newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

డెట్రాయిట్ తరహాలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు రాజధానిగా ఏపీ..!

25-09-201925-09-2019 10:27:43 IST
Updated On 25-09-2019 12:19:24 ISTUpdated On 25-09-20192019-09-25T04:57:43.962Z25-09-2019 2019-09-25T04:57:41.931Z - 2019-09-25T06:49:24.652Z - 25-09-2019

డెట్రాయిట్ తరహాలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు రాజధానిగా ఏపీ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వచ్చే అయిదేళ్లలో ఏపీలో పది లక్షల ఎలెక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని 2019 ప్రారంభంలో విధానం రూపొందించుకున్న అంద్రప్రదేశ్ రాష్ట్రం ఆ స్వప్నాన్ని సాకారం చేసే దిశగా తొలి అడుగులు వేస్తోంది. ఆటోమొబైల్‌ రాజధాని అయిన అమెరికాలోని డెట్రాయిట్‌ తరహాలో దేశంలో ఎలక్ట్రిక్‌ కార్ల (ఈవీ) రాజధానిగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. వచ్చే అయిదేళ్లలో  రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తుండటమే కాకుండా ఈవీ తయారీ కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించినట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి చెప్పారు. దీనికి అనుగుణంగా కొత్త ఈవీ పాలసీని రూపొందించే పనిలో పరిశ్రమల శాఖ ఉందని తెలిపారు. 

కేవలం రాయితీలే కాకుండా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ, మౌలిక వసతులు కల్పించే విధంగా ఈవీ పాలసీని తయారుచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈవీ వాహన కంపెనీలతో సంప్రదింపులు జరిపామని, పాలసీలో ప్రతిపాదించాల్సిన అంశాలపై పరిశోధన సంస్థల సలహాలు తీసుకుంటున్నామని చెప్పారు. త్వరలోనే పాలసీని విడుదల చేస్తామన్నారు. ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థలు రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయన్నారు.

ఈవీ వాహనాలకు నిరంతర విద్యుత్‌ అవసరమని దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక పవర్‌గ్రిడ్‌లతోపాటు చార్జింగ్‌ పాయింట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని మంత్రి గౌతమ్‌రెడ్డి వివరించారు. అదేవిధంగా పవన, సౌర విద్యుత్‌ వంటివి అధికంగా ఉత్పత్తి అయితే ఆ విద్యుత్‌ను నిల్వ ఉంచడానికి స్టోరేజ్‌ బ్యాటరీలను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. దీనికోసం విశాఖ–విజయవాడల్లో పవర్‌గ్రిడ్, చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసే విధంగా పైలట్‌ ప్రాజెక్టు కింద పనులు మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. 

ఈ ప్రాజెక్టులో భాగస్వామి కావడానికి జపాన్‌కు చెందిన ఒక బ్యాంక్‌ ఆసక్తిని చూపిస్తోందని, త్వరలోనే వివరాలను వెల్లడిస్తామన్నారు. కంపెనీల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీతోపాటు, దాని అనుకూల పత్రికలు చేసినదంతా తప్పుడు ప్రచారమని కంపెనీలు అర్థం చేసుకున్నాయన్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో కరోనా హవా.. తెలంగాణలో 5 లక్షలు, ఏపీలో 21 లక్షల కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా హవా.. తెలంగాణలో 5 లక్షలు, ఏపీలో 21 లక్షల కేసులు

   an hour ago


రాముడి దివ్య మందిరానికి ఇవాళే శ్రీకారం

రాముడి దివ్య మందిరానికి ఇవాళే శ్రీకారం

   3 hours ago


ములుగులో మావోల అరెస్ట్

ములుగులో మావోల అరెస్ట్

   4 hours ago


కీలక కేబినెట్ భేటీ.... పదవీవిరమణ వయసుపెంపుపై ఆర్డినెన్స్

కీలక కేబినెట్ భేటీ.... పదవీవిరమణ వయసుపెంపుపై ఆర్డినెన్స్

   4 hours ago


కరోనా చికిత్సల కోసం భారీగా వైద్య సిబ్బంది నియామకం

కరోనా చికిత్సల కోసం భారీగా వైద్య సిబ్బంది నియామకం

   4 hours ago


రైతులకు కష్టం రానివ్వం.. చాలినన్ని యూరియా నిల్వలు

రైతులకు కష్టం రానివ్వం.. చాలినన్ని యూరియా నిల్వలు

   4 hours ago


విశాఖను వదలని విషాదాలు.. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలపై జగన్ సీరియస్

విశాఖను వదలని విషాదాలు.. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలపై జగన్ సీరియస్

   5 hours ago


జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ..3రాజధానులకు 14వరకూ బ్రేక్

జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ..3రాజధానులకు 14వరకూ బ్రేక్

   17 hours ago


గంటా ఎంట్రీకి ముహూర్తం ఖరారు.. ఆగస్టు 16 ఫైనల్ !

గంటా ఎంట్రీకి ముహూర్తం ఖరారు.. ఆగస్టు 16 ఫైనల్ !

   a day ago


ఏపీలో మరికొందరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

ఏపీలో మరికొందరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle