newssting
BITING NEWS :
*ఆర్టీసీ జేఏసీ బంద్ విజయవంతం..బయటకు రాని బస్సులు.. పలువురు నేతల అరెస్ట్ *తెలంగాణ సీఎస్‌, టీఎస్ఆర్టీసీ ఎండీకి బీసీ కమిషన్‌ నోటీసులు *మంచిర్యాలలో రిటైర్డ్‌ ప్రభుత్వ వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ సోదాలు *ఇస్లామాబాద్ : పాక్ లో ఇమ్రాన్ కు నిరసన సెగలు*హైదరాబాద్ : ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ పద్మ ఆత్మహత్యాయత్నం *హైదరాబాద్ : బంద్ విజయవంతం-23న ఓయూలో ఆర్టీసీ బహిరంగ సభ*తెలంగాణ ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎపీలో నిరసనలు *అమరావతి : తెలుగుదేశాన్ని విలీనం చేస్తానంటే హై కమాండ్ తో మాట్లాడతా : జీవీఎల్*విజయవాడ : తెలుగుదేశం ఎమ్మెల్యే వంశీపై ఫోర్జరీ కేసు

ట్విట్టర్ వేదికగా బజారున పడ్డ బెజవాడ తమ్ముళ్ళు

14-07-201914-07-2019 22:47:13 IST
Updated On 15-07-2019 11:52:14 ISTUpdated On 15-07-20192019-07-14T17:17:13.031Z14-07-2019 2019-07-14T17:16:55.171Z - 2019-07-15T06:22:14.314Z - 15-07-2019

ట్విట్టర్ వేదికగా బజారున పడ్డ బెజవాడ తమ్ముళ్ళు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రంగా-నెహ్రూ కాలం నుంచి బెజవాడలో అంతే! ఇక్కడ రాజకీయం ఒకసారి రగులుకుంటే అది ‘ఊర మాస్’ లెక్కుంటుంది. ఇక్కడ లీడర్ల రూటే సెపరేటు. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్.. ట్రెండు ఏదన్నా కానీయండి, బెజవాడ బాబులకు అన్నీ ఒకటే. గల్లీలో సిల్లీ గొడవల్లానే వుంటాయి. కానీ, రాష్ట్ర రాజకీయాల్ని వేడెక్కిస్తుంటాయి. అందుకే, ‘మొదట విజయవాడలో మొదలవుతుంది.. ఆనక స్టేటంతా పాకుతుంది’ అని అంటుంటారు. 

విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఒకే పార్టీకి చెందిన ఈ ఇద్దరి మధ్య గత ఎన్నికల ముందు మొదలైన ఈ వార్ ప్రస్తుతం తార స్థాయికి చేరింది. ఆదివారం అందరూ ఇళ్లల్లో ఉన్న వేళ.. తిట్టుకుంటే తీరిగ్గా వినడానికి జనానికి కాస్త వెసులుబాటు ఉంటుందని భావించారో ఏమో తీవ్రంగా ‘ట్విట్టు’కున్నారు. 

‘నాలుగు ఓట్లు సంపాదించలేని వాడు నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేనివాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్‌ చేస్తున్నాడు. దౌర్భాగ్యం!’  అంటూ కేశినేని నాని మొదట ట్వీట్ చేశారు. ఇది పరోక్షంగా బుద్దా వెంకన్నను ఉద్దేశించి చేసిందని అందరికీ అర్ధమయ్యింది. బుద్దా వెంకన్న ఈమధ్య వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసి వరుసగా ట్వీట్లు పెడుతున్నారు. అది చూసే కేశినేని నాని పైవిధంగా అతన్ని ఎగతాళి చేశారని ట్వీట్లు చూసిన వారు అనుకున్నారు.

కేశినేని నాని ట్వీట్‌కు బుద్దా వెంకన్న వెంటనే రీట్వీట్‌ చేశారు. ‘సంక్షోభ సమయంలో పార్టీ కోసం, పార్టీ నాయకుడి కోసం పోరాడేవాడు కావాలి. ఇతర పార్టీ నాయకులతో కలిసి కూల్చేవాడు ప్రమాదకరం. నీలాంటి అవకాశవాదులు కాదు.. చనిపోయేవరకు చంద్రబాబు కోసం సైనికుడిలా పోరాడేవాడు కావాలి’ అంటూ వెంకన్న పరోక్షంగా నాని ఇటీవలి వైఖరిని తూర్పారబట్టారు. 

దానికి నాని ప్రతిస్పందించి, ‘నిన్నటిదాకా చంద్రబాబు కాళ్లు, రేపటి నుంచి విజయసాయిరెడ్డి కాళ్లు.. కాళ్లు కాళ్లే.. వ్యక్తులు తేడా!!!’ అంటూ బదులిచ్చారు. వీరిద్దరి మధ్యలో నాగుల్ మీరా రంగప్రవేశం చేశారు. ‘పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులి కాదు. పులి పులే నక్క నక్కే.. నాయకుని కోసం రాజీలేని పోరాటం చేసే తత్వం కేశినేని నాని డిఎన్‌ఎలోనే ఉంది.. ప్రజాక్షేత్రం నుండి గెలిచిన వారికే ప్రజానాయకులెవరో తెలుస్తుంది, కాగితం పులులకు కాదు’ అని ఘాటుగా జవాబిచ్చారు.

https://www.photojoiner.net/image/wWgDrZqL

కేశినేనికి వాయిస్ పెరగడంతో బుద్దా వెంకన్న వెంటనే మరో ట్వీట్ చేశారు. ‘చిరంజీవి నీకు రాజకీయ జన్మనిస్తే చిరంజీవిని అనరాని మాటలు అని చిరంజీవి పార్టీని కూల్చావు. చంద్రబాబు నీకు రాజకీయ పునర్జన్మనిస్తే ఇవాళ చంద్రబాబు గురించి శల్యుడిలా మాట్లాడుతున్నావు. విజయసాయిరెడ్డి మీద నేను పోరాడుతున్నానో, నువ్వు పోరాడుతున్నావో ప్రజలకు తెలుసు’ అంటూ నేరుగా మేటర్‌లోకి దిగిపోయారు.

ఇంత వాడిగా సమాధానం రావడంతో ఇక కేశినేని ట్విట్టర్ ట్రావెల్స్ ఆగలేదు. ‘రాజకీయ జన్మలు, రాజకీయ పునర్జన్మలు, రాజకీయ భవిష్యత్తులు గుళ్లో కొబ్బరి చిప్పల దొంగలకి, కాల్ మనీ గాళ్లకి, సెక్స్ రాకెట్ గాళ్లకీ, బ్రోకర్లకి, పైరవికారులకి అవసరం. నాకు అవసరం లేదు. అని నాని వాగ్బాణం సంధించారు.  

https://www.photojoiner.net/image/80bZWe2A

ఇంతలో మళ్లీ నాగుల్ మీరా జోక్యం చేసుకున్నారు. ‘పార్టీ కష్టకాలంలో చంద్రన్న ఆదేశంతో బాధ్యత తలకెత్తుకుని, కోట్లాది రూపాయిలు ఖర్చు పెట్టి, వస్తున్నా మీకోసం పాదయాత్రను దిగ్విజయంగా నిర్వహించి, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని విజయపథంలో నడిపించిన కేశినేని నాని కష్టంతోనే నీకు, నాకు పదవులు దక్కాయి గుర్తుపెట్టుకో..’ అంటూ బుద్దా వెంకన్నకు బుద్ది చెప్పే ప్రయత్నం చేశారు.

గంట వ్యవధిలోనే బుద్దా మరో ట్వీట్ చేశారు. ‘నీకు ఏంచేయాలో తెలియక అబద్దాలు ఆడుతున్నావు. ప్రజారాజ్యం నుంచి బయటికి వచ్చే ముందు ఆడిన ఆటలు ఈ పార్టీలో సాగవు’ అని కౌంటరిచ్చారు. 

అక్కడితో ఊరుకోకుండా ‘దళిత నాయకుడు, మాజీ స్పీకర్ బాలయోగి ఆస్తులన్నీ కాజేసిన దొంగ ఎవరో దేశం మొత్తానికి తెలుసు. ఒకే నెంబర్‌పై దొంగ పర్మిట్లతో బస్సులు నడిపిన దొంగవి నువ్వే కదా. నేను చెప్పాల్సిన నిజాలు చాలా ఉన్నాయి. వినే ధైర్యం నీకుందా.?’ అని బుద్దా వెంకన్న ‘ట్రావెల్స్’ తీగ లాగారు.  

కొడితే ఆగకుండా కొట్టాలన్నట్టు మళ్లీ వెంటనే మరో ట్వీట్ చేశారు. ‘నువ్వు చెప్పేవన్నీ అభాండాలు, నేను చెప్పేవన్నీ నిజాలు. బస్సుల మీద ఫైనాన్స్ తీసుకొని 1997లో సొంతంగా దొంగ రిసిప్ట్‌లు తయారుచేసుకుని ఫైనాన్స్ వారికి డబ్బులు చెల్లించకుండా నువ్వే దొంగ ముద్ర వేసుకుని కోట్లాది రూపాయిలకు ఫైనాన్స్ కంపెనీలకు ఛీట్ చేసిన నువ్వా ట్వీట్ చేసేది..’అంటూ వెంకన్న ట్విట్ల పురాణానికి ఈ పూటకి ఫుల్ స్టాప్ పెట్టారు.

ఈమధ్య విజయవాడలో ఓ సమావేశం నిర్వహించిన కేశినేని నాని.. వచ్చే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి నాగుల్‌మీరాను గెలిపించాలని మాజీ కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు. ఆ స్థానం నుంచి టికెట్‌ ఆశిస్తున్న బుద్దా వెంకన్నకు ఇది ఆగ్రహం తెప్పించిందని వినికిడి. అప్పటి నుంచి నాని, వెంకన్న మధ్య పరోక్షంగా మాటల యుద్ధం, వ్యంగ్యాస్త్రాలు కొనసాగుతున్నాయి. 

పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బెజవాడ నేతల తిట్ల బాగోతం ఎటువంటి విపరిణామాలకు దారితీస్తుందోనని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కలవరపడుతున్నాయి. వీరిద్దరిలో ఎవరినీ పిలిచి మందలించే పరిస్థితి అటు పార్టీ అధినేత దగ్గర కనిపించడం లేదు. కేశినేని నానిని గట్టిగా కోప్పడదామంటే బీజేపీ దళం కాచుకుని కూర్చుంది. మాజీ మంత్రి దేవినేని ఉమాపై వాగ్బాణాలు సంధించినప్పుడే నాని వైఖరి ఏమిటో పార్టీ అధినేతకు అర్ధం అయ్యివుంటుంది. తాజాగా నేతలిద్దరి మధ్య రగిలిన వివాదాన్ని ఆయన ఎలా పరిష్కరిస్తారో రాజకీయ వర్గాలన్నీ ఆసక్తిగా చూస్తున్నాయి.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle