newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

డీఎల్‌కు పెద్ద క‌ష్టమే వ‌చ్చింది..!

07-03-201907-03-2019 11:40:30 IST
Updated On 08-03-2019 18:55:19 ISTUpdated On 08-03-20192019-03-07T06:10:30.993Z07-03-2019 2019-03-07T06:10:28.670Z - 2019-03-08T13:25:19.679Z - 08-03-2019

డీఎల్‌కు పెద్ద క‌ష్టమే వ‌చ్చింది..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
డీఎల్‌ ర‌వీంద్రారెడ్డి... రెండు తెలుగు రాష్ట్రాల్లో సీనియ‌ర్ నేత‌ల్లో ఆయ‌న ఒక‌రు. ఏకంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ముగ్గురు ముఖ్యమంత్రుల వ‌ద్ద మంత్రిగా ప‌నిచేశారు. కడప జిల్లాలోనే కాక రాయ‌ల‌సీమ ప్రాంతంలోనూ ఒకానొక స‌మ‌యంలో చ‌క్రం తిప్పారు. త‌న సిఫార్సుతో ప‌లువురికి టిక్కెట్లు కూడా ఇప్పించారు. అటువంటి వ్యక్తి ఇప్పుడు దిక్కు తోచ‌ని స్థితిలో ఉన్నారు. ఏ పార్టీలో చేరాలో అర్థం కాక‌.. రాజ‌కీయాల‌ను పూర్తిగా వ‌దిలేయ‌లేక మీమాంస‌లో ప‌డిపోయారు. 

మ‌రోసారి పోటీ చేయాల‌నుకుంటున్న ఆయ‌న క‌ల‌ను ఏ పార్టీ కూడా నెర‌వేర్చే అవ‌కాశం కనిపించడం లేదు. వైసీపీ, టీడీపీలను సంప్రదించిన ఆయ‌న వైపు ఎవరూ మొగ్గు చూప‌లేదు. దీంతో ఆయ‌న రాజ‌కీయ జీవితానికి ఇక పుల్ స్టాప్ పడ్డట్లేనా అనే చ‌ర్చ జ‌రుగుతోంది. క‌డ‌ప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యేగా 1978 నుంచి ఆరుసార్లు విజ‌యం సాధించిన డి.ఎల్‌.ర‌వీంద్రారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో తిరుగులేని నాయ‌కుడిగా ఎదిగారు. మొద‌టి నుంచీ కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగిన ఆయ‌న రాష్ట్ర విభ‌జ‌న దెబ్బకు ఆ పార్టీని వీడారు. ఈ ఎన్నిక‌ల్లో మ‌రోసారి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోవాల‌ని అనుకున్నారు. 

ఇందుకోసం జిల్లాలో బ‌లంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ వైపు చూశారు. ఆయ‌న అనుచ‌రులు నేరుగా వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను క‌లిసి డీఎల్‌కు టిక్కెట్ ఇవ్వాల‌ని కోరారు. మైదుకూరు నుంచి వైసీపీ త‌ర‌పున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ర‌ఘురామిరెడ్డి ఉండ‌టంతో మ‌ళ్లీ ఆయ‌న‌కే టిక్కెట్ ఇస్తామ‌ని, డీఎల్ ర‌వీంద్రారెడ్డి పార్టీలో చేరితే ఎమ్మెల్సీ ఇస్తామ‌ని జ‌గ‌న్ ఆప్షన్ ఇచ్చారు. అయితే, ఎమ్మెల్యేగానే పోటీ చేయాల‌నుకుంటున్న ఆయ‌న‌కు చంద్రబాబు నుంచి క‌బురు వ‌చ్చింది. అమ‌రావ‌తి వెళ్లి చంద్రబాబును క‌ల‌వ‌డంతో అంతా డీఎల్ టీడీపీలో చేర‌డం ఖాయ‌మైంది అనుకున్నారు.

అక్కడ ఇప్పటికే గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిన టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ టిక్కెట్ ఆశిస్తున్నారు. చంద్రబాబు కూడా ఆయ‌న వైపు మొగ్గు చూపారు. దీంతో టీడీపీలో చేరేది లేద‌ని ప్రక‌టించేసిన డీఎల్ ఇప్పుడు చంద్రబాబు వ్యవ‌హార‌శైలిపై పీక‌ల దాకా కోపంతో ఉన్నారు. త‌న‌ను టిక్కెట్ విష‌యంలో అవ‌మానించార‌ని కుమిలిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో నియోజ‌క‌వ‌ర్గంలో కార్యక‌ర్తల‌తో భేటీ అయిన ఆయ‌న టీడీపీ ఓట‌మే ల‌క్ష్యమ‌ని ప్రక‌టించారు.

ఆయ‌న ల‌క్ష్యం నెర‌వేరాలంటే వైసీపీకి మించిన ఆప్షన్ లేదు. దీంతో ఆయ‌న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవ‌కాశం క‌నిపిస్తోంది. టిక్కెట్ ద‌క్కకున్నా వైసీపీ నుంచి ఆహ్వానం వ‌స్తే ఆయ‌న చేరేందుకు సిద్ధంగా ఉన్నార‌ని అంటున్నారు. ముందుగా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో భారీ బ‌హిరంగ స‌భ నిర్వహించి బ‌ల ప్రద‌ర్శన చేయాల‌నుకుంటున్నారు. ఈ స‌భ త‌ర్వాత వైసీపీ నుంచి ఆహ్వానం వ‌చ్చి ప్రాధాన్యత ఇస్తామ‌ని హామీ ఉంటే ఆ పార్టీలో చేర‌తారు. లేదంటే స్వతంత్రంగా అయినా ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వాల‌నుకుంటున్నారు. మొత్తానికి రాజ‌కీయంగా చ‌క్రం తిప్పిన డీఎల్ ఇప్పుడు బీఫాం కోసం పార్టీల వ‌ద్ద చేతులు చాస్తున్నారు.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle