newssting
BITING NEWS :
*దర్శకుడు రాంగోపాల్ వర్మపై కేసు.. సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశం * యూపీలో ఉన్నావ్ తరహా ఘటన .. మహిళపై అత్యాచారం.. సజీవ దహనానికి యత్నం *రణరంగంగా మారిన ఢిల్లీ..దక్షిణ ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్శిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత...క్యాబ్ కు వ్యతిరేకంగా ఆందోళన *హీరో బషీద్ అరెస్ట్...ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్..రుణాలు ఇప్పిస్తానంటూ మోసానికి పాల్పడినట్టు ఆరోపణ *తూర్పు గోదావరి జిల్లా హసన్ బాద్ లో ప్రమాదం..బైక్ ను ఢీ కొన్న ఐషర్ వ్యాన్..ముగ్గురి మృతి..మరొకరికి తీవ్ర గాయాలు *ముగిసిన నటుడు, రచయత గొల్లపూడి అంత్యక్రియలు..చెన్నైలోని కన్నమ్మపేట దహనవాటికలో తుది వీడ్కోలు *కాల్పులకు దారితీసిన రైతు భరోసా డబ్బుల పంపకం..విశాఖ ఏజెన్సీలోని హుకుంపేట మండలం రంగశీలలో ఘటన*ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ కాల్‌మనీ రగడ..తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట యువకుడి ఆత్మహత్యాయత్నం

ట్విట్టర్ ట్రెండింగ్ 'సేవ్ హిందూస్ ఫ్రం జగన్ రెడ్డి'

18-11-201918-11-2019 12:47:48 IST
Updated On 18-11-2019 14:52:31 ISTUpdated On 18-11-20192019-11-18T07:17:48.393Z18-11-2019 2019-11-18T07:17:40.579Z - 2019-11-18T09:22:31.843Z - 18-11-2019

ట్విట్టర్ ట్రెండింగ్ 'సేవ్ హిందూస్ ఫ్రం జగన్ రెడ్డి'
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాష్ట్రాల నుండి దేశాల వరకు ఇప్పుడు ప్రభుత్వాలను శాసించే స్థాయికి సోషల్ మీడియా చేరుతుంది. అమెరికా లాంటి ఉన్నత దేశాల రాజకీయాలపై కూడా ఈ సోషల్ మీడియా తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే ప్రతిపార్టీ ఈ సోషల్ మీడియా కార్యకలాపాల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రత్యర్థులపై విమర్శలు, ప్రభుత్వాల తప్పులను హైలెట్ చేస్తున్నాయి.

ఇక ఏపీ విషయానికి వస్తే గత అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ ఘోర పరాజయంలో సోషల్ మీడియా వాటా కూడా ఉందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రభావం తెలుసు కనుక సోషల్ మీడియా మీద ఆంక్షలకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారన్న కారణంగా టీడీపీకి చెందిన వ్యక్తులపై కేసులు కూడా బనాయించారు.

ప్రభుత్వం కేసులు బనాయించినా సోషల్ మీడియాలో ప్రచారం కట్టడి అయ్యే పరిస్థితిలు లేవన్నది కూడా స్పష్టంగా అర్ధమవుతుంది. ప్రభుత్వ చిన్నపాటి తప్పుడు నిర్ణయాలైనా, ప్రజా వ్యతిరేక నిర్ణయాలైనా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయిపోతున్నాయి. ట్విట్టర్ విషయానికి వస్తే ఇప్పటికే స్టిక్కర్ సీఎంగా విపరీతంగా ట్రెండ్ కాగా ఇప్పుడు 'సేవ్ హిందూస్ ఫ్రం జగన్ రెడ్డి' ట్యాగ్ పేరుతో విపరీతంగా ట్రెండ్ అవుతుంది.

ఏపీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మతమార్పిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయని, అందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే కారణమని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. టీటీడీలో తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలు, తిరుమల కొండపై కనీస వసతులు, ప్రసాదాలు ధరలను పెంచి పేదలకు శ్రీవారిని దూరం చేయాలని ప్రభుత్వం పన్నాగాలు చేస్తుందని ప్రచారం జరుగుతుంది.

అంతేకాకుండా టీటీడీలో ఉద్యోగులు క్రైస్తవ మతాన్ని స్వీకరించి ప్రార్ధనలకు వెళ్లడంతో పాటు మత మార్పిళ్లను ప్రోత్సహిస్తున్నారని, టీటీడీ ఉద్యోగులు చర్చిలలో ప్రార్ధనలు చేస్తున్న ఆధారాలతో సహా బయటపెట్టినా చర్యలు తీసుకొనే పరిస్థితులు లేకపోవడం, వాటికి వ్యతిరేకంగా గళం విప్పినందుకు సిఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ వంటివన్నీ ఉదాహరణగా సోషల్ మీడియాలో ప్రచారంలో భాగమయ్యాయి.

వీటికి తోడు రాష్ట్రంలో తెలుగు మీడియం రద్దు చేయడం కూడా తెలుగు సంస్కృతి, హిందూ సంప్రదాయాన్ని నాశనం చేయడం కోసమేనని కొందరు నేతలే ఆరోపణలు చేస్తుండగా సోషల్ మీడియాలో కూడా అదే తరహా ప్రచారం జరుగుతుంది. వీటికి తోడు త్వరలో సీఎం క్రైస్తవ పాస్టర్లకు నెలకు రూ5 వేల వేతనం కూడా ఇవ్వనున్నారు. ఇందు కోసం మార్గదర్శకాలను కూడా సిద్ధం చేస్తున్నారు.

అయితే హిందూ సంప్రదాయంలో అర్చకులు, ముస్లిం మౌజమ్ లకు నిర్దిష్ట ప్రమాణాలు ఉంటాయి. అదే క్రైస్తవ పాస్టర్లకు ఎలాంటి ప్రమాణాలు లేవు. నిజానికి అసలు రాష్ట్రంలో ఉన్న పాస్టర్లలో ఎక్కువమంది క్రైస్తవులగా గుర్తింపే ఉండదు. ప్రార్ధన, బైబిల్ పఠనం తెలిసిన వాళ్లంతా పాస్టర్లుగా చెలామణి అవుతున్న తరుణంలో ఏ విధంగా వారికి వేతనం చెల్లిస్తారు.. ఎవరి సొమ్ము వాళ్ళకు వేతనంగా పంచుతారని సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ హ్యాష్ ట్యాగ్ ఎక్కడకి వెళ్తుందో చూడాలి!

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle