newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

టీడీపీ, బీజేపీ విమర్శలపై అంబటి దెప్పిపొడుపులు

21-08-201921-08-2019 15:24:38 IST
Updated On 22-08-2019 15:31:27 ISTUpdated On 22-08-20192019-08-21T09:54:38.285Z21-08-2019 2019-08-21T09:54:36.190Z - 2019-08-22T10:01:27.669Z - 22-08-2019

టీడీపీ, బీజేపీ విమర్శలపై అంబటి దెప్పిపొడుపులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అంబటి రాంబాబు.. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఎమ్మెల్యే అయినా ఆయన మాటల దూకుడు అలాగే వుంటుంది. ఒకప్పుడు పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు అధికార పక్షంపై దూకుడుగా విమర్శలు చేసేవారు.

అధికారం చేజిక్కుంచుకున్నాక కూడా అంబటి అటు అసెంబ్లీలోనూ, బయట కూడా పార్టీ, ప్రభుత్వ వాణిని బలంగా వినిపిస్తున్నారు. తాజాగా టీడీపీ, బీజేపీ నేతల విమర్శలపై అంతెత్తున ఎగిరారు ఎమ్మెల్యే అంబటి రాంబాబు. వరద సమయంలో తన ఇల్లు మునిగి పోతుందని తెలిసే చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారని ఎద్దేవా చేశారు.

నాగార్జునసాగర్ గేట్లు మూసివేసిన తరువాత చంద్రబాబు హైదరాబాద్ పర్యటన ముగించుకుని విజయవాడ వచ్చారని, చంద్రబాబు ధోరణి చూస్తుంటే వరదలోను సింపతి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు.

కృష్ణా నదికి వరదలు సృష్టించడం మానవులకు సాధ్యమవుతుందా అని ఆయన ప్రశ్నించారు. చేయి నొప్పి ఉంటే హైదరాబాద్ వెళ్లడం ఏమిటి? విజయవాడలో డాక్టర్లు లేరా. చంద్రబాబుకు ఇల్లు లేదా? చంద్రబాబు హైదరాబాద్ వెళితే మరి లోకేష్ ఎక్కడికి వెళ్లారు?

అని అంబటి ప్రశ్నల వర్షం కురిపించారు. సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో దేవినేని ఉమా అక్రమ కట్టడాలను కూల్చివేస్తామని ప్రకటించలేదా అన్నారు అంబటి. ఏ అక్రమ కట్టడానికి నోటీసులు ఇస్తామన్నోరో అదే ఇంట్లో చంద్రబాబు ఉన్నారని, ఈ విషయంలో చంద్రబాబు ధోరణి హాస్యాస్పదంగా ఉందన్నారు..

సీఎం జగన్మోహన్ రెడ్డి తన ఇంటిని ముంచేశారని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, సీఎం జగన్ అమెరికా పర్యటనలో జ్యోతి ప్రజ్వలన చేయలేదని హిందు వ్యతిరేకి అంటూ, వాస్తవాలు తెలుసుకోకుండా అసత్యాలు మాట్లాడ్డం ఏంటన్నారు. అమెరికాలో ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా జ్యోతిని వెలిగిస్తారు.. అదే జగన్మోహన్ రెడ్డి చేశారన్నారు.

కమలవనంలో ఉన్న పచ్చ పుష్పాలు జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారన్నారు. సీఎం రమేష్ బీజేపీలో ఉన్న పచ్చ కోవర్ట్ అని అంబటి ఆరోపించారు. అటు బీజేపీ నేతలపై మండిపడ్డారు అంబటి. విజయవాడ నడిబొడ్డున దేవాలయాలను చంద్రబాబు కులగొడితే మాణిక్యాలరావు ఏమయ్యారు? సదావర్తి భూములను అన్యాయంగా వేలం పాట వేస్తే మాణిక్యాలరావు గుడ్లగూబలా చూస్తూ ఉండిపోయారన్నారు  దెప్పిపొడిచారు.

పచ్చ రక్తంతో బీజేపీ తన సహజత్వం కోల్పోతోందని, వాస్తవాలు తెలుసుకొని బీజేపీ నేతలు మాట్లాడాలని హితవు పలికారు. అసెంబ్లీని దేవాలయం అంటున్న కోడెల, దేవాలయంలో కొబ్బరి చిప్పలను కూడా ఎత్తుకుపోయారని విమర్శించారు. అప్పటి సీఎం చంద్రబాబు అశీస్సులతోనే కోడెల కోట్ల రూపాయల దోచుకున్నారని ఆరోపణలు చేశారు. అమరావతి, పోలవరంపై చేస్తున్న ప్రచారాలను నమ్మొద్దని హితవు పలికారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle