newssting
BITING NEWS :
* గోదావరిలో పర్యాటక బోటు మునక పలువురు గల్లంతు. *వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలకెన్నో ఇబ్బందులు.. ఇక పోరాటమే:పవన్ కళ్యాణ్ *.హైదరాబాద్ చేరుకున్న సత్య నాదెళ్ళ ...తండ్రి మాజీ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ అంత్యక్రియలు *బద్వేలులో భారీ అగ్నిప్రమాదం *హుజూర్‌నగర్‌ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్‌ ...కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతి *మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించారు ..కేసీఆర్ పై భట్టి విమర్శలు *నేడు భారత్‌–దక్షిణాఫ్రికా తొలి టి20

డోర్లు తెరిచారు.. ఫిరాయింపులకు వేళాయెరా!

30-08-201930-08-2019 09:44:55 IST
Updated On 30-08-2019 09:01:54 ISTUpdated On 30-08-20192019-08-30T04:14:55.963Z30-08-2019 2019-08-30T03:31:23.908Z - 2019-08-30T03:31:54.720Z - 30-08-2019

డోర్లు తెరిచారు.. ఫిరాయింపులకు వేళాయెరా!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నిక‌ల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ప్ర‌వాహంలా సాగిన నేత‌ల చేరిక‌లు ఎన్నిక‌ల త‌ర్వాత ఆగిపోయాయి. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన మూడు నెల‌ల నుంచి ఆ పార్టీలో ఒక్క నేత కూడా చేర‌లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేరిక‌ల‌కు ఆస‌క్తి చూపించ‌క‌పోవ‌డం, పార్టీలోకి వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్న వారికి కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌క‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణం.

Image result for varupula raja

వైసీపీలో చేరేందుకు అవ‌కాశం లేక‌పోవ‌డంతో తెలుగుదేశం పార్టీ ప‌ట్ల అసంతృప్తిగా ఉన్న నేత‌లు అయిష్టంగానే ఆ పార్టీలో కొన‌సాగుతున్నారు. మ‌రికొంద‌రు మాత్రం భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరుతున్నారు. ఇది రాజ‌కీయంగా వైసీపీకి ఇబ్బందిగా మారింది.

బీజేపీ బ‌లోపేతానికి, టీడీపీ పుంజుకోవ‌డానికి ఇదే కార‌ణ‌మ‌ని వైసీపీ నేత‌లు భావిస్తున్నారు. పైగా త్వ‌ర‌లోనే స్థానిక సంస్థ‌లు, మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో ఇప్పుడు పార్టీలో డోర్లు తెర‌వాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. 

క్లీన్ ఇమేజ్ ఉన్న నేత‌లు, వెంట‌నే ప‌ద‌వులు ఆశించ‌ని నేత‌ల‌ను చేర్చుకునేందుకు జ‌గ‌న్ ఓకే చెప్పార‌ట‌. దీంతో వైసీపీలోకి వ‌ల‌స‌లు మొద‌ల‌య్యే అవ‌కాశాలు కనిపిస్తున్నాయి. ప్ర‌ధానంగా తెలుగుదేశం పార్టీ నుంచి చేరిక‌లు ఉండ‌నున్నాయి.

నిన్న టీడీపీకి ముగ్గురు కీల‌క నేత‌లు గుడ్‌బై చెప్పాల‌ని నిర్ణ‌యించారు. తూర్పు గోదావ‌రి జిల్లా ప్ర‌త్తిపాడు నుంచి ఇటీవ‌ల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన వ‌ర‌పుల రాజా టీడీపీకి రాజీనామా చేసేశారు. ఆయ‌న టీడీపీని తీవ్రంగా విమ‌ర్శించ‌డంతో పాటు జ‌గ‌న్ పాల‌న‌ను మెచ్చుకున్నారు. దీనిని బ‌ట్టి త్వ‌ర‌లోనే ఆయ‌న వైసీపీలో చేర‌డం ఖాయంగా తెలుస్తోంది.

ఇక‌, విశాఖ‌ప‌ట్నం జిల్లాలో టీడీపీలో కీల‌కంగా ఉండే ఆడారి కుటుంబం కూడా వైసీపీలో చేరే అవ‌కాశం ఉంది. విశాఖ డెయిరీ ఛైర్మ‌న్ ఆడారి తుల‌సిరావు కుమారుడు ఆడారి ఆనంద్ టీడీపీకి రాజీనామా చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఆయ‌న సోద‌రి, య‌ల‌మంచిలి మాజీ మున్సిప‌ల్ ఛైర్‌ప‌ర్స‌న్ ర‌మాకుమారి కూడా ఇదే నిర్ణ‌యం తీసుకున్నారు. ఆడారి ఆనంద్ ఇటీవ‌లి పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో అనాక‌ప‌ల్లి స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. వీరి రాక‌తో జిల్లాలో వైసీపీకి బ‌లం పెర‌గ‌నుంది.

వ‌రుపుల రాజా, ఆడారి ఆనంద్‌తో మొద‌ల‌య్యే వ‌ల‌స‌లు కొన‌సాగుతాయ‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. చాలా మంది టీడీపీ నేత‌లు ఆ పార్టీలో చేరేందుకు ఆస‌క్తి చూపిస్తున్నార‌ని చెబుతున్నారు.

10 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సైతం త‌మ పార్టీలోకి వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని మంత్రి అవంతి శ్రీనివాస్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. రాయ‌ల‌సీమ‌కు చెందిన టీడీపీ నేత‌లు ప‌లువురు వైసీపీ నేత‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ని తెలుస్తోంది. నేత‌ల వ‌ల‌స‌ల‌తో టీడీపీకి మ‌రింత గ‌డ్డుకాలం ఎదురుకానుంది.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle