newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు *ఈసారి భక్తులు లేకుండానే భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలు *కరోనా వ్యాక్సిన్ తయారీకి సన్నాహాలు-కేంద్ర ఆరోగ్య శాఖ* అమెరికాలో సమ్మర్ ఇంటర్న్ షిప్ లు రద్దు ... భారతీయ విద్యార్థులకు భారీ నష్టం *కరోనా కేసులకు ప్రాంతాలుగా 10 హాట్ స్పాట్ లు... ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, యూపీలోని 10 ప్రాంతాల్లో అత్యధిక కరోనా కేసులు నమోదు అయినట్టు గుర్తింపు-కేంద్రం *తెలంగాణలో నిన్న 30 మందికి కరోనా నిర్ధారణ, ముగ్గురు మృతి, రాష్ట్రంలో తొమ్మిదికి చేరిన కరోనా మృతుల సంఖ్య*తెలంగాణలో 127 , ఆంధ్రప్రదేశ్ లో 111 కరోనా పాజిటివ్ కేసులు*భారత్ లో క్రమంగా పెరుగుతోన్న కరోనా.. నిన్న ఒకేరోజు 437 కొత్త కేసులు నమోదు, దేశంలో 1834 కి చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య*ఏపీలో 111 కు చేరుకున్న కరోనా పాజిటివ్ కేసులు... నిన్న ఒక్కరోజే 67 కొత్త కేసులు నమోదు

టీడీపీ ప్రతిష్టపై కేసుల మరకలు

28-08-201928-08-2019 09:46:07 IST
Updated On 28-08-2019 15:15:09 ISTUpdated On 28-08-20192019-08-28T04:16:07.910Z28-08-2019 2019-08-28T04:08:25.531Z - 2019-08-28T09:45:09.537Z - 28-08-2019

టీడీపీ ప్రతిష్టపై కేసుల మరకలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయాక ఆపార్టీ నేతలు ఒక్కొక్కరిపై కేసులు నమోదవుతున్నాయి. అసెంబ్లీ ఫర్నిచర్ తరలింపు, కంప్యూటర్ల మాయంపై మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అచ్చెన్నాయుడు అధికారులతో దురుసుగా ప్రవర్తించడం,  కూన రవికుమార్, సోమిరెడ్డి పై కేసులతో వివాదం రాజుకుంటోంది. తన హయాంలో అసెంబ్లీ ఫర్నీచర్‌ను తన వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నానని కోడెల అంగీకరించారు. దీంతో అసెంబ్లీ సెక్షన్ ఆఫీసర్ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కోడెల ఇల్లు, పార్టీ కార్యాలయంలో ఫర్నీచర్‌ను ఉపయోగించారని ఆయన ఫిర్యాదు చేశారు. కోడెల కుమారుడు శివరామకృష్ణ పైనా ఫిర్యాదు చేశారని సమాచారం. అసెంబ్లీ ఫర్నీచర్‌ను హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించే సమయంలో.. వాటిని కొత్త అసెంబ్లీకి కాకుండా నాటి స్పీకర్ కోడెల క్యాంపు ఆఫీసుకు దారి మళ్లించారు. ఈ విషయాన్ని కోడెల సైతం అంగీకరించారు. ఫర్నీచర్‌ను ప్రభుత్వానికి అప్పగిస్తానని తెలిపారు. 

క్యాంప్ ఆఫీసులోనే కాకుండా కోడెలకు చెందిన షోరూంలోనూ అసెంబ్లీ ఫర్నీచర్‌ను వాడారు. అసెంబ్లీలో మాయమైన విలువైన ఫర్నీచర్, సామాగ్రి విలువ రూ.2 కోట్లకు పైమాటేనని అధికారులు గుర్తించారు. అసెంబ్లీ ఫర్నీచర్‌ను కోడెల తన వ్యక్తిగత అవసరాలకు వాడటాన్ని అధికార వైఎస్ఆర్సీపీ సీరియస్‌గా తీసుకుంది. కోడెలకు ఇలాంటివేం కొత్త కాదని అధికార పార్టీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. 

తాజాగా తిరుపతి రుయా ఆస్పత్రిలో ల్యాబ్ నిర్వహణ దందా బయటపడింది. రుయా ఆస్పత్రిలో రూ.4 కోట్లకు పైగా విలువైన అత్యాధునిక పరికరాలున్నాయి. వైద్య పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన నిపుణులు ఉన్నారు.

అయినప్పటికీ అప్పటి స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌రావు ఒత్తిడి మేరకు రుయా ఆస్పత్రిలో ల్యాబ్‌ నిర్వహణను లక్ష్మీ వెంకటేశ్వర క్లినికల్‌కు ల్యాబ్‌ను అప్పగించారన్నది ఆరోపిస్తున్నారు. వైద్య పరీక్షల పేరిట ప్రతినెలా రోగుల నుంచి 40 లక్షల దాకా వసూలు చేస్తున్నట్టు సమాచారం. ఈ పరీక్షలను రుయా ఆస్పత్రి నిపుణులు సొంతంగా నిర్వహిస్తే కేవలం రూ.15 లక్షలే ఖర్చవుతుందని నిపుణులు చెబుతున్నారు. 

ఇటు టెక్కలి నియోజకవర్గంలోని కోటబొమ్మాళి మండలంలో అధికారులపై తీవ్రంగా వ్యవహరించిన టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై నెల్లూరు జిల్లా వెంకటాచలం పోలీస్‌స్టేషన్లో కేసు నమోదైంది.

ఇడిమేపల్లిలోని 2.40 ఎకరాలకు సంబంధించి దొంగ పత్రాలు సృష్టించారంటూ ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. దీనిలో సోమిరెడ్డి ఏ1 నిందితుడిగా ఉన్నారు. ఈ భూమిని కొన్న మేఘనాథ్, జయంతి, సుబ్బారాయుడు అనే వ్యక్తులపై కూడా కేసు నమోదు చేశారు.

ఇది చాలదన్నట్టుగా మాజీ విప్ కూన రవికుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రవికుమార్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధమైందని సమాచారం. తాజాగా రవికుమార్‌ ఆజ్ఞాతంలోనే ఉన్నారు. తమపై దౌర్జన్యం చేశారని పోలీసులకు సరుబుజ్జిలి ఎంపీడీవో ఫిర్యాదు చేశారు.

కూన రవి అరెస్ట్‌ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఆయన్ను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందని పోలీసులువర్గాలు చెబుతున్నాయి. రవికుమార్ ప్రభుత్వ ఉద్యోగులతో అనుచితంగా మాట్లాడారు. మహిళా ఉద్యోగితో  ఫిర్యాదుతో రవితో పాటు 12 మందిపై కేసు నమోదైంది. రవిని వెంటనే అరెస్ట్ చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వరుస వివాదాలు కేసులతో తెలుగుదేశం ప్రతిష్ట మసకబారుతోందని విమర్శలు వస్తున్నాయి. 

అప్సుడు జీన్స్ హబ్... ఇప్పుడు మాస్క్‌ల తయారీ అడ్డా!

అప్సుడు జీన్స్ హబ్... ఇప్పుడు మాస్క్‌ల తయారీ అడ్డా!

   5 hours ago


తెలుగు రాష్టాలలో నిఘా వ్యవస్థ నిద్రలోకి జారుకుందా?

తెలుగు రాష్టాలలో నిఘా వ్యవస్థ నిద్రలోకి జారుకుందా?

   6 hours ago


కాలుజారి మరణిస్తే వైద్యులపై రోగి బంధువుల దాడి.. గాంధీలో విధ్వంసం

కాలుజారి మరణిస్తే వైద్యులపై రోగి బంధువుల దాడి.. గాంధీలో విధ్వంసం

   6 hours ago


జగన్‌కు మీడియా ఫోబియా.. రికార్డెడ్ ప్రెస్‌మీట్లు షురూ!

జగన్‌కు మీడియా ఫోబియా.. రికార్డెడ్ ప్రెస్‌మీట్లు షురూ!

   7 hours ago


గోవులపై కరోనా ఎఫెక్ట్ .. దాణా కరువై ఆకలి అరుపులు

గోవులపై కరోనా ఎఫెక్ట్ .. దాణా కరువై ఆకలి అరుపులు

   8 hours ago


ప్రధాని మోడీ, అమిత్ షాతో జగన్ వీడియో కాన్ఫరెన్స్

ప్రధాని మోడీ, అమిత్ షాతో జగన్ వీడియో కాన్ఫరెన్స్

   9 hours ago


శంషాబాద్ నుంచి జర్మనీకి 38మంది తరలింపు

శంషాబాద్ నుంచి జర్మనీకి 38మంది తరలింపు

   10 hours ago


సింగరేణి  గనులలో లే ఆఫ్.. ఎమర్జెన్సీ ఉద్యోగులకు మినహాయింపు

సింగరేణి గనులలో లే ఆఫ్.. ఎమర్జెన్సీ ఉద్యోగులకు మినహాయింపు

   11 hours ago


గ్రామ వలంటీర్లకు జైహో.. ఒక్కరోజులో 93 శాతం మందికి ఫించన్లు

గ్రామ వలంటీర్లకు జైహో.. ఒక్కరోజులో 93 శాతం మందికి ఫించన్లు

   13 hours ago


ఒంటిమిట్టపై ఎందుకీ వివక్ష... చంద్రబాబు ఆవేదన

ఒంటిమిట్టపై ఎందుకీ వివక్ష... చంద్రబాబు ఆవేదన

   13 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle