newssting
BITING NEWS :
*శబరిమలలో మండల-మకరవిళక్కు పూజలు ప్రారంభం.. ఏపీ మహిళల్ని వెనక్కి పంపిన కేరళ పోలీసులు *ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో దూసుకుపోతున్న భారత్.. 300 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమ్ ఇండియా*ఆర్టీసీ జేఏసీ డిమాండ్లను పరిష్కరించలేమని ఆర్టీసీ యాజమాన్యం ...హైకోర్ట్ కు అఫిడవిట్ *రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఇచ్ఛాపురం పర్యటన రద్దు *సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు *మధ్యాహ్నం 2గంటలకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ..శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ *ఎంఎంటిఎస్ లోకోపైలట్ చంద్రశేఖర్ మృతి... కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లోకో పైలట్*శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో భారీగా పోలింగ్‌..ఓటు హక్కు వినియోగించుకున్న 80 శాతం మంది ఓటర్లు

టీడీపీ, బీజేపీకి జ‌గ‌న్ అలా మేలు చేస్తున్నారా..?

25-08-201925-08-2019 09:05:05 IST
2019-08-25T03:35:05.251Z25-08-2019 2019-08-25T03:34:54.837Z - - 18-11-2019

టీడీపీ, బీజేపీకి జ‌గ‌న్ అలా మేలు చేస్తున్నారా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలోకి వ‌చ్చిన మూడు నెల‌లు తిర‌గ‌కుండానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అన్ని వైపులా శ‌త్రువులు త‌య్యార‌య్యారు. ఆరు నెల‌లు కొత్త ప్ర‌భుత్వానికి స‌మ‌యం ఇస్తామ‌ని ముందు చెప్పిన అన్ని పార్టీలూ నెల రోజుల‌కే వైసీపీ ప్ర‌భుత్వంపై యుద్ధం ప్ర‌క‌టించాయి.

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. ఇక‌, ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ వైసీపీతో స‌ఖ్య‌త‌తో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ ఇప్పుడు టీడీపీతో స‌మానంగా వైసీపీపై మాట‌ల‌దాడి చేస్తోంది. వీరికి జ‌న‌సేన‌, క‌మ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలు అద‌నం.

తెలంగాణ‌లో కేసీఆర్ గెలిచిన‌ట్లుగానే భారీగా సీట్లు సాధించి జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చారు. కానీ, తెలంగాణ‌లో ఇప్పుడు ప్ర‌తిప‌క్షాలు బ‌ల‌హీనంగా ఉన్నాయి. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పేరుతో కేసీఆర్ విసిరిన వ‌ల‌కు కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేలు వ‌రుస‌బెట్టి టీఆర్ఎస్‌లో చేరిపోయారు. దీంతో ఆ పార్టీ ప్ర‌తిప‌క్ష హోదా కూడా కోల్పోయింది. దీంతో కేసీఆర్‌ను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోలేక‌పోతోంది.

అయితే, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 151 సీట్ల‌తో భారీ విజ‌యాన్ని జ‌గ‌న్ సొంతం చేసుకున్నాక అస‌లు టీడీపీ తిరిగి కోలుకుంటుందా అని అంతా అనుకున్నారు. అనేక మంది టీడీపీ నేత‌లు, ఎమ్మెల్యేలు కూడా వైసీపీలోకి వ‌చ్చేందుకు మొగ్గు చూపార‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది.

అయితే, ఎవ‌రినీ చేర్చుకునేందుకు జ‌గ‌న్ ఆస‌క్తి చూపించ‌లేదు. పార్టీలో చేరే వారు ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి రావాల‌ని ష‌ర‌తు పెట్టారు. ఇది రాజ‌కీయంగా తెలుగుదేశం పార్టీకి బాగా క‌లిసివ‌చ్చింది.

భార‌తీయ జ‌న‌తా పార్టీలోకి కొంద‌రు నేత‌లు వెళ్లినా టీడీపీకి అంత‌టి దారుణ ప‌రాజ‌యం ఎదురైనా పెద్ద‌గా దెబ్బ ప‌డ‌లేదు. అదే కేసీఆర్ మాదిరి జ‌గ‌న్ కూడా ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ను ప్రారంభించి ఉంటే జారిపోతున్న నేత‌ల‌ను కాపాడుకునేందుకే చంద్ర‌బాబు స‌మ‌యం స‌రిపోయేది.

పైగా జ‌గ‌న్ పాల‌న బాగుండే చేరిక‌లు జ‌రుగుతున్నాయ‌నే భావ‌న ప్ర‌జ‌ల్లోకి వెళ్లి.. ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లు ఫెయిల్ అయ్యేవి. కానీ, జ‌గ‌న్ వైసీపీ డోర్లు తెర‌వ‌క‌పోవ‌డంతో టీడీపీ ఓట‌మి నుంచి త్వ‌ర‌గానే బ‌య‌ట‌ప‌డి బ‌లంగా త‌యార‌వుతోంది. అదే జ‌గ‌న్‌.. శ‌త్రువును దెబ్బ మీద దెబ్బ కొట్టాల‌ని భావించి ఉంటే టీడీపీ ఇంత‌లా ప్ర‌భుత్వంపై ఎదురుదాడి చేసేది కాదు.

ఇక‌, జ‌గ‌న్ త‌న పార్టీలోకి ఎవ‌రినీ చేర్చుకునేందుకు ఆస‌క్తి చూప‌క‌పోవ‌డంతో భార‌తీయ జ‌న‌తా పార్టీకి బాగా క‌లిసి వ‌చ్చింది. వైసీపీలోకి వెళ్ల‌లేని నేత‌లు ప్ర‌త్యామ్నాయంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపు చూస్తున్నారు. దీంతో కాషాయ పార్టీలోకి చేరిక‌లు పెరిగి కొత్త జోష్ వ‌చ్చింది. దీంతో ఆ పార్టీ కూడా వైసీపీకి రాజ‌కీయంగా బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థిగా ఎదుగుతోంది.

అధికారంలోకి వ‌చ్చాక పాల‌నా వ్య‌వ‌హారాల‌పైనే దృష్టి పెట్టిన జ‌గ‌న్ రాజ‌కీయంగా పెద్ద‌గా ఆలోచించ‌డం లేదు. గెలిచాక ఒక్క‌రంటే ఒక్క నేత‌ను కూడా వైసీపీలో చేర్చుకోలేదు. ఇదే స‌మ‌యంలో టీడీపీ, బీజేపీ పూర్తిగా రాజ‌కీయ వ్యూహాలు ప‌న్నుతూ వైసీపీని ఇరుకున పెడుతున్నాయి.

ఇందుకు ఆ పార్టీకి అవ‌కాశం ఇచ్చింది మాత్రం జ‌గ‌నే. పార్టీ డోర్లు మూసేసి టీడీపీ నిల‌దొక్కుకునేందుకు, బీజేపీ బ‌ల‌ప‌డేందుకు ఇన్‌డైరెక్ట్‌గా సాయ‌ప‌డిన‌ట్లు క‌నిపిస్తోంది.

జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ సక్సెస్‌..!  కమ్మ వర్సెస్‌ కమ్మ!!

జగన్‌ మాస్టర్‌ ప్లాన్‌ సక్సెస్‌..! కమ్మ వర్సెస్‌ కమ్మ!!

   37 minutes ago


అధికారుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే..!

అధికారుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే..!

   2 hours ago


ఆ 70 కోట్ల కోసమే బీజేపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరుతారా..?

ఆ 70 కోట్ల కోసమే బీజేపీ మాజీ ఎమ్మెల్యే వైసీపీలో చేరుతారా..?

   6 hours ago


దీక్ష భగ్నం.. ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

దీక్ష భగ్నం.. ఆర్టీసీ జేఏసీ నేత అశ్వథ్ధామరెడ్డి అరెస్ట్

   9 hours ago


కేంద్రానికి చేరిన టీటీడీలో అన్యమతస్తుల వ్యవహారం

కేంద్రానికి చేరిన టీటీడీలో అన్యమతస్తుల వ్యవహారం

   11 hours ago


కాంగ్రెస్‌కు - ఎన్నిక‌ల‌కు సంబంధం ఉన్న‌ట్టా..?  లేన‌ట్టా..?

కాంగ్రెస్‌కు - ఎన్నిక‌ల‌కు సంబంధం ఉన్న‌ట్టా..? లేన‌ట్టా..?

   13 hours ago


పంచాయతీ ఎన్నికలు జరిపి తీరాల్సిందే.. హైకోర్టు

పంచాయతీ ఎన్నికలు జరిపి తీరాల్సిందే.. హైకోర్టు

   13 hours ago


జగ‌న్ ఓకే అంటే ఇద్ద‌రూ వ‌చ్చేస్తారట‌..!

జగ‌న్ ఓకే అంటే ఇద్ద‌రూ వ‌చ్చేస్తారట‌..!

   14 hours ago


తెలంగాణ ఆర్టీసీ చేతులెత్తేసిందా?

తెలంగాణ ఆర్టీసీ చేతులెత్తేసిందా?

   15 hours ago


నేనొప్పుకోను.. అవినీతి జరిగిద్ది! మంత్రులకు షాకిచ్చిన జగన్‌!!

నేనొప్పుకోను.. అవినీతి జరిగిద్ది! మంత్రులకు షాకిచ్చిన జగన్‌!!

   16 hours ago


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle