newssting
BITING NEWS :
*అక్రమ వలసదారులను పంపిస్తాం: హోం మంత్రి అమిత్ షా *నేడు, రేపు తెలంగాణ శాసనసభ.. రేపు మండలి సమావేశాలు *మున్సిపల్‌ చట్టాల బిల్లును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం *22న నింగిలోకి.. చంద్రయాన్‌–2 *కర్నాటకలో ఇవాళ కుమారస్వామి ప్రభుత్వ విశ్వాసపరీక్ష * కుల్ భూషణ్ కి రిలీఫ్.. పాక్ విధించిన మరణశిక్షను రద్దుచేసిన అంతర్జాతీయ న్యాయస్థానం * కర్నాటక అసెంబ్లీకి వెళ్లే ప్రసక్తే లేదు: రెబల్స్‌ *తిరుమలలో ఎల్1, ఎల్ 2, ఎల్ 3 దర్శనాలు రద్దు *ముంబయి పేలుళ్ల సూత్రధారి సయీద్‌ అరెస్టు

డెడ్ లైన్ పెట్టుకుని ఏం చేస్తారు పీకే ..?

25-02-201925-02-2019 11:58:25 IST
2019-02-25T06:28:25.644Z25-02-2019 2019-02-25T06:28:21.253Z - - 18-07-2019

డెడ్ లైన్ పెట్టుకుని ఏం చేస్తారు పీకే ..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈ ఎన్నికల్లో జనసేన ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల్లో తమ పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ముందుగా పార్టీకి దరఖాస్తు చేసుకోవాలని, సదరు దరఖాస్తులను పార్టీ స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని పార్టీ అధక్షుడు గతంలోనే ప్రకటించారు. దాని ప్రకారం ఈ రోజు అంటే సోమవారం అభ్యర్ధనలకు ఆఖరి రోజు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కూడా తన దరఖాస్తును కమిటీకి సమర్పించారు. 

ఇప్పటి వరకూ చాలా దరఖాస్తులు వచ్చాయని... ఇంకా కొన్ని నియోజకవర్గాలనుంచి రావాల్సినవి కూడా ఉన్నాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే అధికారికంగా ఈ విషయమై ఇప్పటి వరకూ ఎటువంటి సమాచారం లేదు. ఈ స్థానాలకు ఎన్నెన్ని దరఖాస్తులు వచ్చాయన్న వివరాలు తెలియదు. ఇదిలా ఉంటే అసలు జనసేనలోకి ఇప్పటివరకూ పేరున్న నాయకులెవరూ పెద్దగా రాలేదు. 

ఏపీలో బీజేపీ పరిస్థితిని గమనించి.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెతను బాగా వంటబట్టించుకున్న బీజేపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. అవతలి పార్టీల్లో టిక్కెట్లు రాని వాళ్ళు జనసేనలో రావచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇదిలా ఉంటే ఈ గడువు వ్యవహారమేంటన్నది అసలు ప్రశ్న. అయితే ఇటువంటి జంపింగ్‌లకు వేరే ద్వారాలు తెరుస్తారంటూ చెప్తున్నారు. అసలు వలస నేతలకు అసలైన ప్రత్యామ్నాయం జనసేన. టీడీపీ, వైసీపీల్లో టికెట్ల కోసం ప్రయత్నం చేసి రాకపోతే చివరి నిముషంలో గోడదూకుతారు నేతలు. ఇలా డెడ్ లైన్లు పెట్టుకోవడం అంత మంచిది కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంతకీ జనసేన టిక్కెట్ల కోసం అంత డిమాండ్ ఉన్నదా అని సోషల్ మీడియాలోనే కామెంట్స్. ఏం జరుగుతుందో  చూద్దాం !


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle