newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

ఢిల్లీపై బాబు ఫోకస్... అందుకేనా?

17-04-201917-04-2019 08:03:31 IST
2019-04-17T02:33:31.183Z17-04-2019 2019-04-17T02:33:28.603Z - - 26-08-2019

ఢిల్లీపై బాబు ఫోకస్... అందుకేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నిక‌లు అయ్యాక చాలా మంది ఏపీ నేత‌లు రిలాక్స్ అవుతున్నారు. ఫ‌లితాల టెన్ష‌న్ త‌ట్టుకోలేక కొంత మంది వేరే ప్రాంతాల‌కు వెళ్తున్నారు. అయితే ఏపీ సీఎం చంద్ర‌బాబు మాత్రం రెట్టించిన ఉత్సాహంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. అన్ని పార్టీల నేత‌ల‌తో స‌మావేశం అవుతున్నారు. ఇంత‌కీ చంద్ర‌బాబు ఈ బిజీ షెడ్యూల్ వెనుక చాలా సీక్రెట్ ఉంద‌ట‌. జాతీయ రాజ‌కీయాల్లో త‌న మార్క్ చెదిరి పోకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం, కేసీఆర్ చెబుతున్నఫెడ‌ర‌ల్ ఫ్రంట్ స‌క్సెస్ కాకుండా చేయ‌డానికే ఆయ‌న ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

పోలింగ్ తీరు మీద కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేయ‌డానికి ఢిల్లీ వెళ్లిన చంద్ర‌బాబు ప‌నిలో ప‌నిగా అక్క‌డ కాంగ్రెస్ త‌దిత‌ర పార్టీల నేత‌ల‌ను క‌లిశారు. ఆ త‌ర్వాత క‌ర్ణాట‌క వెళ్లి జేడీఎస్ నేత‌లతో స‌మావేశం అయ్యారు. మాండ్యాలో జేడీఎస్ త‌ర‌పున ప్ర‌చారం చేశారు. ఇక త‌మిళనాడు వెళ్లిన చంద్ర‌బాబు డీఎంకే అధినేత స్టాలిన్ త‌దిత‌రుల‌ను క‌లిశారు. కేంద్ర ప్ర‌భుత్వం మీద తీవ్రమైన ఆరోప‌ణ‌లు చేశారు.

ఇలా జాతీయ స్థాయిలో త‌న మార్క్ చెదిరి పోకుండా ఉండ‌టానికి చంద్ర‌బాబు తాప‌త్ర‌య ప‌డుతున్నారు. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు త‌న‌కు అనుకూలంగా ఉంటే, మ‌రోసారి జాతీయ స్థాయిలో చ‌క్రం తిప్పాల‌న్న ఆశ‌లో చంద్ర‌బాబు ఉన్నార‌ట‌. రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తానన్న కేసీఆర్, వైసీపీకి ప‌రోక్షంగా మ‌ద్ద‌తు ఇచ్చార‌న్న‌ది చంద్ర‌బాబు ఆరోప‌ణ‌. కేసీఆర్ ప్లాన్ వర్కవుట్ అయితే మాత్రం చంద్రబాబు ఫోకస్ అంతా కేంద్ర రాజకీయాలపైనే ఉంటుంది. 

అంతేకాదు, ఒక‌వేళ ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాలు త‌న‌కు వ్య‌తిరేకంగా వ‌స్తే, టీడీపీకి కేసీఆర్ చుక్క‌లు చూపించ‌డం ఖాయ‌మ‌ని చంద్ర‌బాబు భ‌యప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.అందుకే ముందుగా జాతీయ స్థాయిలో ప‌ర్య‌టించి అన్ని పార్టీల నేత‌ల‌తో స‌మావేశమై, కేసీఆర్ గురించి పెద్ద‌గా చ‌ర్చ జ‌ర‌గ‌కుండా చంద్ర‌బాబు ప్లాన్ చేసిన‌ట్లు అర్థం అవుతోంది.

కానీ ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ్య‌తిరేకంగా వ‌స్తే, చంద్ర‌బాబును దేశంలోని ప్రాంతీయ పార్టీలు ప‌ట్టించుకుంటాయా అన్న ప్ర‌శ్న‌కు టీడీపీ పెద్ద‌ల నుంచి స‌మాధానం రావ‌డం లేద‌ట‌. ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వాలి కానీ, సొంత రాష్ట్రంలో ఓడిపోయి, దేశంలో ఎలా చ‌క్రం తిప్పుతారో చంద్ర‌బాబుకే తెలియాలి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle