newssting
BITING NEWS :
*బెంగళూరు వన్డేలో టీమ్ ఇండియా విజయం. 3 వన్డేల సీరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ ఇండియా. 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలుపు *అమరావతిలో హైటెన్షన్.. అసెంబ్లీ ముట్టడికి టీడీపీ ప్లాన్*చంద్రబాబు ప్రజలకు వాస్తవాలు చెప్పడం లేదు. రాజధాని రైతులకు జగన్ కౌలు కూడా ఇచ్చారు. సామాన్యులకు రాజధానితో పనేముంది? అమరావతిలో పోలీసులకు చంద్రబాబు నీళ్లు కూడా ఇవ్వకుండా చేస్తున్నారు-హోంశాఖ మంత్రి సుచరిత *ఇవాళ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం *బెజవాడలో నేతలకు పోలీసుల నోటీసులు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు బోండా ఉమ, ఎంపీ కేశినేని నానికి నోటీసులు. ఎమ్మెల్సీలు బుద్దా, రాజేంద్రప్రసాద్, తంగిరాల సౌమ్య సహా పలువురు టీడీపీ నేతలకు నోటీసులు. వామపక్షాలు, జేఏసి నేతలకు కూడా పోలీసుల నోటీసులు *రేపటి కేబినెట్, అసెంబ్లీకి రహస్యంగా సిద్ధమవుతోన్న నోట్స్, బిల్లులు. గుంభనంగా సాగుతున్న ప్రభుత్వ చర్యలు*తెలంగాణలో ఊపందుకున్న మునిసిపల్ పోరు *తెరాస, కాంగ్రెస్ పార్టీలు ఒకేగూటి పక్షులు. తెరాస కు ఓటు వేస్తె ఎంఐఎం కు ఓటు వేసినట్టే. కేంద్రం ఇచ్చిన నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి. కేంద్రం నిధులపై కేటీఆర్ చర్చకు సిద్ధమా ? - లక్ష్మణ్ *విశాఖ: ఓట్ల కోసం గాజువాక.. రాజకీయాలకు అమరావతి కావాల్సి వచ్చిందా? గాజువాక ప్రజలకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలి-మంత్రి అవంతి శ్రీనివాస్

డేటా చోరీ కేసు ఏమైంది? జగన్ కు కన్నా లేఖ

08-12-201908-12-2019 10:48:16 IST
Updated On 11-12-2019 12:26:46 ISTUpdated On 11-12-20192019-12-08T05:18:16.591Z08-12-2019 2019-12-08T05:18:13.136Z - 2019-12-11T06:56:46.325Z - 11-12-2019

డేటా చోరీ కేసు ఏమైంది? జగన్ కు కన్నా లేఖ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు రాష్ట్రాల్లో 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు వెలుగులోకి వచ్చిన డేటా చోరీ కేసు సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. అయితే జగన్ సీఎం అయ్యాక ఈ కేసు ఏమైంది? ఐటీ గ్రిడ్స్ యజమాని అశోక్ ఎక్కడున్నారు? ఈ ప్రశ్నలు అందరి మెదళ్ళను తొలిచేస్తున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈమేరకు లేఖ రాయడంతో ఈ అంశం మళ్ళీ తెరమీదకు వచ్చింది.

ఎన్నికల ముందు జరిగిన డేటా చోరీ కేస్ దర్యాప్తు ఏమైందని ప్రశ్నించారు కన్నా లక్ష్మీనారాయణ. తెలుగు రాష్ట్రాలకు చెందిన 7కోట్ల మంది ప్రజల వ్యక్తిగత వివరాలు చోరీకి గురయ్యాయని మార్చిలో కేస్ నమోదు చేశారు. ఐటీ గ్రిడ్స్ యజమాని అశోక్ ని ఇంతవరకు ఎందుకు పోలీసులు ప్రశ్నించలేకపోయారని నిలదీశారు కన్నా లక్ష్మీనారాయణ.

ప్రజల వ్యక్తిగత వివరాల గోప్యత మీద ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా ఉందని గట్టిగా నిలదీశారు. ఐటీ గ్రిడ్స్ కేస్ నిందితుల్ని అరెస్ట్ చేయాలని కన్నా డిమాండ్ చేశారు. ఇలాంటి సున్నిత విషయాలను జగన్ ఎందుకు పట్టించుకోవడం లేదని కన్నా ప్రశ్నించారు. అధికారంలోకి రాకముందు ఒక విధంగా.. అధికారం చేపట్టాక మరో విధంగా ప్రవర్తిస్తున్నారని కన్నా దుయ్యబట్టారు.

Image result for IT grid case

హైదరాబాద్ మాదాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ.. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆధార్, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసిందని మాదాపూర్, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ అంశంపై టీడీపీ-టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నాయి. 

ఐటీ గ్రిడ్స్‌ కేసు విచారణకు ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్ ఏం చేసింది, ఎవరిని అరెస్ట్ చేసింది, వ్యక్తిగత సమాచారం ఎవరి దగ్గర ఉంది? ...ఇలా అనేక ప్రశ్నలు సామాన్య ప్రజానీకాన్ని తొలిచేస్తున్నాయి. తాజాగా కన్నా లేఖతో ఈ కేసు తాజా పరిస్థితి బయటపడుతుందేమో చూడాలి. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle