newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

డ్రగ్స్ మత్తులో విశాఖ యువత చిత్తు.?

20-04-201920-04-2019 12:47:29 IST
Updated On 05-07-2019 16:10:55 ISTUpdated On 05-07-20192019-04-20T07:17:29.111Z20-04-2019 2019-04-20T07:17:26.812Z - 2019-07-05T10:40:55.403Z - 05-07-2019

డ్రగ్స్ మత్తులో విశాఖ యువత చిత్తు.?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న విశాఖ నగరం వివిధ నేరాలకు, మత్తు పదార్ధాల వినియోగానికి అడ్డాగా మారుతోంది. దీంతో యువత మత్తుకు చిత్తవుతున్నారు. పార్టీల పేరుతో లేట్ నైట్‌లు.. వీకెండ్ల పేరుతో లాంగ్ ట్రిప్సులు వేస్తూ తప్పుదోవ పడుతున్నారు. మూడు రోజుల క్రితం విశాఖలో జరిగిన ఓ రేవ్ పార్టీద్వారా ఈ మత్తు బాగోతం వెలుగులోకి వచ్చింది. కొంతమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో మరిన్ని వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి.

విశాఖ రుషికొండ సమీపంలో ఓ పార్టీలో డ్రగ్స్ వినియోగించిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 13న సోనీ అనే వ్యక్తి రుషికొండలో పార్టీ నిర్వహించాడు. అక్కడ డ్రగ్స్ వాడుతున్నారన్న సమాచారంతో పోలీసులు వెళ్లి తనిఖీలు చేసినా.. ఎలాంటి ఆధారాలు దొరకలేదు. పోలీసుల కన్నుకప్పి దాచిన డ్రగ్స్‌ను రెండు రోజుల తర్వాత రుషికొండ నుంచి తరలించేందుకు ప్రయత్నించిన సత్యనారాయణ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గోవా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు తేలింది.  పార్టీలో డ్రగ్స్ వాడిన మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి నగదు, డ్రగ్స్, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు సోనీ పరారీలో ఉన్నాడు. 

ఇదిలా ఉంటే విశాఖలో పలువురు యువతీయువకులు ఆన్‌లైన్లో నిషేధిత మాదకద్రవ్యాలను కొంటున్నట్టు విచారణలో తేలింది. ఇలాంటి యువత కోసమే కొన్ని మాదకద్రవ్యాల ముఠాలు అత్యంత రహస్యంగా ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లను నిర్వహిస్తున్నట్లు తేలింది. అలాగే వైజాగ్ మార్కెట్లోకి కూడా డ్రగ్స్ వచ్చాయని, డ్రగ్స్ మాఫియా చాలా సైలెంట్‌గా ఇక్కడ యువతకి మత్తుని అలవాటు చేస్తుందని తెలిసింది. దీంతో ఈ డ్రగ్స్ మాఫియా విశాఖలో ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి పోలీసులు సిద్ధం అవుతున్నారు.

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle