newssting
BITING NEWS :
*ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి* కర్నాటక సీఎం యడియూరప్ప కేబినెట్ విస్తరణ..17మందికి ఛాన్స్ *పంచాయతీరాజ్‌లో మరో రూ.300 కోట్ల పనులు రద్దు*పోలవరం రీ టెండరింగ్ పై హైకోర్టులో నవయుగ పిటిషన్ * కృష్ణా నదీ వరద ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన* చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్‌-2*రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ *అరుణ్ జైట్లీ ఆరోగ్యం విషమం.. వెంటిలేటర్ పై చికిత్స *పన్ను సంస్కరణలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి టాస్క్‌ఫోర్స్‌ నివేదిక

‘డ్వాక్రా’ పరమేశ్వర్ రావు ఇకలేరు

10-06-201910-06-2019 07:36:13 IST
Updated On 24-06-2019 13:13:05 ISTUpdated On 24-06-20192019-06-10T02:06:13.305Z09-06-2019 2019-06-09T17:59:25.795Z - 2019-06-24T07:43:05.231Z - 24-06-2019

‘డ్వాక్రా’ పరమేశ్వర్ రావు ఇకలేరు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రముఖ సామాజిక వేత్త, భాగవతుల ట్రస్ట్ వ్యవస్థాపకుడు బీవీ పరమేశ్వర్ రావు గుండెపోటుతో కన్నుమూశారు. గత నెల 29న గుండె సంబంధిత ఇబ్బందితో విశాఖలో ఆస్పత్రిలో చేరిన పరమేశ్వర్ రావు ఆదివారం మరణించారు. గ్రామీణ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు పరమేశ్వర్ రావు. యలమంచిలి మండలం విశాఖలో ఆయన ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహించారు.

గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్య శిక్షణ, వివిధ సంక్షేమ పథకాలు, వేలాదిమందికి స్వయం ఉపాధి వంటి కార్యక్రమాలు చిత్తశుద్ధితో నిర్వహించారు. గ్రామీణ మహిళల జీవతాల్లో వెలుగులు నింపుతున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం డ్వాక్రా పథకానికి ఆద్యుడు పరమేశ్వర్ రావు అని చెబుతారు. ఈ ఆలోచనను ప్రధానిగా ఉన్న పీవీ నరసింహారావు అమలుచేశారు. కానీ ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు మాత్రం ఈ పథకాన్ని తన మానస పుత్రికగా చెప్పుకోవడం విశేషం. 

పరమేశ్వర్ రావు అమెరికాలోని పెన్సిల్వేనియా యూనివర్శిటీలో న్యూక్లియర్ సైన్స్ లో పీహెచ్ డీ చేశారు. అక్కడినించి విశాఖకు వచ్చిన పరమేశ్వరరావు తిరిగి ఏపీకి వచ్చారు. 1967లో డిమిలిలో గ్రామీణ విద్యార్ధుల కోసం పాఠశాల స్థాపించారు.

10 గ్రామాల పిల్లలకు ఇదే పెద్దదిక్కుగా ఉండేది. అక్కడే భాగవతుల ట్రస్ట్ స్థాపించారు. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధి, పేదరికం నిర్మూలనకు ఈ ట్రస్ట్ ఎంతగానో ఉపయోగపడింది. గ్రామీణ ప్రాంతాల మహిళలు స్వయం సహాయక బృందాలుగా ఏర్పడడానికి పరమేశ్వరరావు ఎంతగానో తోడ్పడ్డారు. ఈ స్వయం సహాయక బృందాలు తర్వాత డ్వాక్రా గ్రూపులుగా రూపాంతరం చెందాయి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle