newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 71 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 1991 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు

06-04-202006-04-2020 11:02:15 IST
Updated On 06-04-2020 11:10:21 ISTUpdated On 06-04-20202020-04-06T05:32:15.525Z06-04-2020 2020-04-06T05:31:56.198Z - 2020-04-06T05:40:21.671Z - 06-04-2020

డబ్బులు పంచినవారిపై కేసులేవి? ఎస్ఈసీకి ఫిర్యాదులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఒకవైపు కరోనా వైరస్ తన ప్రతాపం చూపిస్తోంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వెయ్యిరూపాయల ఆర్థిక సహాయం పంపిణీ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎన్ రమేష్ కుమార్ కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. నగదు పంపిణీ చేసిన వైసీపీ అభ్యర్థుల పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, పదేళ్లపాటు ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలన్నారు.

రాష్ట్ర ప్రజలకు ఇచ్చే వెయ్యి రూపాయల కరోనా ఆర్థిక సహాయాన్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మలుచుకుంటోందని, అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా పాల్గొని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థులు చేత ప్రజలకు ఇప్పించారన్నారు. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అన్నారు. ఇది ఎన్నికల నియమావళిని, చట్టాన్ని ఉల్లంఘించడమేనన్నారు. ఇప్పటికే దౌర్జన్యాలు, దాడులు, బెదిరింపులు, పోలీసులచే అక్రమ కేసుల బనాయింపు వంటి అనైతిక చర్యలకు పాల్పడిన వైసీపీ రాష్ట్రంలో ఏకగ్రీవ స్థానాలను గెలుచుకున్నట్లుగా ప్రకటించుకుందని, అనేక లోపాలు, అధికార పార్టీ ప్రలోభాలతో ఇప్పటివరకు కొనసాగిన ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాలని కోరుతున్నామన్నారు రామకృష్ణ. 

దమ్ముంటే.. మీరు తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ద్వారా తక్షణమే అనర్హత వేటు వేయడంటూ టీడీఎల్పీ ఉపనేత, మాజీమంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ట్విట్టర్ వేదికగా వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అవినీతికి పాల్పడి.. వారు అక్రమాలకు పాల్పడినట్టు రుజువైతే అనర్హత వేటు వేసేందుకు ఆర్డినెన్స్ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని గుర్తు చేశారు.. సీఎం జగన్ చివరికి రాజకీయ ప్రయోజనాల కోసం కరోనా వైరస్‌ను సైతం వదలడం లేదన్నారు.

కరోనాతో ఉపాధి కోల్పోయిన పేదలకు ఇంటింటికి వెళ్లి అధికారుల సమక్షంలో సాయం అందించాలని తెలిపారు. కానీ స్థానిక సంస్థల్లో వైసీపీ అభ్యర్థులుగా పోటీ చేసేవారు తమ అనుచరగణంతో గుంపుగా వెళ్లి ఓటర్లకు నగదు, వస్తువులు పంచుతున్నారని ఆరోపించారు. లాక్‌డౌన్ సమయంలో అత్యవసర పనుల నిమిత్తం రోడ్లపైకి వచ్చే ప్రజలను చితకబాదుతున్న పోలీసులకు యథేచ్చగా రోడ్ల మీద తిరుగుతున్న వైసీపీ కార్యకర్తలు ఎందుకు కనిపించడం లేదన్నారు. 

ఇటు బీజేపీ నేతలు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం తలుపు తట్టారు. ప్రభుత్వం అందించే సాయం విషయంలో వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు జోక్యం చేసుకోకుండా చూడాలని ఎస్ఈసీ రమేష్ కుమార్‌ను కన్నా లక్ష్మీనారాయణ కోరారు.  కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ నెలకొనడంతో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు రూ.1000 పంపిణీ చేస్తోంది. అయితే, ఈ రూ.1000ని వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు పంపిణీ చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. 

ప్రభుత్వం చేసే సాయాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు రాజకీయ, ఎన్నికల ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కన్నా లక్ష్మీనారాయణ ఎస్ఈసీని కోరారు. వాస్తవానికి గ్రామ/ వార్డు వాలంటీర్ల ద్వారా ఆ డబ్బులను పంపిణీ చేయాల్సి ఉన్నా, వైసీపీ నేతలు దాన్ని హైజాక్ చేసి, స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వారే పంపిణీ చేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. తాము చేస్తున్న సాయాన్ని గుర్తు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో తమకే ఓటు వేయాలని బహిరంగంగానే అభ్యర్థిస్తున్నారని కన్నా తెలిపారు. న్నికల కోడ్‌ను ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో మార్పులు తెస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన విషయాన్ని కన్నా లక్ష్మీనారాయణ ప్రస్తావించారు. మొత్తం మీద వెయ్యిరూపాయల పంపిణీ వ్యవహారం రాజకీయ దుమారాన్ని రాజేస్తోంది. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle