newssting
BITING NEWS :
* తెలంగాణలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌..ఉ.7 గంటల నుంచి సా.5 గంటల వరకు కొనసాగిన పోలింగ్‌ *పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ *ముగిసిన కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారం*ఏపీ శాసనమండలిలో టెన్షన్..పోడియం ఎదుట బొత్స, లోకేష్ వాగ్వివాదం..టీడీపీ సభ్యుల మీదకు దూసుకు వెళ్లేందుకు యత్నించిన కొడాలి నాని*ఢిల్లీలో జనసేన అధ్యక్షుడు పవన కల్యాణ్‌.. కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తో భేటీ..పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల అంశంపై చర్చ..పవన్‌ వెంట పలువురు బీజేపీ నేతలు..మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి సంబందించినది..ఆ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోలేదు..అమరావతే ఏపీకి శాశ్వత రాజధాని..దానికోసం బలమైన కార్యాచరణ ప్రకటిస్తాం : పవన్ *అమరావతి: ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణకు ఏపీ అసెంబ్లీ తీర్మానం.. సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన హోంమంత్రి సుచరిత *ఏపీ అసెంబ్లీ: సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తనపై ఎథిక్స్ కమిటీకి సిఫార్సు.. సత్వరమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించిన స్పీకర్

టీడీపీ మ‌హిళా నేత‌ల‌ శిగ‌ప‌ట్లు..!

23-10-201923-10-2019 15:38:03 IST
2019-10-23T10:08:03.967Z23-10-2019 2019-10-23T10:07:55.884Z - - 23-01-2020

టీడీపీ మ‌హిళా నేత‌ల‌ శిగ‌ప‌ట్లు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎన్నిక‌ల సంఘం ఎస్సీ షెడ్యూల్ కులాల‌కు రిజ‌ర్వ్ చేసిన అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అనంత‌పురం జిల్లా శింగ‌న‌మ‌ల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఒక‌టి. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఈ ఏడాది జ‌రిగిన సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోటీచేసిన జొన్న‌ల గ‌డ్డ ప‌ద్మావ‌తి విజ‌యం సాధించారు. టీడీపీ అభ్య‌ర్ధి శ్రావ‌ణి ఓట‌మిపాల‌య్యారు. అయితే, ఓట‌మి త‌రువాత కూడా టీడీపీ నేత‌లు గుణ‌పాఠం నేర్చుకోకుండా పార్టీలో ఆధిప‌త్యం కోసం ఒక‌రిపై మ‌రొక‌రు కుట్ర రాజ‌కీయాలకు తెర తీస్తున్నార‌న్న టాక్  నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల నుంచి క‌నిపిస్తోంది.

సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన మాజీ మంత్రి శ‌మంత‌క‌మ‌ణి ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా కొన‌సాగుతున్నారు. 2014 ఎన్నిక‌ల్లో తాను త‌ప్పుకుని, త‌న కుమార్తె యామిని బాల‌ను రాజ‌కీయాల్లోకి తెచ్చిన శ‌మంత‌క‌మ‌ణి ఆ త‌రువాత ప‌ట్టు కోల్పోయారు. 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికైన యామిని బాల ప్ర‌భుత్వ విప్‌గా ప‌నిచేశారు.

అయితే, 2019 ఎన్నిక‌ల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే యామిని బాల‌ను చంద్ర‌బాబు ప‌క్క‌న పెట్టారు. మాజీ ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి ఒత్తిడి మేర‌కు కొత్త‌గా బండారు శ్రావ‌ణి అనే మ‌హిళ‌కు గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు టికెట్ ఇచ్చారు. చంద్ర‌బాబు తీరుపై శ‌మంత‌క‌మ‌ణి, ఆమె కుమార్తె యామిని బాల అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

ఎన్నిక‌ల్లో అంటీముట్ట‌న‌ట్టు ఉన్న ఈ త‌ల్లీ కూతుళ్లు మ‌ళ్లీ శింగ‌న‌మ‌ల‌పై ప‌ట్టు సాధించేందుకు ప్ర‌య‌త్నాల‌ను ప్రారంభించారు. శింగ‌న‌మ‌ల‌, గార్ల‌దిన్నె, బుక్క‌రాయ స‌ముద్రం, నార్ప‌ల‌, య‌ల్ల‌నూరు, పుట్లూరు మండ‌లాల్లోని త‌మ అనుచ‌రుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశాలు నిర్వ‌హిస్తూ మ‌ళ్లీ తామేవ‌స్తామంటూ ప్ర‌చారం చేసుకుంటున్నారు.

త్వ‌ర‌లోనే శింగ‌మ‌న‌ల ఇన్‌చార్జి బాధ్య‌త‌ల‌ను త‌మ‌కే అప్ప‌గిస్తార‌ని, అంద‌రూ త‌మ‌కే మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరుతున్నారు  . త‌ల్లీ కూతుళ్ల రాజ‌కీయంపై అప్ర‌మ‌త్త‌మైన బండారు శ్రావ‌ణి ఉన్న అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌ద్ద‌ని భావిస్తున్నారు. త‌న రాజ‌కీయ గురువు, గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ టికెట్ ఇప్పించిన జేసీ దివాక‌ర్‌రెడ్డి అందుబాటులో లేక‌పోయినా ఒంట‌రిగానే కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించేందుకు సిద్ధ‌మ‌య్యారు.

గ‌త ఎన్నిక‌ల్లో పోటీచేసిన త‌న‌నే శింగ‌న‌మల ఇన్‌చార్జిగా అధిష్టానం గుర్తిస్తుంద‌ని, కొత్త‌గా ఎవ‌రి జోక్యం ఆధిప‌త్యం అవ‌స‌రం లేదంటూ శ‌మంత‌క‌మ‌ణి, ఆమె కుమార్తె మాజీ ఎమ్మెల్యే యామిని బాల‌కు బండారు శ్రావ‌ణి చుర‌క‌లు అంటిస్తున్నారు. ఓ వైపు బండారు శ్రావ‌ణి, మ‌రోవైపు శ‌మంత‌క‌మ‌ణి, అలాగే శ‌మంత‌క‌మ‌ణి - యామిని బాల గ్రూపు రాజ‌కీయాల‌తో శింగ‌న‌మ‌ల టీడీపీ రెండుగా చీలిపోయింది.

పోటా పోటీ కార్య‌క్ర‌మాలు, వేర్వేరు మీటింగ్‌ల‌తో గంద‌ర‌గోళానికి తెర తీశారు. ఎవ‌రికి వారు తామే ఇన్‌చార్జిల‌మ‌ని చెప్పుకోవ‌డంతో టీడీపీ కార్య‌క‌ర్త‌లు అయోమ‌యానికి లోన‌వుతున్నారు. ఎన్నిక‌ల్లో ఓడిపోయినా నేత‌ల తీరు మార‌లేద‌ని, ఎంత‌సేపూ ప‌ద‌వుల కోసం, ఆధిప‌త్యం కోసం పాకులాడుతున్నారే కానీ, త‌మ స‌మ‌స్య‌ల‌ను ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేద‌ని శింగ‌న‌మల టీడీపీ కార్య‌క‌ర్త‌లు వాపోతున్నారు. 

 

 

నెల్లూరుపై న‌జ‌ర్ పెట్ట‌క‌పోతే అంతేనా..?

నెల్లూరుపై న‌జ‌ర్ పెట్ట‌క‌పోతే అంతేనా..?

   10 hours ago


రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది..మాజీ ఎంపీ జేసీ కామెంట్స్

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది..మాజీ ఎంపీ జేసీ కామెంట్స్

   10 hours ago


తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి.. ఓటేసిన ప్రముఖులు

తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల సందడి.. ఓటేసిన ప్రముఖులు

   11 hours ago


సెలెక్ట్ కమిటీకి 3 రాజధానుల బిల్లు..?

సెలెక్ట్ కమిటీకి 3 రాజధానుల బిల్లు..?

   12 hours ago


ఆ ఎమ్మెల్సీలకి టీడీపీ షాకిస్తుందా..?

ఆ ఎమ్మెల్సీలకి టీడీపీ షాకిస్తుందా..?

   13 hours ago


రింగ్ దాటితే మార్షల్స్‌ని ఎత్తుకుపొమ్మనండి .. టీడీపీ సభ్యులపై జగన్ ఫైర్

రింగ్ దాటితే మార్షల్స్‌ని ఎత్తుకుపొమ్మనండి .. టీడీపీ సభ్యులపై జగన్ ఫైర్

   14 hours ago


హైదరాబాద్ లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు!

హైదరాబాద్ లో ఆకాశాన్నంటుతున్న ఇళ్ల ధరలు!

   14 hours ago


సీఆర్డీయే రద్దుపై హైకోర్టులో రెండు వ్యాజ్యాలు.. వైసీపీకి షాక్ !

సీఆర్డీయే రద్దుపై హైకోర్టులో రెండు వ్యాజ్యాలు.. వైసీపీకి షాక్ !

   14 hours ago


ఎన్ఆర్ఐ పాలసీ.. ఎన్నికల వేళ సర్కార్ మరో ఆయుధం?

ఎన్ఆర్ఐ పాలసీ.. ఎన్నికల వేళ సర్కార్ మరో ఆయుధం?

   15 hours ago


రాజధానులపై బీజేపీ వైఖరి ఏంటి? పవన్ ఢిల్లీ టూర్‌పై సస్పెన్స్!

రాజధానులపై బీజేపీ వైఖరి ఏంటి? పవన్ ఢిల్లీ టూర్‌పై సస్పెన్స్!

   18 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle