాను టీడీపీనుంచి బయటపడాలని అనుకుంటున్నందుకు కారణాలను కూడా యామిని తన రాజీనామ ప్రకటన తర్వాత మీడియా సమావేశంలో సూచన ప్రాయంగా తెలిపారు కూడా. వంశపాలనా రాజకీయాలతో తాను విసిగిపోయానని ఆమె కరాకండీగా చెప్పేశారు.

వర్తమాన రాజకీయాలు ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీల రాజకీయాలు కులం, వారసత్వ సంస్కృతి ఆధిపత్యంలో సాగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుుడు కూడా ఈ సంస్కృతికి అతీతులు కాదు. బంధుప్రీతికి, ఆశ్రిత పక్షపాతానికి అతీతంగా ఆయన రాజకీయాలు చేయడం లేదు. ఇలాంటి పార్టీలలో న్యాయం జరుగుతుందని నేను భావించడం లేదు అని యామిని ఇన్నాళ్లుగా తాను పనిచేసిన తెలుగుదేశం పార్టీపై, దాని అధినేతపై పెద్ద బాంబే వేశారు. పైగా అలాంటి కుల, వారసత్వ సంస్కృతికి తావియ్యని బీజేపీలో చేరడానికి అదే ప్రధాన కారణం అని యామిని చెప్పారు.

అయితే చంద్రబాబు నాయకత్వంలో రాజకీయాల్లో ఎన్నో నేర్చుకున్నానని చెబుతూనే పార్టీలోని ఇతర నేతలపట్ల తాను సంతోషంగా లేనని ఆమె చెప్పారు. నా ప్రత్యర్తులు నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న దశలో కూడా ఎవరూ నాకు మద్దతుగా నిలబడలేదని చంద్రబాబు మాత్రమే నన్ను ఆదుకోవడానికి ముందుకొచ్చారని యామిని కృతజ్ఞత తెలిపింది. 

అదే సమయంలో పొత్తులు కుదుర్చుకోవడంలో టీడీపీ నిలకడను ప్రదర్సించడం లేదని యామిని తప్పు పట్టారు. గతంలో పార్టీని తూలనాడిన వారితోనే ఎన్నికల సమయంలో చేతులు కలపడం తనకు ఆశ్చర్యం కలిగించినట్లు సాదినేని చెప్పారు. 

పార్టీని తీవ్రంగా విమర్శించిన పపన్ కల్యాణ్‌తో చంద్రబాబు నెరపిన స్నేహబాంధవ్యాన్ని యామిని ప్రశ్నించారు. అలాగే ప్రత్యేక హోదాపై చంద్రబాబు తీసుకున్న యూటర్న్ తనకు సంతోషం కలిగించలేదని, టీడీపీ ఎన్నికల్లో పరాజయం పొందడానికి ఇదే కారణమని ఆమె అభిప్రాయపడ్డారు .

ఏదేమైనా పావలా కల్యాణం అని పవన్ కల్యాణ్‌ను, శుక్రవారం జ్ఞాపకం అంటూ కోర్టుకు హాజరవుతున్న వైఎస్ జగన్‌‌ను ఉద్దేశించి సాదినేని యామిని చేసిన వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారాయి.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle