newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

‘డేటా కేసు’తో టీఆర్ఎస్ - వైసీపీ మైత్రి బయటపడిందా?

04-03-201904-03-2019 19:35:05 IST
Updated On 04-03-2019 19:55:43 ISTUpdated On 04-03-20192019-03-04T14:05:05.312Z04-03-2019 2019-03-04T14:02:42.948Z - 2019-03-04T14:25:43.876Z - 04-03-2019

 ‘డేటా కేసు’తో టీఆర్ఎస్ - వైసీపీ మైత్రి బయటపడిందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అవును తెలుగుదేశం పార్టీ సేకరించిన సమాచారం. తెలుగుదేశం పార్టీ తన సొంత వర్గాలతో తయారు చేయించుకున్న సమాచారం లేదా డేటా. 47 వేల మంది బూత్ కన్వీనర్లు రోజుకు మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షలమంది ఓటర్లను కలుస్తున్నారు. ఓటర్ల వద్ద నుంచి ఈ 47 వేల మంది బూత్ కన్వీనర్లు వారి కుటుంబ వివరాలు కుటుంబ సభ్యుల సంఖ్య జీవనోపాధి వీరికి లభిస్తున్న ప్రభుత్వ పథకాలు తదితర వివరాలతో పాటు వారు ఏ పార్టీకి ఓటు వేసేది కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఈ ఓటర్లు కలుసుకోవడం సమాచారం సేకరించడం గత నాలుగు నెలలుగా జరుగుతుంది. 

ఈ సమాచార సేకరణకు కావలసిన యాప్‌ను‌ ఐటి గ్రిడ్ సంస్థ తయారుచేసింది. బూత్ కన్వీనర్లు సేకరించిన సమాచారాన్ని ఆ సంస్థ క్లౌడ్ టెక్నాలజీ ద్వారా భద్రపరుస్తుంది. ఈ సమాచార సేకరణ నిన్న జరిగింది. ఈరోజు జరిగింది...రేపు కూడా జరుగుతుంది. మూడున్నర కోట్ల మంది ఓటర్లను కలుసుకోవడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. ఇలాంటి సమాచార సేకరణ ఈరోజు మొదలెట్టింది కాదు 1984వ సంవత్సరంలో ఆరు లక్షల మంది కార్యకర్తలు పూర్తి వివరాలను కంప్యూటర్ లో నిక్షిప్తం చేసిన ఘనమైన చరిత్ర తెలుగుదేశం పార్టీది అప్పటి నుంచి పార్టీ నిర్వహణలో సాంకేతికతను వినియోగిస్తూ వస్తుంది.

ఇది పార్టీ కోసం పార్టీ ద్వారా సేకరించబడిన సమాచారం. ఈ సమాచారం లేదా మీ డేటా మీద ఎటువంటి సందేహాలు అనుమానాలు ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులను సంప్రదించాలి. ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కానీ ఫిర్యాదు చేయవచ్చు. కానీ వైసీపీకి చెందిన ఫిర్యాదుదారులు తెలుగుదేశం  పార్టీ సేకరించిన డేటా మీద తమ అనుమానాలను తెలంగాణ పోలీసుల వద్ద ఫిర్యాదు చేశారు.

టీడీపీ సేకరించిన డేటాను తెలంగాణ పోలీసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వానికి చెందిన డేటాగా ప్రకటించడం పూర్తిగా హాస్యాస్పదం. సరైన విచారణ చేయకుండానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ డేటా లీక్ అయ్యిందా లేదా తస్కరించ బడిందా అనే వివరణ కోరకుండా ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ డేటాను ఐటి గ్రిడ్ సంస్థ దొంగిలించింది అని ప్రకటించటం దిగ్భ్రాంతి కలిగిస్తోంది.

నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన పోలీస్ వ్యవస్థ ఈ విధంగా ఉన్నత స్థాయి వ్యక్తుల కొరకు వారి అభీష్టాల మేరకు పనిచేయటం తీవ్ర గర్హనీయం. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ డేటా చోరీకి గురైందని లీక్ అయిందని ఏమన్నా సమాచారం ఇచ్చిందా? కనీసం తెలంగాణ పోలీసులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఈ విషయంపై సంప్రదించారా?  అలాంటిది ఏమీ లేదు. 

కానీ తెలంగాణ పోలీసులు వైసీపీకి చెందిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని తెలుగుదేశం పార్టీ తమ  కోసంసేకరించుకున్నడేటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డేటాగా చెప్తూ సదరు సంస్థలు మీద దాడి చేసి వారి యొక్క కంప్యూటర్లు స్వాధీనం చేసుకొని అమాయకులైన ఉద్యోగులను అక్రమంగా నిర్బంధించి సదరు సంస్థ అధిపతిని అరెస్టు చేయాలని ఉబలాటపడటం శోచనీయం.

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ చెప్తున్నట్టు ఐటి గ్రిడ్ సంస్థ ఇక్కడ ఉంది కాబట్టి మా పరిధి కింద వస్తుంది అనేటట్టు అయితే సదరు ఫిర్యాదు మీద కేసు పెట్టి విచారణ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియజేయవలసి ఉంటుంది.

కానీ ఆ విధంగా చేయకుండా అది ఏ డేటా అనేది నిర్ధారణకు రాకుండా అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డేటా అని  స్వీయ నిర్ధారణకు వచ్చి సదరు సంస్థ ఉద్యోగులను అరెస్టులు చేసి పత్రికా విలేకరుల సమావేశం పెట్టి హడావుడి చేయడం ద్వారానే వైసిపికి తెలంగాణ అధికార పార్టీకి మధ్య ఉన్న అవగాహన మేరకే ఈ విధంగా జరుగుతుంది అని తెలుగుదేశం పార్టీ విమర్శించటంలో తప్పేముంది?


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle