newssting
BITING NEWS :
*ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతిపై నిరసనలు.. బాధిరాలి కుటుంబాన్ని పరామర్శించిన ప్రియాంకా గాంధీ *నేడు మండపేటలో పవన్ కల్యాణ్ పర్యటన... రైతుల సమస్యలు తెలుసుకోనున్న పవన్ *పఠాన్ చెరువులో బయటపడ్డ మరో సంగీత ఉదంతం.. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అత్తామామలపై దాడి చేసిన అనూష భర్త, అతని సోదరుడు*నేడు భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టీ-20 మ్యాచ్.. తిరువనంతపురం వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం*జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ లో భారీగా బదిలీలు... 49మంది సెక్షన్ అధికారులను బదిలీ చేసిన జీహెచ్ఎంసి అధికారులు*కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ లేఖ.తెలంగాణకు పన్నుల వాటా పన్నుల విడుదల చేయాలని వినతి *ఏపీలో పెరిగిన ఆర్టీసీ చార్జీలు.. పల్లె వెలుగు, సిటీ సర్వీసులపై కిలోమీటర్ కు 10 పైసలు పెంపు... మిగిలిన అన్ని సర్వీసులపై కిలోమీటర్ కు 20 పైసలు పెంపు*ఎన్ కౌంటర్ మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టును ఆశ్రయించిన పాలమూరు ఎస్పీ*అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలకు తొలగిన అడ్డంకి...12న విడుదల *కడపజిల్లాలో దొంగనోట్ల చలామణి ముఠా గుట్టురట్టు

ఢిల్లీకి జగన్.. ఆ ఐదు కారణాలేనా?

03-10-201903-10-2019 15:42:15 IST
2019-10-03T10:12:15.163Z03-10-2019 2019-10-03T10:12:13.129Z - - 09-12-2019

ఢిల్లీకి జగన్.. ఆ ఐదు కారణాలేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈనెల 5న ఢిల్లీకి పయనమవుతున్నారు. ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం కానున్న అయన కొందరు కేంద్రమంత్రులను కూడా ఈ టూర్లోనే కలవనున్నారని అయన కార్యాలయం నుండి వచ్చిన మీడియా సందేశం. మరో గంట తర్వాత తెలంగాణ సీఎం కెసిఆర్ కూడా ఒకరోజు ముందుగానే ఢిల్లీకి వెళ్తారని కూడా ప్రెస్ నోట్లు వచ్చాయి. అయితే ఇద్దరు కలిసే పీఎంఓకు వెళ్తారా.. ఎవరి రాష్ట్రం వాళ్ళది కానున్న ఎవరి మీటింగ్ వాళ్ళు పెట్టుకుంటారా అన్నది కాసేపు పక్కన పెడితే అసలు సీఎం జగన్ ఢిల్లీ యాత్రకు ఇవే కారణాలని అటు మీడియాలో ఇటు సోషల్ వాల్స్ మీద ఓ ఐదు కారణాలు చక్కర్లు కొడుతున్నాయి.

వాటిలో ప్రధానమైంది జగన్మోహన్ రెడ్డి వైఖరి. మేధావులు వాదించినా.. ఆ కేంద్రం వారించినా ఐ డోంట్ కేర్ అన్నట్లుగా చేయాలనుకున్న పనులను తాను చేసుకుపోతున్నారు. పద్ధతి మార్చుకోకపోతే రాష్ట్రంతో పాటు కేంద్రానికి తలనొప్పులు తప్పవని కేంద్రమంత్రులు లేఖలు రాసుకున్నా ఈ సీఎం పూచికపుల్ల మాదిరి పక్కన పెట్టేశారు. అసలు ఎందుకీ ఏకపక్ష నిర్ణయాలని కేంద్రం అడిగినా అన్నీ ఆరోపణలే కానీ ఎక్కడా రుజువులూ పంపడం లేదు.

వాటి ఫలితమే ఇప్పుడు ఈ ఢిల్లీ పర్యటనగా కొన్ని మీడియా సంస్థలు వండి వార్చేశాయి. నా రాష్ట్రం నా ఇష్టం అన్నట్లు సీఎం చేసుకుంటుంటే.. నా దేశంలో అందులో మీదో రాష్ట్రం అన్నట్లు కేంద్రం కబురంపిందని వాటి సారాంశం.

ముందుగా పోలవరం టెండర్ల విషయానికొస్తే అదేతో ఆంధ్రప్రదేశ్ సొంత ప్రాజెక్ట్ అన్నట్లు పాత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లను పిలిచేశారు. కనీసం కేంద్ర అనుమతి కూడా అడగలేదు. అడగకుండానే ప్రాజెక్ట్ అధారిటీ టెండర్లు వద్దని చెప్పినా సీఎం చెవికి ఎక్కనేలేదు. కేంద్రం నివేదికలతో సహా ఇదేంటని అడిగితే ఆరోపణలొచ్చాయి.. రద్దుచేశామని సమాధానమిచ్చారు. కానీ ప్రాజెక్టుకు కాసులు మాత్రం ఆ కేంద్రమే ఇవ్వాలి కదా.. ఇప్పుడు జగనే ఆ కేంద్రం వద్దకు వెళ్తున్నారు.

ఇక పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ల (పీపీఏ)ల విషయానికి వస్తే ఇది మీ రాష్ట్రానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు.. తేడాకొడితే దేశవ్యాప్తంగా పెట్టుబడులపై దెబ్బపడుతుందని కేంద్రం ఒకటి రెండు సార్లు లేఖలు రాసిన తర్వాత కానీ సీఎంఓ నుండి లేఖ వెళ్ళింది. అది కూడా ఆరోపణలొచ్చాయి.. పారదర్శకత కోసమే సమీక్షలని సమాధానం. ఆ సమీక్షల ఫలితంలో వాటాలు ఇప్పటికే రాష్ట్రంలో చీకట్ల రూపంలో కమ్ముకొచ్చాయి.

రాజకీయంగానూ ఏపీలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ నేతల నుంచే అభ్యంతరాలు వస్తున్నాయి. రాష్ట్రంలో పోలీసు పాలన చేస్తున్నారని ఈమధ్య ఏపీకి వచ్చిన ఆరెస్సెస్ నేతలకు ఏపీ బీజేపీ నేతలు నివేదకల మీద నివేదికలు ఇస్తున్నారు. మతపరమైన వ్యవహారాలలో కూడా ఏపీ బీజేపీ నేతలకు సీఎం వ్యవహారం నచ్చడం లేదు. త్వరలోనే ఏపీ బీజేపీ నేతలు ప్రభుత్వంపై తిరుగుబాటుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

తాజాగా సిబిఐ.. మాకు ముఖ్యమంత్రైనా.. సామాన్య సిటిజన్ అయినా ఒక్కటే తప్పక ప్రతి శుక్రవారం కోర్టుకొచ్చి కనిపించాల్సిందేనని తేల్చిచెప్పింది. అభియోగాలున్నప్పుడు మేము చెప్పింది వినాల్సిందేనని కౌంటర్ వేసింది. వారంలో ఒకరోజు సీఎం కోర్టుల చుట్టూ తిరిగితే ఇంకేమైనా ఉందా? ప్రస్తుతం కోర్టులో ఇంకా విచారణ పూర్తికాలేదు.. తీర్పురాలేదు కానీ వచ్చేలోపే సీఎం ఢిల్లీ టూర్ వెళ్తున్నారు.. ఏమై ఉంటుందబ్బా?

ఇక రాష్ట్రంలో కొన్ని కొత్తపథకాలకు కేంద్ర ఆర్ధిక సాయం కావాల్సివుండగా ఇప్పటికే ప్రతినెలా జీతభత్యాలు, నెలవారీ సంక్షేమ కార్యక్రమాల కోటాకే ప్రభుత్వ ఆదాయం సరిపోవడం లేదు. ఇక ప్రస్తుతం ఆర్ధిక సంక్షోభంతో పాటు విద్యుత్ సంక్షోభం కూడా తోడైంది. ఈ సంక్షోభాలన్నింటినీ ఎదుర్కోవాలంటే కచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సాయం కావాలి. ఈ పరిస్థితుల్లోనే సీఎం జగన్ ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కుతున్నారని అటు రాజకీయ వర్గాలు.. ఇటు మీడియా వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. మరి నిన్న లైట్ తీసుకున్న కేంద్రాన్ని ఇప్పుడు ఎలా కన్విన్స్ చేస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle