newssting
BITING NEWS :
* అధికారిక లాంఛనాలతో అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి* తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర*ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్‌లో ఒకుహరాతో తలపడి విజయం సాధించిన పీవీ సింధు* పీవీ సింధుకు మోదీ,జగన్‌,కేసీఆర్‌, చంద్రబాబు, పవన్ అభినందనలు*పీవీ సింధు, ప్రణీత్‌కు రివార్డులు* రైలు పట్టాలపై సెల్ఫీకి రూ.2 వేల జరిమానా*అమెరికాలో కాల్పుల కలకలం..బాలిక దుర్మరణం *ఫ్రాన్స్‌లో నేడు జి-7 దేశాల సదస్సు… హాజరైన భారత ప్రధాని మోడీ *ఏపీలో మూడు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు..మాల, మాదిగ, రెల్లి కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు *ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స

ట్విట్టర్ పిట్ట కొంచెం.. తిట్ల మోత ఘనం..

03-07-201903-07-2019 07:49:17 IST
Updated On 03-07-2019 11:58:44 ISTUpdated On 03-07-20192019-07-03T02:19:17.461Z03-07-2019 2019-07-03T02:19:06.758Z - 2019-07-03T06:28:44.554Z - 03-07-2019

ట్విట్టర్ పిట్ట కొంచెం.. తిట్ల మోత ఘనం..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇప్పుడందరూ బహిరంగ వేదికలు వదిలేశారు. గంటలకొద్దీ ఉపన్యాసాలకు సన్యాసమిచ్చేస్తున్నారు. ప్రెస్ మీట్లు, ప్రెస్ కాన్ఫరెన్సులు అవసరమే లేదని కాన్ఫిడెంటుగా చెప్పేస్తున్నారు. సవాళ్లు, ప్రతి సవాళ్లు, విమర్శనాస్త్రాలు, వాగ్బాణాలు.. ఇప్పుడన్నీ ట్విట్టర్ నుంచే. మన లీడర్లు ట్రెండు మార్చారు. ఈ ట్రెండ్ సెట్టర్ ఎవరో కాదు, నారా లోకేశ్. 

ఆధునిక సాంకేతికతను తన ఇంటిపేరుగా ఘనంగా చెప్పుకునే నారా చంద్రబాబు వారసుడు కావడం వల్ల కాబోలు, లోకేశ్ ఈ విషయంలో తండ్రిని మించిపోయాడు. లీడర్ అంటే సాధారణంగా క్యాడర్‌ను నమ్ముతారు. కానీ, ఈ యువ కిశోరం ట్విట్టర్‌నే నమ్ముతాడు. అంచేతే, మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పెద్దగా కష్టపడకుండానే ట్విట్టర్‌లోనే ప్రత్యర్ధులపై ప్రచారాస్త్రాలు సంధించాడు. 

నారా వారసుణ్ని ఎక్కడ కొడితే మైండ్ బ్లాంక్ అవుతుందో తెలిసినవాడు కనుకనే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అదే ట్విట్టర్ నుంచి ప్రతి విమర్శలతో దాడులు మొదలుపెట్టాడు. దాంతో ఈమధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ట్విట్టర్ ఖాతాలలో రాజుకుని మన మొబైల్ ఫోన్లను హీటెక్కిస్తున్నాయి.

నారా లోకేశ్, విజయసాయిరెడ్డి ట్వీట్ల పుణ్యమా అని తెలుగుతల్లి మాత్రం తెగ మురిసిపోతోంది. ఎందుకంటే వీరి ట్వీట్లలో తెలుగు తేనెలూరిపోతోంది. ట్విట్టర్‌లో స్టయిలిష్ ఇంగ్లీష్.. అది కూడా మోడర్న్ యూసేజ్‌ ఉండాలని సెలబ్రిటీలు నెలకొల్పిన ప్రామాణికాలన్నీ ఈ సరికొత్త మదర్ టంగ్ ట్వీట్లతో కొట్టుకుపోతున్నాయి. 

నిజానికి తిట్టుకోడానికి తెలుగులో అయితేనే సౌలభ్యంగా ఉంటుంది. ఎంచక్కా చక్కటి పద ప్రయోగాలతో మైమరచిపోతూ తనివితీరా తెగ తిట్టుకోవచ్చు. కాకపోతే, ఈ తిట్లు, సారీ ట్వీట్లు ఎంతమందికి చేరతాయనేదే ఒక సందేహం. నారా లోకేశ్ ట్విట్టర్ ఫాలోవర్లు అక్షరాలా 6,06,762. ఈ ఫాలోవర్లు అందరూ నిజమైన ఫాలోవర్లు అనడానికి వీల్లేదు.

ఎందుకంటే వీరిలో అత్యధికులు కొనుక్కున్న వారే. సరిగ్గా పరిశీలించి చూస్తే టర్కీ నుంచీ, అజర్బైజాన్ నుంచీ, వియత్నాం నుంచీ కూడా ఫాలోవర్లు ఉంటారు. వీరికీ ఏపీకి ఎటువంటి సంబంధం ఉండదు. ఫాలోవర్లను ‘మెయింటెన్’ చేసే వాణిజ్య సంస్థలు ఉంటాయి. తమ ఫాలోవర్ల సంఖ్యను పెద్దదిగా చూపించుకోడానికి నాయకులు, సెలబ్రిటీలు వీరిని ఆశ్రయిస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే ‘అనుచర’ గణాన్ని మన నేతలు కొనుక్కుంటారు. 

నారా లోకేశ్ ట్విట్టర్ ఖాతాను చూస్తే వీరిలో ప్రవాసులు పెద్ద సంఖ్యలోనే ఉంటారనిపిస్తోంది. అసలు ఎంతమందికి వీరిలో ఏపీలో ఓటు హక్కు వుందో ఇతమిద్థంగా లెక్కకు అందదు. ట్విట్టర్ ఫాలోవర్లు అందరూ తమకు ఓట్లేసే వారే అని అసలు ఏ లీడరైనా అనుకుంటే అది వారి అమాయకత్వం. లోకేశ్ ఒక్కడనే కాదు, సామాజిక మాధ్యమాల్ని నమ్ముకున్న నేతలందరి ఖాతాలనూ పరీక్షించి చూస్తే, కనిపించని నిజాలెన్నో కళ్లకు కడతాయి. 

మరి ఎందుకు మన నేతలు ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాన్ని నమ్ముకుంటున్నారు? దీనికి ఆద్యుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. 2014 ఎన్నికల్లో తిరుగులేని ఓటు బ్యాంకును సంపాదించుకోవడంలో మోడీకి సోషల్ మీడియా ఒక టూల్‌గా ఉపయోగపడిందనేది ‘జగన్’ ఎరిగిన సత్యం. అందుకే అచ్చంగా 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత ‘పీకే’ బృందాన్ని దించాడు. రాజకీయ వ్యూహాలు రచించడమే కాకుండా సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ వ్యతిరేకతను ఎత్తిచూపడంలో ఈ బీహార్ ముఠా అద్భుతమైన చాకచక్యాన్ని ప్రదర్శించింది.

Image may contain: 3 people, people smiling

 సామాజిక మాధ్యమాలలో వందలకొద్దీ సమూహాల ద్వారా ఈ ప్రభుత్వ వ్యతిరేకత ‘చాపకింద నీరు’లా పొర్లుకుంటూ వచ్చేస్తూ అది చివరికి తన అధికార పీఠాన్నే ముంచెత్తుతుందని చంద్రబాబు బృందం అస్సలు ఊహించలేకపోయింది. ఓటమికి గల కారణాల్ని ఆనక తీరిగ్గా విశ్లేషించుకుంటూ సోషల్ మీడియా ప్రభావం ఇంత ఉందా అని తెలుసుకుని ఇప్పుడు సోష వచ్చి పడిపోయింది.

అందరికన్నా కాస్త ముందు తేరుకున్న నారా లోకేశ్ అంచేతే ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి సర్కారుపై ట్విట్టర్ నుంచి పదునైన అస్త్రాలు సంధిస్తున్నాడు. లోకేశ్ స్థాయికి తనెందుకని అనుకున్నాడో ఏమో జగన్ మాత్రం తను అనాల్సినవన్నీ విజయసాయితో అనిపిస్తూ ట్విట్టిస్తున్నాడని ఒక టాక్.


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle