newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

డేటా లీకుల్లో దొందు దొందే- ఏపీ,టీఎస్ సర్కార్ల తప్పిదాలు

08-03-201908-03-2019 15:24:38 IST
Updated On 08-03-2019 15:24:32 ISTUpdated On 08-03-20192019-03-08T09:54:38.961Z08-03-2019 2019-03-08T07:12:46.664Z - 2019-03-08T09:54:32.114Z - 08-03-2019

డేటా లీకుల్లో దొందు దొందే- ఏపీ,టీఎస్ సర్కార్ల తప్పిదాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చేసిన తప్పులకు చెంపలేసుకోవాల్సిన ప్రభుత్వాలు ప్రశ్నిస్తే చెంపలు ఛెళ్లుమనిపిస్తున్నాయి. రెండు తెలుగు ప్రభుత్వాలూ దొందుకు దొందే ! ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని ప్రైవేట్ సంస్థలకు, వ్యక్తులకు అప్పగించడం ఒక తప్పైతే, అసలు అటువంటి సమాచారాన్ని నిర్లక్ష్యంతో పబ్లిక్ ప్లాటుఫారాలమీద పెట్టి అందర్నీ చూసుకోమంటూ డప్పులు కొట్టడం రెండో తప్పు. అదెలాగో మీరే చూడండి...!

అంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015-18 సంవత్సరాల్లో 20,71,913 మంది గర్భిణీ స్త్రీలు,బాలింతలకు సంబంధించిన ఆధార్ కార్డు నంబర్లను ప్రచురించింది. తెలంగాణ ప్రభుత్వం (ట్రెజరీ డిపార్ట్మెంట్) 2.5 లక్షలమంది పెన్షనర్ల ఖాతాల వివరాలతో పాటు వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్లను లీక్ చేసింది. ఆ తరువాత ఆ విభాగం డైరెక్టర్ కేఎస్‌ఆర్‌సి మూర్తి ఈ వివరాలన్నింటినీ వెబ్ సైటు నుంచి తొలగించాల్సిందిగా ఆదేశించారు. 

2017లో  సెంటర్ ఫర్ ఇంటర్నెట్ సొసైటీ 13.5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన డేటా లీక్ అయినట్లు గుర్తించింది. అది కూడా రెండు కేంద్రప్రభుత్వ సంస్థల వెబ్‌సైట్ల నుంచి సమాచారం బయటకొచ్చింది. దీనితోబాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన మరో రెండు వెబ్‌సైట్లు కూడా ఉండడం విశేషం. ఈ వ్యవహారాన్ని దిద్దుకోవాల్సిన యూఐడీఏఐ సంస్థ విషయాన్ని బయటపెట్టిన కంప్యూటర్ సొసైటీ సంస్థకు ఒక తాఖీదు పంపించడం గమనార్హం.

ఇక ఐదువందల రూపాయలు-10 నిమిషాలంటూ 2018 జనవరిలో ట్రిబ్యూన్ దినపత్రిక ప్రచురించిన వార్తా కథనం సంచలనమైంది. బజారులో 500 రూపాయలకే దొరుకుతున్న ఆధార్ సమాచారంపైన ఈ స్టోరీ సుదీర్ఘమైన కథనాన్ని ప్రచురించింది. కానీ షరా మామూలుగానే యూఐడీఏఐ సంస్థ దాన్ని ఖండించింది. అసలటువంటి అవకాశమే లేదంటూ తోసిపుచ్చింది.

సుప్రీంకోర్టులో  సైతం తన వాదనను సమర్ధించుకుంటూ ‘‘ఒకవేళ ఏవైనా లీకులంటూ జరిగితే ఈ సమాచారాన్ని సరిచూసుకునే సంస్థలు లేదా యూజర్ల ద్వారా ఎక్కడైనా జరిగి ఉండవచ్చు’’నంటూ చెప్పడం విశేషం.ఈ డాటాను దుర్వినియోగపరచడం ఒక నేరమని సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టంగా చెప్పించి. ఇది ప్రజల హక్కుల్ని భంగపరచడమేనని పేర్కొన్నది. 

అయితే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో ప్రదర్శించిన నిర్లక్ష్యాల్ని సాక్ష్యాధారాలతో సహా చూపించినప్పటికీ అక్కడ చలనం ఉండదు. ప్రస్తుతం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు డేటా చౌర్యంపై ఒకరిమీద మరొకరు కేసులు పెట్టుకునే స్థాయికి వచ్చాయి. అసలు ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని అత్యంత గోప్యంగా ఉంచాల్సిన ప్రభుత్వాలే వాటిని దుర్వినియోగపరుస్తున్న దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మరో సంగతేంటంటే... బీజేపీ ప్రతిపక్షంలో ఉండగా ఆధార్ కార్డుల ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే అధికారంలోకి రాగానే చడీచప్ప్పుడు లేకుండా దీన్నే కొనసాగించడం కొసమెరుపు. 

-సతీష్ బాబు 

గమనిక : ఈ వార్తాకథనంలో ఇచ్చిన వివరాలన్నీ 'డిస్మాంట్లింగ్ ఇండియా' అనే పుస్తకంలో ఉష రామనాధన్ అనే వ్యాసకర్త తన అధ్యాయంలో విపులంగానూ, సాక్షాధారాలతో ప్రచురించారు. లీకైన వివరాల్ని ఆయా తేదీలల్లో వెలువడిన పత్రికలకు సంబంధించిన ఇంటర్నెట్ లింకులను కూడా పొందుపరిచారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle